Moviesసలామ్ రాఖీభాయ్..బాలీవుడ్ లో KGF 2 అరుదైన రికార్డ్..!!

సలామ్ రాఖీభాయ్..బాలీవుడ్ లో KGF 2 అరుదైన రికార్డ్..!!

క‌న్న‌డ రాకింగ్ స్టార్ య‌శ్ న‌టించిన తాజా వండ‌ర్ కేజీయ‌ఫ్ 2. కేజీయ‌ఫ్ చాప్ట‌ర్ 1 సూప‌ర్ హిట్ కావ‌డంతో అదే అంచ‌నాల‌కు మించి 2 థియేట‌ర్ల‌లోకి వ‌చ్చింది. సౌత్ లేదు నార్త్ లేదు… ఏపీ, తెలంగాణ‌, క‌ర్నాక‌ట, త‌మిళ‌నాడు, కేర‌ళ‌.. అటు నార్త్‌లో హిందీ బెల్ట్ అంతా కేజీయ‌ఫ్ 2 మాయ‌లో మునిగి తేలుతోంది. సినిమా హిట్ అవుతుందని ఎక్స్ పెక్ట్ చేశారు కానీ..ఈ రేంజ్ లో విజయం సాధిస్తుందని ఊహించలేదు జనాభా. అస‌లు ఈ సినిమా ఇప్ప‌టికే సూప‌ర్ డూప‌ర్ హిట్ అయిపోగా.. ఏ స్థాయి విజ‌యం సాధిస్తుంద‌న్న‌ది మాత్రం అంచ‌నాల‌కు అంద‌డం లేదు.

రాకీభాయ్ అలియాస్ యశ్ బాక్సాఫీసు వద్ద రికార్డుల మోత మోగిస్తున్నాడు. ప్రతిరోజూ కలెక్షన్ల వర్షం కురుస్తోంది. కేజీఎఫ్ ఛాప్టర్ 2 సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది.కేజీఎఫ్ 2 సినిమా ఊహించిన దానికంటే బాక్సాఫీస్ దగ్గర ఎక్కువ సంచలనాలు సృష్టిస్తుంది. రోజు రోజుకి ఈ సినిమా కలెక్షన్స్ చూస్తే ఎవరికైనా మతి పోతుంది. ఇప్పుడు ఎక్కడ చూసినా కేజీఎఫ్ ఛాప్టర్ 2 చర్చే నడుస్తోంది. బాక్సాఫీసు వద్ద ఈ సినిమా కలెక్షన్ల వర్షం ఇప్పట్లో ఆగేలా లేదు. ప్రతిరోజూ కొత్త రికార్డు సృష్టిస్తోంది.

మరీ ముఖ్యంగా హిందీలో సరికొత్త రికార్డులను సెట్ చేస్తున్నాడు రాకింగ్ స్టార్. ఇప్పుడు బాక్సాఫీసు వద్ద కేజీఎఫ్ 2 …4 వందల కోట్ల వసూలు చేసి కొత్త చరిత్ర రేపింది. తాజాగా కెజిఎఫ్ 2 హిందీ వెర్షన్ ఎవ్వరు ఊహించని విధంగా 400 కోట్ల క్లబ్ లో అధికారికంగా అడుగు పెట్టింది. దీంతో యాష్ ఫ్యాన్స్ సంబరాల్లో మునిగి తేలుతున్నారు. ఇప్పటిదాకా ఏ మూవీకీ సాధ్యం కాని ఫీట్ ని యాష్ అతి తక్కువ టైంలోనే సాధించి అబ్బురపరిచింది. ఇది ఒక కన్నడ మూవీకి దక్కిన అరుదైన గౌరవం.

ఇప్పటిదాకా రాజ్ కుమార్, రవిచంద్రన్, అనంత్ నాగ్ లాంటి దిగ్గజాల వల్ల కానిది యష్ చాలా అంటే చాలా తక్కువ సమయంలో అందుకోవడం పట్ల ఫ్యాన్స్ ఆనందం అంతా ఇంతా కాదు. మరోపక్క ఫైనల్ రన్ పూర్తి కాలేదు కాబట్టి..ఈ సినిమా మరిన్ని రికార్డ్లు సృష్టిస్తుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. క్లోజింగ్ ఫిగర్స్ ఇంకా భీబత్సంగా షాక్ ఇవ్వొచ్చు అంటున్నాయి ట్రేడ్ వర్గాలు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news