MoviesNTR 31: ప్రశాంత్ నీల్ ప్లాన్ అదే... మతులు పోగొట్టే స్కెచ్...

NTR 31: ప్రశాంత్ నీల్ ప్లాన్ అదే… మతులు పోగొట్టే స్కెచ్ వేశాడుగా…!

ఎప్పుడూ హీరోలుగానే నటించి మెపించే మన హీరోలు ఒక్కసారిగా విలన్ పాత్రలో కనిపిస్తే ఆ సర్‌ప్రైజ్ తట్టుకోవడం చాలా కష్టం. ముఖ్యంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ లాంటి యూనివర్సల్ హీరో చేస్తే ప్రపంచవ్యాప్తంగా జరిగే చర్చలు ఊహించలేము. త్వరలో తారక్ కొరటాల శివ కాంబోలో ఎన్టీఆర్ 30 చిత్రం సెట్స్ మీదకు రాబోతోంది. అన్నీ అనుకున్నట్టుగా పూర్తైతే వచ్చే జూలై నుంచి సెట్స్ పైకి వచ్చి నాన్ స్టాప్‌గా చిత్రీకరణ జరుగుతుంది.

ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అవ్వగానే ఎన్టీఆర్, తన 31వ చిత్రాన్ని కూడా స్టార్ట్ చేసేస్తారు. తన డ్రీం ప్రాజెక్ట్ పై ప్రీ లుక్ నుంచే అంచనాలు పెంచిన ప్రశాంత్ నీల్, ఈ సినిమాలో తారక్ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో చూపించబోతున్నాడని ఇదే ఫస్ట్ లుక్‌తో కొంతవరకు క్లారిటీ వచ్చేసింది. కేజీఎఫ్ సీక్వెల్ సినిమాలలో యష్ ఎలా అయితే నెగటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్ తో కథ మొత్తాని నడిపించాడో… అలాగే, ఎన్టీఆర్ 31లో యంగ్ టైగర్ కూడా పవర్ ఫుల్ డాన్ పాత్రలో కనిపించి బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను నమోదు చేయడానికి రెడీ అవుతున్నట్టు ఇన్‌సైడ్ టాక్.

ఇక ఇప్పటికే జై లవకుశ సినిమాలో నెగటివ్ షేడ్ ఉన్న పాత్రలో కనిపించి వెండి తెరపై తనదైన ముద్ర వేశారు తారక్. టాలీవుడ్ లోనే వ ఆఫ్ ది బెస్ట్ హీరో క్యారెక్టర్స్ లో ఒకటైన ‘జై’ రోల్ ని స్టామరింగ్ ఉన్న వ్యక్తీగా కనిపించి, తారక్ విలనిజంకి ఓ కొత్త అర్ధం చెప్పాడు. అంతేకాదు, జై లవకుశ కన్నా ముందే వచ్చిన టెంపర్ సినిమాలోనూ ఎన్టీఆర్ నెగటివ్ రోల్ లో నటించి తన తాతని గుర్తు చేశారు. ముఖ్యంగా టెంపర్ సినిమా క్లైమాక్స్ ఎప్పటికీ గుర్తుండి పోతుందీ అంటే అది తన పర్ఫార్మెన్స్ వల్లే.

అయితే, ఎన్టీఆర్ 31 సినిమా కెజిఎఫ్, సలార్ కి లింక్ ఉంటుంది అనే టాక్ ఇండస్ట్రీ వర్గాలలో తాజాగా వినిపిస్తుంది. ఇందులో నిజం ఉంటే మాత్రం, ఆ ప్రాజెక్ట్ ఇండియాస్ బిగ్గెస్ట్ సినిమాటిక్ యూనివర్స్ అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. రాకీ భాయ్, సలార్ హీరో పాత్రతో పాటు ఎన్టీఆర్ చేయబోయే హీరో పాత్రను కలిపి, అవెంజర్స్ టైప్ లో కేజిఎఫ్3 ని చేయాలన్నది ప్రశాంత్ నీల్ ప్లాన్ అని తెలుస్తోంది.

ఇప్పటికే దీనిపై ప్రశాంత్ నీల్ వర్క్ చేయడం మొదలు పెట్టారు. ముగ్గురు స్టార్ హీరోలు మూడు రకాల హీరోయిజం వున్న పాత్రలు ఒకే కథలోకి తీసుకు రావడం అంటే కత్తిమీద సాము చేయడమే. మరి యష్, ప్రభాస్‌ల కంటే తారక్‌ను ఎంత పవర్‌ఫుల్‌గా చూపించబోతున్నాడో చూడాలి. హోంబ‌లే ఫిలింస్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ‌లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news