Moviesపబ్లిక్ గా సుధీర్ కి కిస్ ఇచ్చిన హీరోయిన్..ఎంత దిగజారిపోయిందంటే..?

పబ్లిక్ గా సుధీర్ కి కిస్ ఇచ్చిన హీరోయిన్..ఎంత దిగజారిపోయిందంటే..?

సుడిగాలి సుధీర్..ఈ పేరు కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. స్టార్ హీరోకు సరిసమానంగా క్రేజ్ సంపాదించుకున్న హీరో. ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ చూస్తే..మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ఎటువంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా రోడు మీద తిరుగుతూ ఒక్క అవకాశం కోసం నానా తిప్పలు పడి..తిండికి కూడా డబ్బులు లేక నీళ్ళు త్రాగి బ్రతికిన రోజులను తన జీవితంలో చూశాడు సుధీర్.

ఇక అలా జబర్ధస్త్ లోకి ఎంటర్ అయ్యి చిన్న గా తన లోని టాలెంట్ ను నలుగురికి చూయిస్తూ.. ఇప్పుడు బిగ్ స్టార్ అయిపోయాడు . ఇప్పుడు ఈయనకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ చూస్తే సినీ హీరోలు కూడా కుళ్ళు కుంటారు. ఏదైన షో లో కానీ, ఈవెంట్ లో కానీ సుధీర్ ని ఒక్క మాట తప్పుగా అన్నా కూడా ఫ్యాన్స్ వాళ్ళకి సోషల్ మీడియాలో చుక్కలు చూయిస్తారు. గతంలో ఇలాంటివి మనం చూసినవే. ప్రజెంట్ శ్రీదేవీ డ్రామా కంపెనీకి హోస్ట్ గా వ్యవహరిస్తున్న సుధీర్ కు గెస్ట్ గా వచ్చిన హీరోయిన్ ముద్దు ఇచ్చింది.

దీంతో మ్యాటర్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఆదివారం శ్రీదేవీ డ్రామా కంపెనీకి సంబంధించిన ప్రోమో ని రిలీజ్ చేశారు టీం. ఈ వారం షో కి హీరోయిన్ హెబ్బా పటేల్ గెస్ట్ గా వచ్చింది. ఈ క్రమంలోనే ఆమెతో స్కిట్ వేయించే క్రమంలో సుధీర్ హీరో హెబ్బ హీరోయిన్ గా చేయాలి అని చెప్తారు,. దీంతో హెబ్బ ఫేస్ ఒక్క విధంగా పెడుతుంది. అదే టైంలో ఆమని ఎంటర్ అయ్యి నువ్వంటే ఇష్టం లేనట్లు ఉంది సుధీర్ అంటుంది.

ఇక అప్పుడు హెబ్బ..”నో నో నాకు చాలా ఇష్టం ” అంటూ ఫ్లైయింగ్ కిస్ ఇస్తుంది..దానికి అద్దిరిపోయే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా వినిపిస్తుంది. ఈ క్రమంలోనే హెబ్బ పై ట్రోల్స్ మొదలైయాయి. ఫేడ్ అవుట్ అయిపోయిన నువ్వు …పాపులారిటీ కోసం ఇలా సుధీర్ ని వాడుకుంటావా…ఇంత దిగజారిపోతావు అనుకోలేదు అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. మొత్తంగా చాలా రోజుల తరువాత బుల్లితెర పై కనిపించిన హెబ్బ ..నెట్టింట ట్రోల్స్ కి గురి అవుతుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news