Moviesఇంత జరగడానికి కారణం..మహేష్ పెట్టిన ఆ ఒక్క మెసేజ్....పరశూరాం ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

ఇంత జరగడానికి కారణం..మహేష్ పెట్టిన ఆ ఒక్క మెసేజ్….పరశూరాం ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

మహేష్ అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ వెయ్యి కళ్లతో ఎదురుచూసిన రోజు రావడానికి మరి కొద్ది గంటలే మిగిలి ఉన్నాయి. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, కీర్తి సురేష్ జంటగా పరశురామ్ పెట్ల దర్శకత్వంలో తెర‌కెక్కుతోన్న మోస్ట్ అవైటెడ్ మూవీ స‌ర్కారు వారి పాట‌. ఎప్పుడో రెండేళ్ల క్రితం స్టార్ట్ అయిన ఈ సినిమా క‌రోనా పాండ‌మిక్ వ‌ల్ల ఈ సినిమా ఇప్ప‌టికే చాలా లేట్ అయ్యింది. అయినా కానీ అభిమానుల్లో ఏ మాతర్మ్ నిరాశ పెంచకుండా ..ఎప్పటికప్పుడు ఇంట్రెస్టింగ్ అప్ డేట్ లతో పిచ్చెక్కించారు మేకర్స్ .

రీసెంట్‌గా విడుద‌లైన ట్రైల‌ర్‌తో సినిమాపై ఉన్న అంచ‌నాలు భారీగా పెంచేశారు డైరెక్టర్ పరశూరాం. సినిమా ట్రైల‌ర్ విడుద‌లైన 24 గంట‌ల్లో తెలుగు చ‌ల‌న చిత్ర చ‌రిత్ర‌లోనే ఎక్కువ వ్యూస్‌ను సాధించిన ట్రైల‌ర్‌గా ‘సర్కారు వారి పాట’ స‌రికొత్త రికార్డుల‌ను క్రియేట్ చేసింది. మైత్రీ మూవీ మేక‌ర్స్‌, జీఎంబీ ఎంట‌ర్టైన్‌మెంట్, 14 రీల్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఈ సినిమాను వ‌చ్చే నెల 12న గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. సినిమా ప్రమోషన్ లో భాగంగా నిన్న సర్కారు వారి పాట సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ జరిపారు చిత్ర బృఅందం. హైదరాబాద్ లోని యూసఫ్ గూడా పోలీస్ గ్రౌండ్స్ లో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ కి మెయిన్ హైలెట్ గా నిలిచారు మహేష్-కీర్తి సురేష్.

కాగా, స్టేజీ పైకి వచ్చిన ప్రముఖులు మాట్లాడుతూ మహేష్ ను ఓ రేంజ్ లో పొగిడేశారు. సినిమా హిట్ అవుతుందని..అందులో సందేహమే లేదని..ధియేటర్ కు వచ్చిన ప్రతి ప్రేక్షకుడు సినిమా ఎంజాయ్ చేస్తారని..చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే డైరెక్టర్ పరశురామ్ ఇంత్రెస్టింగ్ మ్యాటర్ లీక్ చేశారు. ఆయన మాట్లాదుతూ..” గీతా గోవిందం తర్వాత సర్కారు వారి పాట కథ రాసుకొని కొరటాల శివ గారి ద్వారా మహేష్ గారిని కలిశాను. ఫస్ట్ టైం సార్ ని చూడగానే భయమేసింది ..కాళ్ళు వణుకు వచ్చాయి. చాలా టెన్షన్ పడ్డా.. కానీ స్టోరీ చెప్పాక మహేశ్ ఓ చిన్న స్మైల్ ఇచ్చారు..దానితో భయం పోయింది..ఆ తరువాత మహేశ్ నాకు ఓ మేసేజ్ పెట్టారు. నాకు నిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కావాలి అని. దాని ఇవ్వదానికే ఇంత కష్టపడ్డాం. సినిమా మీ అందరికి నచ్చ్తుంది. తన జన్మంతా మహేష్ బాబుకు రుణపడి ఉంటాన్నారు డైరెక్టర్ ఇక తనతో కలిసి పనిచేసిన టెక్నీషయన్స్ కు స్పెషల్ గా తమన్ కు థ్యాంక్స్” అంటూ చెప్పుకొచ్చాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news