Movies#RC15 శంక‌ర్ - దిల్ రాజు మ‌ధ్య కొత్త కిరికిరి...!

#RC15 శంక‌ర్ – దిల్ రాజు మ‌ధ్య కొత్త కిరికిరి…!

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కెరీర్‌లో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతోన్న 15వ సినిమా షూటింగ్ అయితే గ్యాప్ లేకుండా కంటిన్యూగా న‌డుస్తూనే ఉంది. ఈ సినిమా షూటింగ్ ఎప్ప‌టిక‌ప్పుడు షెడ్యూల్స్ న‌డుస్తూనే ఉన్నాయి. హైదరాబాద్ – రాజమండ్రి – పూణె – రాజస్థాన్.. ఇలా రకరకాల లొకేషన్లలో షూటింగ్ జ‌రుగుతున్నా ఫ‌స్ట్ లుక్, టైటిల్ ఎప్పుడు రివీల్ చేస్తారు ? అన్న‌ది మాత్రం చెప్ప‌డం లేదు. అయితే లేటెస్ట్ అప్‌డేట్ ప్ర‌కారం ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌కు ముహూర్తం ద‌గ్గ‌ర ప‌డింది.

షెడ్యూల్స్ గ్యాప్‌లోనే ఫ‌స్ట్ లుక్‌, టైటిల్‌కు సంబంధించి ఫొటో షూట్‌లు, టైటిల్ డిజైన్ వ‌ర్క్ అంతా పూర్తి చేశారు. ఓ లుక్ కూడా లాక్ చేశార‌ట‌. అయితే దానిని ఇప్ప‌టి వ‌ర‌కు రివీల్ చేయ‌లేదు. అటు నిర్మాత దిల్ రాజు ఎఫ్ 3 సినిమా ప్ర‌మోష‌న్ల‌లో బిజీగా ఉన్నాడు. ఆ సినిమా థియేట‌ర్ల‌లోకి వ‌చ్చాక ఓ వారం ప‌ది రోజుల పాటు ఆ హ‌డావిడిలోనే రాజు ఉంటారు. ఆ త‌ర్వాతే చ‌ర‌ణ్ – శంక‌ర్ సినిమా ఫ‌స్ట్ లుక్ రిలీజ్ ఉంటుంద‌ని అంటున్నారు.

అయితే ఈ సినిమా టైటిల్ విష‌యంలో నిర్మాత దిల్ రాజుకు, డైరెక్ట‌ర్ శంక‌ర్‌కు మ‌ధ్య చిన్న‌పాటి కిరికిరి న‌డుస్తోంద‌న్న గుస‌గుస‌లు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో వినిపిస్తున్నాయి. టైటిల్ అయితే ఇంకా ఫిక్స్ కాలేదు. శంక‌ర్ అయితే 2 – 3 టైటిల్స్ అనుకున్నాడ‌ట‌. త‌మిళ వెర్ష‌న్‌కు శంక‌ర్ ఓ టైటిల్ అనుకున్నా దానికి దిల్ రాజు అభ్యంత‌రం వ్య‌క్తం చేశార‌ట‌.

శంక‌ర్ త‌మిళంలో పెట్టిన టైటిల్ తెలుగుకు సింక్ కావ‌డం లేద‌ట‌. అయితే రాజు వెర్ష‌న్ మ‌రోలా ఉంది. తెలుగు, త‌మిళ్‌, హిందీ ఇలా అన్ని భాషల‌కు కలిపి ఒకే కామ‌న్ టైటిల్ ఉండాల‌న్న‌దే రాజు ఆలోచ‌న అట‌. అందుకే టైటిల్ విష‌యంలో త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్నార‌ట‌. కియారా అద్వానీ చ‌ర‌ణ్‌కు జోడీగా న‌టిస్తోంది. గ‌తంలో కియారా రామ్‌చ‌ర‌ణ్‌కు జోడీగా విన‌య విధేయ రామ సినిమాలో న‌టించింది.

అలాగే ఈ సినిమాలో చ‌ర‌ణ్ ద్విపాత్రాభిన‌యం చేస్తున్నార‌ని… ప్లాష్‌బ్యాక్‌లో వ‌చ్చే చెర్రీ ఎపిసోడ్‌లో మ‌రో హీరోయిన్‌గా మ‌న తెలుగు అమ్మాయి అంజ‌లి కనిపించ‌బోతోంది. థ‌మ‌న్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. స‌మ‌కాలీన రాజ‌కీయ సంఘ‌ట‌న‌లు, ప్ర‌భుత్వ వ్య‌వ‌స్థ‌ల్లోని లోపాల‌తో ఈ సినిమా తెర‌కెక్క‌నుంద‌ని అంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news