Moviesబాల‌య్య ఇమేజ్ మార్చేసిన తేజ‌స్విని... తెర‌వెన‌క ఇంత రీసెర్చ్ జ‌రిగిందా..!

బాల‌య్య ఇమేజ్ మార్చేసిన తేజ‌స్విని… తెర‌వెన‌క ఇంత రీసెర్చ్ జ‌రిగిందా..!

బాల‌య్య భోళామ‌నిషే ఎవ్వ‌రూ కాద‌న‌రు. అయితే ఆయ‌న ఉన్న‌ది ఉన్న‌ట్టు మాట్లాడే సంద‌ర్భంలో కొంద‌రికి యాంటీ అయిపోతారు. స‌హజంగా ఉన్న‌ది ఉన్న‌ట్టు మాట్లాడే ఏ వ్య‌క్తికి అయినా శ‌త్రువులు ఎక్కువుగానే ఉంటారు. కొంద‌రు లోప‌ల చేసేది ఒక‌టి.. బ‌య‌ట‌కు మాట్లాడేది ఒక‌టి అన్న‌ట్టుగా ఉంటారు. బాల‌య్య ఉన్న‌ది ఉన్న‌ట్టు ముఖం మీదే కుండ‌బ‌ద్ద‌లు కొట్టేస్తూ ఉంటాడు. అవి న‌చ్చ‌ని వారు ఆయ‌న గురించి ఏవేవో మాట్లాడుతూ ఉంటారు. దీనికి తోడు రాజ‌కీయాల్లో టీడీపీ ఎమ్మెల్యేగా ఉండ‌డంతో స‌హ‌జంగానే కొంద‌రు యాంటీగా ఉంటారు.

అందుకే బాల‌య్య‌పై సోష‌ల్ మీడియాలో త‌ర‌చూ నెగిటివ్ ట్రోలింగ్ న‌డిచేది. ఇక తానే చేసే సేవా కార్య‌క్ర‌మాలు కాని.. బ‌స‌వ తార‌కం క్యాన్స‌ర్ ఆసుప‌త్రి ద్వారా ఎంతోమందికి జీవితం ఇచ్చిన వైనం గురించి కాని బాల‌య్య బ‌య‌ట ఎప్పుడూ చెప్పుకోరు. దీనికి తోడు బాల‌య్య‌కు ఈ త‌రం జ‌న‌రేష‌న్‌తో ముందు నుంచి కాస్త త‌క్కువ క‌నెక్ష‌న్ ఉండేది. సోష‌ల్ మీడియాలో ఇప్పుడు యువ‌త‌దే రాజ్యం క‌దా ?

అయితే గ‌త 8 నెల‌లుగా చూస్తే బాల‌య్య‌పై నెగిటివిటీ రేటు 0 శాతం లేదా 1-2 శాతం అన్న‌ట్టుగానే ఉంది. సోష‌ల్ మీడియాలోనే కాదు.. ఇటు బుల్లితెర‌పై అటు అభిమానులు, సాధార‌ణ జ‌నాల్లో ఎక్క‌డ చూసినా బాల‌య్య గురించి పాజిటివ్‌గానే చ‌ర్చించుకుంటున్నారు. అసలు క‌రోనా రెండుసార్లు వ‌చ్చాక పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ చేస్తే.. ప్రేక్ష‌కులు థియేట‌ర్ల‌కు వ‌చ్చి చూస్తారా ? అన్న సందేహాలు ఉన్నాయి. పెద్ద హీరోలు త‌మ సినిమాలు రిలీజ్ చేసేందుకే భ‌య‌ప‌డ్డారు. దీనికి తోడు ఏపీలో టిక్కెట్ రేట్లు త‌క్కువుగా ఉన్నాయి.

అయినా అఖండ థియేట‌ర్ల‌లో విధ్వంసం క్రియేట్ చేసింది. ఇక బుల్లితెర‌పై అన్‌స్టాప‌బుల్ షోను త‌న‌దైన స్టైల్లో న‌డిపి తిరుగులేని స‌క్సెస్ అయ్యాడు. ఈ షో స‌రికొత్త బాల‌య్య‌ను ఈ ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేసింది. అలాగే ఈ త‌రం జ‌న‌రేష‌న్‌కు బాగా క‌నెక్ట్ అయ్యేలా చేసింది. దీనికి తోడు అఖండ త‌ర్వాత బాల‌య్య లైన‌ప్‌కు భ‌యంక‌ర‌మైన క్రేజ్ వ‌చ్చేసింది. మ‌లినేని గోపీ, అనిల్ రావిపూడి, బోయ‌పాటి శ్రీను, పూరి జ‌గ‌న్నాథ్ ఇలా స్టార్ డైరెక్ట‌ర్ల‌తో బాల‌య్య లైన‌ప్ స్ట్రాంగ్‌గా ఉంది.

ఇంతలోనే బాల‌య్య‌లో ఎంత మార్పు ? ఏం జ‌రిగింది ? అన్న‌దే ఇప్పుడు ఆస‌క్తిగా మారింది. ఈ సెడ‌న్ మార్పు వెన‌క బాల‌య్య చిన్న కుమార్తె తేజ‌స్విని ఉంద‌నే అంటున్నారు నంద‌మూరి కాంపౌండ్ వ‌ర్గాలు. తేజ‌స్విని గ‌త ఆరేడు నెల‌లుగా బాల‌య్య ప్ర‌తి విష‌యంలో క్రియేటివ్ హెడ్ స్టైల్లో వ్య‌వ‌హ‌రించింద‌ట‌. అన్‌స్టాప‌బుల్ షోకు తేజ‌స్విని క్రియేటివ్ క‌న్స‌ల్టెంట్‌గా చేసింది. తొలిసారి త‌న తండ్రి హోస్ట్ చేస్తోన్న ప్రోగ్రామ్‌కు అన్నింటా తానై వ్య‌వ‌హ‌రించింది.

ఈ షోకు ఆహా టీం ప‌నిచేసినా బాల‌య్య స్టైల్‌, లుక్‌, డ్రెస్ విష‌యంలో తేజ‌స్విని కూడా స‌ల‌హాలు ఇచ్చింది. ఇందుకోసం ఆమె తెర‌వెన‌క చాలా రీసెర్చ్ చేశార‌ట‌. కుమార్తె స‌ల‌హాలు, గైడెన్స్ వ‌ల్లే బాల‌య్య త‌న నెక్ట్స్ సినిమాల విష‌యంలో కూడా చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుని… సినిమా సెట్స్ మీద‌కు వెళ్ల‌క‌ముందే క్రేజ్ వ‌చ్చేలా చేసుకున్నార‌ని అంటున్నారు. అందుకే బాల‌య్య లైన‌ప్ చూస్తేనే నంద‌మూరి అభిమానుల్లో మామూలు ఉత్సాహం లేదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news