Moviesపెళ్లి చేసుకోబోతున్న మరో స్టార్ హీరోయిన్..మర్చిపోలేని రోజు అంటూ ఎమోషనల్

పెళ్లి చేసుకోబోతున్న మరో స్టార్ హీరోయిన్..మర్చిపోలేని రోజు అంటూ ఎమోషనల్

సినీ ఇండస్ట్రీలో వ‌రుస‌పెట్టి పెళ్లి బాజాలు మోగుతున్నాయి. స్టార్ సెల‌బ్రిటీలు అంతా ఒక‌రి త‌ర్వాత మ‌రొక‌రు పెళ్లి చేసుకుంటూ తమకంటూ ఓ ఫ్యామిలీని క్రియెట్ చేసుకుంటున్నాయి. ఇప్పటికే కాజల్ పెళ్లి చేసుకుని బిడ్డను కూడా కనేయగా.. ఈ మధ్యనే బాలీవుడ్ హాట్ బ్యూటీస్ కత్రినా కైఫ్.. తన డేటింగ్ బాయ్ ఫ్రెండ్ ని గ్రాండ్ గా వివాహం చేసుకుంది.

ఇక స్టార్ హీట్ అలియా కూడా తాను ప్రేమించిన హీరోనే ఎట్టకేలకు కుటుంబ సభ్యుల మధ్య గ్రాండ్ గా కళ్లు చెదిరే విధంగా మూడు ముళ్లు వేయించుకుని..భార్యభర్తలుగా మారిపోయారు. ఇక మరి కొద్ది రోజుల్లో యంగ్ హీరో కమ్ విలన్ ఆది పినిశెట్టి..తన గర్ల్ ఫ్రెండ్ నిక్కి గల్రాని తో పెళ్లి పీఠలు ఎక్కబోతున్నాడు.

అయితే ఇదే క్రమంలో తాజాగా మరో హీరోయిన్ పెళ్లి కూడా సెటిల్ అయ్యిన్నత్లు తెలుస్తుంది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ లల్లో ఒకరు గా ఇండస్ట్రీని ఏలేస్తున్న బొద్దుగుమ్మ సోనాక్షి సిణ పెళ్లి పీఠలు ఎక్కబోతుందా అంటే అవుననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. సీనియర్‌ నటుడు శతృఘ్న సిన్హా తనయగా ఆమె హీరోయిన్‌గా పరిచయం అయ్యింది.

సల్మాన్‌ ఖాన్‌తో దబాంగ్‌ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయం అయి రాణిస్తుంది. బొద్దు అందాలతో కనువిందు చేసింది నిన్న మొన్నతీ వరకు పెళ్లి అంటే కస్సు బుస్సు లాడే ఈ చిన్నాది..తాజాగా పెట్టిన పోస్ట్ అందరిని షాకింగ్ కు గురి చేసింది. చేతికి డైమండ్ రింగ్ తో పెట్టూకుని పక్కన ఎవరో అబ్బాయి చెయ్యి గట్టీగా పట్టుకుని నిలబడి చిరునవ్వులు చిందిస్తూ కనిపించింది. దీంతో అమ్మడుకి నిశ్చితారధం అయిపోయిందని అంటూన్నారు.

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా కొంత కాలంగా ప్రేమిస్తున్న బాలీవుడ్‌కే చెందిన ఓ న‌టుడితో మూడు ముళ్లు వేయించుకోనుంద‌ని తెలుస్తోంది. ఆ న‌టుడు కండ‌ల వీరుడు స‌ల్మాన్‌ఖాన్‌కు క‌జిన్ కూడా..అంటూ ఓ న్యూస్ బయటకు వచ్చింది. ఇక ఆమె ఆ డైమెండ్ రింగ్ పెట్టుకున్న ఫోటో షేర్ చేస్తూ..”“ఇది నాకు బిగ్ డే.. ఈరోజు నాకున్న పెద్ద కల నెరవేరబోతోంది, దాన్ని మీతో పంచుకునేందుకు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నాను.

ఇది జరిగిందంటేఇప్పటికీ నేను నమ్మలేకపోతున్నాను’ అని రాసుకొచ్చింది. అయితే తన ప్రియుడు ముఖాన్ని మాత్రం అమ్మడు చూపించలేదు. ఇక సోనాక్షి కెరీర్ విషయానికి వస్తే.. ‘భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా’ చిత్రంలో చివరగా కనిపించింది. ఈ మూవీలో సంజయ్ దత్, నోరా ఫతేహీ కీలక పాత్రలు పోషించారు. ‘ఫాలెన్’ అనే వెబ్‌సిరీస్‌లోను ఆమె కనిపించనుంది. ఈ షోలో పోలీసాఫీసర్ పాత్రను పోషించనుంది.

 

 

View this post on Instagram

 

A post shared by Sonakshi Sinha (@aslisona)

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news