Moviesవావ్: బాలీవుడ్ లోకి శ్రీలీల..బంపర్ ఆఫర్ కొట్టెసిందిరోయ్..?

వావ్: బాలీవుడ్ లోకి శ్రీలీల..బంపర్ ఆఫర్ కొట్టెసిందిరోయ్..?

అదృష్టం ఉంటే అంతే.. ఊహించని ఆఫర్స్ వచ్చి పడుతాయి. ప్రజెంట్ ఆ అదృష్టాని బ్యాక్ పాకెట్ లో పెట్టుకుని తిరుగుతుంది కన్నడ బ్యూటీ శ్రీలీల. ఇప్పటి వరకు అమ్మడు చేసింది ఒక్కటి అంటే ఒక్కటే సినిమా. అది కూడా యావరేజ్ టాక్ తెచ్చుకుంది. కానీ ఆమెకు వస్తున్న ఆఫర్లు చూసి సీనియర్ హీరోయిన్లు సైతం షాక్ అవుతున్నారు. శ్రీలీల.. ఒక్కే ఒక్క సినిమాతో తన భవిష్యత్తు ని మార్చేసుకుంది. అమ్మడు అందాల ఆరబోతను చూసిన జనాలు కుర్ర బ్యూటీకి ఫిదా అవుతున్నారు. పిచ్చ ఫాలోయింగ్ ఉంది శ్రీలీలకి జనాల్లో.

కె. రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణలో, గౌరీ రోనంకి దర్శకత్వంలో వ‌చ్చిన పెళ్లి సంద‌D మూవీతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ యంగ్ బ్యూటీ శ్రీ‌లీల‌.. మొద‌టి సినిమాతోనే త‌న‌దైన అందం, అభిన‌యం, చ‌లాకిత‌నంతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు బాగా క‌నెక్ట్ అయిపోయింది. ఈ మూవీ త‌ర్వాత శ్రీ‌లీల‌కు బ్యాక్ టు బ్యాక్ ఆఫ‌ర్లు వ‌స్తున్నాయి. ప్రజెంట్ రవితేజ సినిమాలో నటిస్తున్న ఈ బ్యూటి ప్రభాస్ మారుతి కాంబో తెరకెక్కుతున్న సినిమాలో ను ఆఫర్ అందుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు త్రివిక్రమ్ – మహేశ్ సినిమాలో ను అమ్మడు సెకండ్ హీరోయిన్ గా సెలక్ట్ అయ్యిందంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే, ఇప్పుడు అమ్మడు ఖాతాలో మరో బిగ్గెస్ట్ ఆఫర్ వచ్చిన్నట్లు తెలుస్తుంది. బాలీవుడ్ నుండి అమ్మడుకి పిలుపువచ్చిందట. ప్రముఖ డైరెక్టర్ సినిమాలో యంగ్ బ్యూటీ కోసం చూస్తున్న డైరెక్టర్ కళ్ళు శ్రీలీల పై పడ్డాయంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఆమెతో అన్ని విషయాలు మాట్లాడేసుకున్న టీం..త్వరలో నే దీని పై అఫిషియల్న్ ప్రకటన ఇచ్చే ఛాన్స్ కనిపిస్తున్నాయి. ఇదే కనుక నిజమైతే శ్రీలీల కెరీర్ కి బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ ఇదే..అంటున్నారు సినీ విశ్లేషకులు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news