Movies# NBK 107 - # NBK 108... బాల‌య్య కొత్త...

# NBK 107 – # NBK 108… బాల‌య్య కొత్త సినిమాల టైటిల్స్ వెన‌క కొత్త సెంటిమెంట్‌..!

న‌ట‌సింహం బాల‌కృష్ణ బ‌ర్త్ డే వ‌చ్చింది.. వెళ్లిపోయింది. బాల‌య్య కెరీర్ ఎప్పుడూ లేనంత స్వింగ్‌లో అయితే ఉంది. అఖండ బ్లాక్‌బ‌స్ట‌ర్‌తో ఇచ్చిన జోష్ ఓ వైపు.. మ‌రోవైపు అన్‌స్టాప‌బుల్ సీజ‌న్ 1 స‌క్సెస్ అవ్వ‌డం.. ఇప్పుడు త్వ‌ర‌లోనే రెండో సీజ‌న్ కూడా స్టార్ట్ అవుతుండ‌డంతో నంద‌మూరి, బాల‌య్య అభిమానుల జోష్ అయితే మామూలుగా లేదు. ఇక ప్ర‌స్తుతం బాల‌య్య రెండు క్రేజీ ప్రాజెక్ట్స్‌లో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే.

మైత్రీ మూవీస్ వాళ్లు మ‌లినేని గోపీచంద్ రూపొందిస్తోన్న 107వ సినిమాతో పాటు ఆ త‌ర్వాత అనిల్ రావిపూడి రూపొందించే 108వ సినిమాలో కూడా బాల‌య్య న‌టిస్తున్నాడు. మ‌లినేని గోపీ సినిమా పూర్త‌యిన వెంట‌నే అనిల్ రావిపూడి సినిమా ప‌ట్టాలు ఎక్కేస్తుంది. వాస్త‌వానికి బ‌ర్త్ డే గిఫ్ట్‌గా ఫ్యాన్స్ కోసం ఈ రెండు సినిమాల టైటిల్స్ వ‌స్తాయ‌ని ఆయ‌న అభిమానులు ఆశ‌లు పెట్టుకున్నారు.

అయితే ఈ రెండు సినిమాల టైటిల్స్ మేకర్స్ బ‌య‌ట‌కు వ‌ద‌ల్లేదు. అయితే ఈ రెండు సినిమాల‌కు టైటిల్స్ అయితే ఫిక్స్ అయిపోయాయ‌న్న ప్ర‌చార‌మే ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో బ‌లంగా న‌డుస్తోంది. మ‌లినేని గోపీ – మైత్రీ వాళ్ల సినిమాకు రెడ్డి పేరున్న టైటిల్‌తో పాటు ప‌లు టైటిల్స్ వినిపించాయి. అయితే ఫైన‌ల్‌గా క్యాచీగా ఉంటుంద‌ని జై బాల‌య్య టైటిలే ఫిక్స్ చేసిన‌ట్టు టాక్ ? ఈ టైటిల్ ఎనౌన్స్‌మెంట్ ఒక్క‌టే మిగిలింది.

ఇక సాహు గార‌పాటి – అనిల్ రావిపూడి సినిమాకు బ్రో ఐ డోంట్ కేర్ టైటిల్ అనుకుంటున్నార‌ట‌. ఈ సినిమాలో శ్రీ లీల బాల‌య్య‌కు కూతురుగా క‌న‌పిస్తోంది. హీరోయిన్‌గా ప్రియ‌మ‌ణి పేరు అనుకుంటున్నారు. ఆమె గ‌తంలో బాల‌య్యకు జోడీగా మిత్రుడు సినిమా చేసింది. ఇక ఇప్పుడు మ‌రోసారి బాల‌య్య‌కు జోడీ క‌డుతోంది.

వాస్త‌వంగా బ‌ర్త్ డే రోజు ఈ రెండు సినిమాల టైటిల్స్ ఎనౌన్స్ చేయాల‌ని ముందుగా అనుకున్నారు. అయితే అఖండ టైటిల్ విష‌యంలో ఓ సెంటిమెంట్ ఫాలో అయ్యారు. ఆ సినిమా టైటిల్ ముందు నుంచి ఎన్బీకే 106గా ప్ర‌చారం జ‌రిగింది. ఆ సినిమా బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ అయ్యింది. ఇక ఇప్పుడు ఈ రెండు సినిమాల‌కు కూడా ముందు ఎన్బీకే 107, ఎన్బీకే 108 పేరుతో షూటింగ్ చేసి చివ‌ర్లో మాత్ర‌మే టైటిల్ రివీల్ చేయాల‌నుకుంటున్నార‌ట‌.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news