MoviesLOVEలో ఉన్నాం..కానీ, అది మా ఇద్దరికి ఇష్టం లేదు..రకుల్ ట్వీస్ట్ కి...

LOVEలో ఉన్నాం..కానీ, అది మా ఇద్దరికి ఇష్టం లేదు..రకుల్ ట్వీస్ట్ కి జనాలు షాక్..!!

అందాల ముద్దు గుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వెంకటాద్ర్ ఎక్స్ ప్రెస్ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి..ఎక్స్ ప్రెస్ కన్న వేగంగా మూవ్ అయ్యింది. తన డెస్టిని కూడా రీచ్ అయ్యింది. కానీ తనకు ఇంతటి పేరు తెచ్చి పెట్టిన ఇండస్ట్రీని మాత్రం వదిలేసింది. చిన్న సినిమాలతో భారీ కెరీర్‌ మొదలు పెట్టిన ఈ భామ కొద్ది రోజుల్లోనే స్టార్ హీరోల సరసన సినిమాలు చేసే స్థాయికి వచ్చింది.

ప్రజెంట్ రకుల్ బాలీవుడ్ వైపే మొగ్గు చూపుతుంది. తెలుగు సినిమాలకు సైన్ చేయదం లేదు. అడిగితే నచ్చిన కధ దొరకడం లేదంటూ మాట దాతేస్తుంది. దీని బట్టి ఇక తెలుగులో ఆమెను మనం చూడలేకపోవచ్చు అంటూనారు నెటిజన్స్. సోషల్ మీడియాలో యమ యాక్టీవ్ గా ఉండే ఈమె..తన గురించిన విషయాలను మాత్రం నిర్మోహమాటంగా అభిమానులకు చెప్పేస్తుంది. తన రిలేషనషిప్, పెళ్లి గురించి క్లియర్‌‌గా గా ఉండే రకుల్…తాను రిలేషన్‌పిష్‌లో ఉన్నాను అని ఓపెన్ గానే చెప్పింది. బాలీవుడ్‌ నటుడు, నిర్మాత జాకీ భగ్నానీని ప్రేమిస్తున్నట్టు తన బర్త డే రోజున సోషల్‌మీడియాలో పోస్ట్ చేసింది.

రకుల్ బాయ్ ఫ్రెండ్ కూడా సినిమా ఇండస్ట్రీకి చెందిన వారే. జాకీ తండ్రి వషు భగ్నానీ బాలీవుడ్ లో స్టార్ ప్రొడ్యూసర్స్ లో ఒకరు. 2009 లో విడుదలైన కల్ కిస్నే దేఖా అనే హిందీ సినిమాతో హీరోగా తన కెరియర్ మొదలుపెట్టిన జాకీ కూడా ఎన్నో హిందీ సినిమాల్లో నటించారు.దీని పై అందరు రకరకాలు గా అనుకునారు. మీరు లవ్ లో ఉంటే చెప్పడం కాదు..పెళ్లి చేసుకున్న తరువాత చెప్పలి..అంటూ చురకలంటించారు.

కాగా, రీసెంట్ గా ఆమె ఓ ఇంటర్వ్యుల్లొ మాట్లాడుతూ …ఇదే విషయం ప్రశ్నించగా..షాకింగ్ ఆన్సర్ ఇచ్చింది.”ఒక రిలేషన్‌షిప్‌లో ఉండటం చాలా కామన్. మన లైఫ్‌లో తల్లిదండ్రులు, అన్న, అక్క,చెల్లి ,ఫ్రెండ్స్‌ ఎలా ఉంటారో అలాగే మనకోసం కూడా ఒకరు ఉంటారు. నా లైఫ్ లో అది జాకీ భగ్నానీ. మెము సెలబ్రిటీలు కావడంతో మాపై నే అందరి దృష్టి ఉంటుంది. సో సోషల్ మీడియాలో మా గురించి ఏవేవో రాకముందే నెను ఆ విషయం క్లారిటీ ఇచ్చాను. మాకు మా పై జనాలు ఎక్కువ ఫోకస్ పెట్టడం ఇష్టం లేదు. అందుకే మేము ఓపెన్ గానే ఉన్నాం.’ అని రకుల్ చెప్పుకొచ్చింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news