Moviesబాల‌య్య సూప‌ర్ హిట్ ' రౌడీ ఇన్‌స్పెక్ట‌ర్ ' వెన‌క ఎవ్వ‌రికి...

బాల‌య్య సూప‌ర్ హిట్ ‘ రౌడీ ఇన్‌స్పెక్ట‌ర్ ‘ వెన‌క ఎవ్వ‌రికి తెలియ‌ని ఇంట్ర‌స్టింగ్ పాయింట్స్‌

నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ కెరీర్‌లో ఎన్నో హిట్ సినిమాలు వ‌చ్చాయి. ఎంద‌రో హీరోయిన్లు, ద‌ర్శ‌కుల‌తో బాల‌య్య క‌లిసి ప‌నిచేశారు. బాల‌య్య కెరీర్‌కు స్టార్టింగ్‌లో కోడి రామ‌కృష్ణ పిల్ల‌ర్ వేస్తే ఆ త‌ర్వాత కోదండ రామిరెడ్డి బాల‌య్య‌ను క‌మ‌ర్షియ‌ల్‌గా హీరోను చేశారు. ఆ త‌ర్వాత బి. గోపాల్ బాల‌య్య‌ను టాలీవుడ్ శిఖ‌రాగ్రంపై కూర్చోపెట్టారు. ఇక చివ‌ర్లో బోయ‌పాటి మూడు బ్లాక్‌బ‌స్ట‌ర్లతో బాల‌య్య ఎన‌ర్జీ ఆరు ప‌దుల వ‌య‌స్సులోనూ పెరిగిందే త‌ప్పా త‌గ్గ‌లేద‌ని ఫ్రూవ్ చేశాడు.

ఇక తెలుగు సినిమా చ‌రిత్ర‌ను తిరిగ‌రాసిన కాంబినేష‌న్ బాల‌య్య – బి.గోపాల్‌. వీరి కాంబోలో ఐదు సినిమాలు వ‌స్తే రెండు ఇండ‌స్ట్రీ హిట్లు. మ‌రో రెండు సూప‌ర్ హిట్లు. వీరి కాంబోలో వ‌చ్చిన రెండో సినిమా రౌడీ ఇన్‌స్పెక్ట‌ర్‌. అప్ప‌టికే బాల‌య్య ఇన్‌స్పెక్ట‌ర్ ప్ర‌తాప్ లాంటి సినిమాల్లో పోలీస్ పాత్ర‌లు చేసినా అంత పేరు రాలేదు. ఇక రౌడీ ఇన్‌స్పెక్ట‌ర్ సినిమాను విజ‌య‌ల‌క్ష్మి ఆర్ట్ మూవీస్ బ్యాన‌ర్‌పై సీనియ‌ర్ నిర్మాత టి. త్రివిక్ర‌మ‌రావు నిర్మించారు.

ఈ సినిమా ప్లాష్‌బ్యాక్‌లోకి వెళితే బొబ్బిలి సింహం అన్న పేరు ముందుగా రిజిస్ట‌ర్ చేసుకుని దానికి అనుగుణంగా క‌థ రెడీ చేసుకుంటోన్న టైంలో ఆ క‌థ బాల‌య్య‌కు న‌ప్ప‌లేద‌న్న చ‌ర్చ న‌డిచింది. దీంతో బాల‌య్య లారీడ్రైవ‌ర్‌కు క‌థ రాసిన ఆంజ‌నేయ పుష్పానంద్ రౌడీ ఇన్పెక్ట‌ర్ అన్న టైటిల్‌తో హీరో పోలీస్ పాత్ర‌లో క‌థ‌, స్క్రీన్ ప్లే రాసుకువ‌చ్చాడు. ఆ క‌థ అంద‌రికి న‌చ్చింది. అయితే పుష్పానంద్ డ‌వ‌ల‌ప్ చేసిన క‌థ‌లో హీరో ఇంట‌ర్వెల్ త‌ర్వాత త‌ప్పుడు మ‌ర్డ‌ర్ కేసులో స‌స్పెండ్ అవుతాడు.

ఫేక్ కేసుతో హీరో స‌స్పెండ్ అయితే సినిమా ప్లాప్ అవుతుందేమోన‌ని ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్ సందేహం వ్య‌క్తం చేశారు. అయితే విల‌న్ ఫేక్ చేసింది హీరోను.. డైరెక్ట‌ర్ ప్రేక్ష‌కుల‌ను ఫేక్ చేయ‌డం లేద‌ని ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్ క్లారిపికేష‌న్ ఇచ్చారు. అంకుశం, క‌ర్త‌వ్యం లాంటి సినిమ‌ల్లో హీరో చివ‌రిదాకి పోలీస్ డ్రెస్సులో ఉంటూ అన్యాయాలు, అరాచ‌కాల‌కు ఎదురొడ్డి పోరాటం చేస్తాడు.. అవి హిట్ట‌య్యాయి. అందుకే ఈ సినిమాలో హీరోను చివ‌రిదాకా పోలీస్ యూనీఫాం పాత్ర‌కు దూరం చేయ‌కూడ‌ద‌ని నిర్ణ‌యించుకున్నారు. అందుకు అనుగుణంగానే సీన్ల‌లో మార్పులు చేయించుకున్నారు.

విల‌న్ మోహ‌న్‌రాజ్ పోలీస్‌స్టేష‌న్లో బాల‌కృష్ణ‌తో మాట్లాడుతుంటే హీరో ఏ మాత్రం ప‌ట్టించుకోకుండా టీ తాగుతూ.. స్టైల్‌గా సిగ‌రెట్ వెలిగిస్తాడు. అప్పుడు విల‌న్ ఎంత చెల‌రేగిపోతున్నా హీరో మౌనంగా ఉండ‌డం బాగోద‌ని ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్ చెప్ప‌డంతో బాల‌య్య స‌మ్మ‌తించాడు. అప్పుడు బాల‌య్య‌కు ప‌వ‌ర్ ఫుల్ డైలాగులు రాశారు. యూనీఫాం తీసేస్తే నీక‌న్నా పెద్ద రౌడీనీ రా.. ఏ సెంట‌ర్లో కొట్టుకుందాం.. శ‌ర‌త్‌, సంగం డైలాగ్ సినిమా విజ‌యంలో కీల‌క పాత్ర పోషించింది.

ఇక సినిమా షూటింగ్ మొత్తం పూర్త‌య్యాక ఫ‌స్టాఫ్‌లో ఓ సీన్‌ను షూట్ చేయాల‌ని అనుకున్నారు. అందుకోసం ఆ సీన్‌తో పాటు డైలాగులు రాశారు. అయితే ఆ టైంలో ద‌ర్శ‌కుడు గోపాల్ ఊటీలో మోహ‌న్‌బాబు హీరోగా బ్ర‌హ్మ సినిమాను రూపొందిస్తున్నారు. చివ‌ర‌కు గోపాల్ సూచ‌న‌ల మేర‌కు ప‌రుచూరి బ్ర‌ద‌ర్సే ఆ సీన్ల‌ను చిత్రీక‌రించారు. 1992లో వ‌చ్చిన ఈ సినిమా ఆ యేడాది బిగ్గెస్ట్ గ్రాస‌ర్ల‌లో ఒక‌టిగా నిలిచింది. బాల‌య్య‌కు మ‌రింత మాస్ ఇమేజ్ తీసుకువ‌చ్చింది. బ‌ప్పీల‌హ‌రి ఇచ్చిన మ్యూజిక్‌, సాంగ్స్ అన్నీ అదిరిపోయాయి. ఈ సినిమాను త‌మిళంలో ఆటోరాణి పేరుతో డ‌బ్బింగ్ చేస్తే అక్క‌డ కూడా సూప‌ర్ హిట్ అయ్యింది. ఈ సినిమా వ‌చ్చిన మ‌రో ఏడేళ్ల వ‌ర‌కు బాల‌య్య – బి. గోపాల్ కాంబినేష‌న్లో సినిమా రాలేదు. మ‌ళ్లీ 1999లో స‌మ‌ర‌సింహారెడ్డి వ‌చ్చింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news