Moviesఎఫ్ 3 ట్రైల‌ర్ సూప‌ర్ హిట్‌... దేవిశ్రీ మాత్రం సూప‌ర్ ప్లాప్...

ఎఫ్ 3 ట్రైల‌ర్ సూప‌ర్ హిట్‌… దేవిశ్రీ మాత్రం సూప‌ర్ ప్లాప్ ( వీడియో )

అనిల్ రావిపూడి వెంకీ – వ‌రుణ్‌తేజ్‌తో తీసిన ఎఫ్ 2 సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో చూశాం. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్‌గా మ‌ళ్లీ అదే హీరోల‌తో తీసిన ఎఫ్ 3 ట్రైల‌ర్ వ‌చ్చేసింది. ఎఫ్ 2 వ‌చ్చి మూడేళ్లు అవుతోంది.. మ‌ళ్లీ అదే హీరోలు, హీరోయిన్లు, క్యారెక్ట‌ర్లు.. కొత్త‌గా యాడ్ అయిన కొంద‌రు న‌టులు.. దాదాపుగా మ‌ళ్లీ అంద‌రితోనే అదే మ్యాన‌రిజ‌మ్స్‌తో, అవే డైలాగుల‌తో ఎఫ్ 3 తీస్తున్న‌ట్టుగా ఉంది.

తాజా ఎఫ్ 3 ట్రైల‌ర్లో వెంక‌టేష్‌కు రేచీక‌టి, వ‌రుణ్‌తేజ్‌కు న‌త్తి.. ఇక సినిమాలో హీరోయిన్లు ఇద్ద‌రికి డ‌బ్బు పిచ్చి కామ‌న్‌. ఆలీ, సునీల్ లాంటి అద‌న‌పు క్యారెక్ట‌ర్ల‌తో పిచ్చెక్కించేశాడు. అస‌లు క‌థ ఏంట‌న్న‌ది పూర్తిగా తెలియ‌కుండానే ఫ‌న్ ఎలా ఉంటుందో చూపిస్తూ ట్రైల‌ర్ క‌ట్ చేశారు. తెర‌నిండా చాలా మంది న‌టీన‌టులు, కావాల్సిన‌న్ని డైలాగులు చూస్తుంటే థియేట‌ర్లో ప‌డిప‌డి న‌వ్వుకోవ‌డ‌మే..!

ఈ స‌మ్మ‌ర్‌లో అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌తో పాటు కుటుంబంతో స‌హా ప్ర‌తి ఒక్క‌రు థియేట‌ర్ల‌కు వ‌చ్చి సినిమా ఎంజాయ్ చేసేలా ఈ ఎఫ్ 3 ఉండ‌బోతోంద‌న్న హింట్ అయితే వ‌చ్చేసింది. ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి త‌న‌దైన రేటింగ్‌, టేకింగ్‌తో ఈ సినిమాను అవుట్ & రైట్ అవుట్ కామెడీ, యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్‌గా తెర‌కెక్కించాడ‌ని అర్థ‌మ‌వుతోంది.

డ‌బ్బున్న వాడికి ఫ‌న్‌.. డ‌బ్బులేని వాడికి ప్ర‌స్టేష‌న్ అన్న కాన్సెఫ్ట్‌తో అనిల్ ఈ సినిమా మెయిన్ లైన్ అయితే రాసుకున్నాడు. డ‌బ్బు సంపాద‌న లేని భ‌ర్త‌ల‌కు అత్తారింట్లోనూ, భార్య‌ల ద‌గ్గ‌ర పెట్టే తిండిలో కూడా ఎంత టార్చ‌ర్ ఉంటుందో చూపించారు. అయితే ట్రైల‌ర్‌మొత్తం మీద అంద‌రికి మంచి మార్కులే ప‌డినా మ్యూజిక్ డైరెక్ట‌ర్ దేవిశ్రీ మాత్రం సూప‌ర్ ప్లాప్ అయ్యాడ‌న్న కామెంట్లు వ‌స్తున్నాయి.

అస‌లు 2.30 నిమిషాల పాటు ఉన్న ట్రైల‌ర్లో ఒక్క షాట్‌కు కూడా కొత్త‌గా బీజీఎం ఉన్న‌ట్టు అనిపించ‌లేదు. మ‌నం పొర‌పాటు ప‌డ్డామా ? అని రెండోసారి ట్రైల‌ర్ చూసినా కూడా దేవికీ ఎక్క‌డా కూడా కొత్త‌గా ట్రై చేద్దామ‌న్న ఆలోచ‌న కూడా ఉన్న‌ట్టు లేద‌నిపించేలా బీజీఎం ఉంది. మ‌రి రెండు నిమిషాల ట్రైల‌ర్లోనే దేవీ బీజీఎం ఇంత బోర్ కొడితే రేపు సినిమాలో ఎలా ఉంటుందో ? చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news