Moviesనాగ‌బాబుపై శ్రీరెడ్డి బూతుల వ‌ర్షం.. విన‌లేం బాబోయ్‌..!

నాగ‌బాబుపై శ్రీరెడ్డి బూతుల వ‌ర్షం.. విన‌లేం బాబోయ్‌..!

సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ శ్రీరెడ్డి. కార‌ణం ఏదైనా గ‌త రెండేళ్ల ముందు నుంచే శ్రీరెడ్డికి,మెగా ఫ్యామిలీకి మ‌ధ్య అగాధ‌మే ఉంది. శ్రీ రెడ్డి మెగా ఫ్యామిలీని టార్గెట్ చేయాలంటే ఓ అడుగు ముందే ఉంటుంది. దీనికి తోడు నాగ‌బాబు కూడా ఆమెను డైరెక్టుగా, ఇన్ డైరెక్టుగా టార్గెట్ చేస్తూ వ‌స్తున్నారు. ఇలాంటి టైంలో నాగ‌బాబు కుమార్తె నిహారిక ప‌బ్‌లో అడ్డంగా దొరికిపోయింద‌న్న వార్త‌లు రావ‌డం.. ఆమె పోలీస్ స్టేష‌న్‌కు వెళ్ల‌డం లాంటి సంఘ‌ట‌న‌లు జ‌రిగితే శ్రీరెడ్డి ఊరుకుంటుందా ? అస్స‌లు ఊరుకోదు. శివ‌తాండ‌వం ఆడేస్తుంది.

ఈ సంఘ‌ట‌న జ‌రిగి ఇప్ప‌టికే రెండు రోజులు అయ్యింది. శ్రీ రెడ్డి కాస్త ఆల‌స్యంగానే స్పందించింది. ఫేస్‌బుక్ లైవ్‌లోకి వ‌చ్చిన శ్రీరెడ్డి సుమారు 30 నిమిషాల పాటు నాగ‌బాబును బూతుల‌తో ఆడేసుకుంది. శ్రీరెడ్డి మామూలుగా రెచ్చిపోలేదు. క‌ర్మ ఎవ‌రిని వ‌దిలి పెట్ట‌దు.. త‌న‌ను ఏడిపించిన నాగ‌బాబు, ప‌వ‌న్ క‌ళ్యాణ్ అంత‌కు మించి అనుభ‌విస్తార‌ని నోటికి ప‌ని చెప్పేసింది.

నాగ‌బాబు క‌ర్మ అనేది చూశావా ? రా గ‌తంలో నువ్వు న‌న్ను ఎంత‌లా టార్గెట్ చేశావురా ? మీటింగ్‌ల మీద మీటింగులు పెట్టి యూట్యూబ్ ఛానెల్స్‌లో ఎంతో తిట్టావ్ ? ఓ ఆడ పిల్ల అని చూడ‌కుండా ఎంత ఆడుకున్నావో.. నిన్ను శ్రీ రెడ్డి ఏమీ చేయ‌లేక‌పోయినా క‌ర్మ అనేది ఒక‌టి ఉంటుంది… అది ఎవ్వ‌రిని వ‌దిలి పెట్ట‌దు.. వెంటాడుతూనే ఉంటుంది.. ఏదైనా ప్ర‌కృతికి నువ్వ ఇస్తే ..అంత‌కు మించిన రెట్టింపుతో నీకు తిరిగి ఇస్తుంద‌ని విమ‌ర్శ‌లు చేసింది.

ఒరేయ్ స్నేక్‌బాబు నేను శ‌క్తిని కాక‌పోవ‌చ్చు..నేను పూజించేది ఓ శ‌క్తినే.. నీ పాపం పండిందిరా ? ఓ ఆడ‌పిల్ల‌ను టార్గెట్ చేయ‌డం వీర‌త్వం అవుతుందా ? వీర మ‌హిళ అని చెప్పి మా బాబాయ్‌కు ఓటు వేయ‌మంది నీ కూతురు. వీర మ‌హిళ‌లు అంటే ఇలాగే ఉంటారా ? ప‌బ్‌కు వెళ్ల‌డం త‌ప్ప‌ని తాను చెప్ప‌డం లేదు.. కాని పెళ్ల‌యిన త‌ర్వాత రాత్రి 3 గంట‌ల స‌మ‌యంలో ప‌బ్‌ల‌కు వెళ‌తారా ? అది కూడా భ‌ర్త లేకుండా వెళుతుందా ? అని ప్ర‌శ్నించింది.

మా వైసీపీ వాళ్ల‌ను కించ‌ప‌రుస్తూ మాట్లాడావ్‌.. ఇప్పుడు మీ వీర మ‌హిళ సంగ‌తేంటి ? మా ఇంట్లో ఆడ‌పిల్ల‌లు అలాంటి వాళ్లు.. ఇలాంటి వాళ్లు అని చెప్పే క‌ళ్యాణాల ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇప్పుడు ఏం మాట్లాడ‌తాడు ? అని ప‌వ‌న్‌ను ఆడేసుకుంది. అస‌లు మీ పెంప‌కాలు ఏంట్రా నాగ‌బాబు… ఆ పిల్ల త‌ప్పు కాదు… త‌ప్పు మీ పెంప‌కానిది .. అంటే నీదే త‌ప్పు… న‌న్ను ఎన్నో నిద్ర‌లేని రాత్రుల‌ను గ‌డిపేలా చేశావు… ఇప్పుడు ఆ క‌ర్మ నిన్ను వెంటాడుతోంద‌ని బూతుల వ‌ర్షం కురిపించేసింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news