Moviesబాల‌య్య అన్‌స్టాప‌బుల్ సీజ‌న్ 2 ముహూర్తం ఫిక్స్‌... షో ఎప్ప‌టి నుంచి...

బాల‌య్య అన్‌స్టాప‌బుల్ సీజ‌న్ 2 ముహూర్తం ఫిక్స్‌… షో ఎప్ప‌టి నుంచి అంటే..!

నందమూరి బాలకృష్ణ గత యేడాది ఆహా ఓటీటీ వేదికగా హోస్ట్‌గా మారారు. త‌న స్టైల్‌కు భిన్నంగా అన్‌స్టాప‌బుల్ షోను హోస్ట్ చేసి ర‌క్తి క‌ట్టించారు. ఈ షో ఫ‌స్ట్ సీజ‌న్ బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ అవ్వ‌డంతో రెండో సీజ‌న్ ఎప్ప‌టి నుంచి స్టార్ట్ అవుతుందా ? అని అంద‌రిలోనూ ఒక్కటే ఆస‌క్తి. అయితే రెండో సీజ‌న్ ఎప్ప‌టి నుంచి స్టార్ట్ అవుతుందా ? అనే దానిపై ఆహా వేదికగా ప్రసారమవుతున్న ఇండియన్ ఐడల్లో క్లారిటీ ఇచ్చాడు బాల‌య్య‌.

బాల‌య్య ఇప్ప‌టికే ఓ వైపు సినిమాలు.. మ‌రో వైపు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్నాడు. ఇక అటు బ‌స‌వ తార‌కం క్యాన్స‌ర్ ఆసుప‌త్రి చైర్మ‌న్‌గా కూడా త‌న బాధ్య‌త‌లు స‌క్ర‌మంగానే నిర్వ‌ర్తిస్తున్నాడు. ఇటు ఆహా ఓటీటీ ప్లాట్‌ఫామ్ వేదిక‌గా హోస్ట్‌గా మారి సెల‌బ్రిటీల‌ను ఇంట‌ర్వ్యూలు చేస్తూ బుల్లితెర‌ను కూడా షేక్ చేస్తున్నాడు. బాల‌య్య త‌న యాట్యిట్యూడ్‌కు భిన్నంగా చేసిన ఈ షో సూప‌ర్‌హిట్ అవ్వ‌డంతో పాటు బాల‌య్య క్రేజ్‌ను శిఖ‌రాగ్రంపై నిల‌బెట్టేసింది.

ఈ షో వ‌ల్లే బాల‌య్య ఈ త‌రం జ‌న‌రేష‌న్‌కు, యూత్‌కు బాగా క‌నెక్ట్ అయిపోయాడు. ఈ షో త‌ర్వాతే జై బాల‌య్య నినాదం బాగా ప‌వ‌ర్ ఫుల్ అయిపోయింది. ఆహా ఓటీటీకు అన్‌స్టాప‌బుల్ షో వ‌ల్లే ఎక్కువ మంది స‌బ్ స్క్రైబ‌ర్స్ యాడ్ అయ్యారు. బాల‌య్య సినిమాల్లో చూడు ఒక వైపే చూడు… రెండో వైపు చూడ‌కు అంటూ చెప్పిన డైలాగ్ నిజం చేస్తూ.. త‌న‌లో రెండో యాంగిల్ ఎలా ? ఉంటుందో ? ప్రేక్ష‌కుల‌కు చూపించి వారి మ‌న‌స్సుల‌ను ట‌చ్ చేసి మ‌రీ అభిమానం గెలిపించుకున్నాడు.

బాల‌య్య ఈ షోకు చేస్తోన్న హార్డ్ వ‌ర్క్‌తో పాటు డెడికేష‌న్ మామూలుగా లేదు. ఈ షోతో త‌న‌పై ప్ర‌జ‌ల‌కు ఉన్న థింకింగ్‌ను బాల‌య్య మొత్తం మార్చేశాడు. ఈ షో IMDB (ఇంటర్నెట్ మూవీ డేటా బేస్) స‌ర్వే ప్ర‌కారం దేశంలో నిర్వ‌హించే టాక్ షోలలోనే 9.7 రేటింగ్‌తో తొలి స్థానంలో నిలిచింది. అన్ని టీవీ సీరిస్‌ల్లో టాప్ 50 షోల‌ను సెల‌క్ట్ చేస్తే అందులో కూడా టాప్ ప్లేసులో నిలిచింది.

ఈ క్ర‌మంలోనే అన్‌స్టాప‌బుల్ సీజ‌న్ 2 ఎప్పుడు స్టార్ట్ అవుతుందా ? అన్న ఆస‌క్తి ప్ర‌తి ఒక్క‌రిలోనూ ఉంటుంది. ఈ అన్‌స్టాపబుల్ సీజన్ 2 దసరాకు ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ సీజ‌న్లో ఫస్ట్ ఎపిసోడ్ గెస్ట్‌గా మెగాస్టార్ చిరంజీవి వ‌స్తాడ‌ని అంటున్నారు. అదే జ‌రిగితే ఆ ఎపిసోడ్ మామూలుగా పేల‌దు అని చెప్పాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news