Movies' సింగం హ‌రి ' భార్య టాలీవుడ్ హీరోయినే... ఆమెది ఎంత...

‘ సింగం హ‌రి ‘ భార్య టాలీవుడ్ హీరోయినే… ఆమెది ఎంత పెద్ద బ్యాక్‌గ్రౌండో తెలుసా…!

సింహం హ‌రిగోపాల్ కృష్ణ‌న్ నాడార్ సౌత్ ఇండియాలోని టాప్ డైరెక్ట‌ర్ల‌లో ఒక‌రు. యాక్ష‌న్ సినిమాలు తెర‌కెక్కించ‌డంలో స్పెష‌లిస్ట్ అయిన హ‌రి సింగం సీరిస్ సినిమాల‌తో నేష‌న‌ల్ వైడ్‌గా పాపుల‌ర్ అయ్యాడు. అస‌లు హ‌రి యాక్ష‌న్ అంటే మాస్ ప్రేక్ష‌కులు పిచ్చెక్కిపోవాల్సిందే. హ‌రి స్క్రీన్ ప్లే జెట్ రాకెట్ స్పీడ్‌తో ప‌రుగులు పెట్టేస్తూ ఉంటుంది. కోలీవుడ్ ఎందరో స్టార్ హీరోల‌తో మాస్ మ‌సాలా యాక్ష‌న్ సినిమాలు తెరకెక్కించి హ‌రి సూప‌ర్ హిట్లు కొట్టారు. హ‌రి కోలీవుడ్ డైరెక్ట‌ర్ అయినా కూడా ఆయ‌న‌కు సౌత్ ఇండియాలో అన్ని భాష‌ల్లో అభిమానులు ఉన్నారు.

హ‌రి భార్య పేరు ప్రీతి. ఆమె కూడా తెలుగు హీరోయిన్‌. తెలుగులో కొన్ని సినిమాల్లో న‌టించిన ప్రీతిది పెద్ద బ్యాక్‌గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ. అల‌నాటి దివంగ‌త మేటి న‌టి మంజుల‌… న‌టుడు విజ‌య్ కుమార్‌ దంప‌తుల కుమార్తె. విజ‌య్ కుమార్‌కు అంత‌కుముందే ఓ పెళ్ల‌య్యింది. న‌టుడు అరుణ్ విజ‌య్ ముందు భార్య ద్వారా జ‌న్మించాడు. ఆ త‌ర్వాత మంజుల విజ‌య్ కుమార్‌కు రెండో భార్య‌గా ఆ ఇంటికి వెళ్లింది. ఈ దంప‌తుల‌కు ముగ్గురు కుమార్తెలు. ఈ ముగ్గురు కూడా హీరోయిన్లుగా చేసిన‌వారే.

మంజుల చెన్నైలోనే పుట్టి పెరిగినా తెలుగు, త‌మిళం, క‌న్న‌డం, మ‌ళ‌యాళం సినిమాల్లో న‌టించింది. తెలుగులో ఆమె ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, కృష్ణ‌, శోభ‌న్‌బాబు ప‌క్క‌న హిట్ సినిమాలు చేసింది. ఇక మంజుల – విజ‌య్ కుమార్ కుమార్తెల విష‌యానికి వ‌స్తే పెద్ద కుమార్తె వ‌నిత విజ‌య్‌కుమార్ తెలుగులో దేవి సినిమా చేసింది. మ‌రో కుమార్తె శ్రీదేవి, మ‌రో కుమార్తె ప్రీతి కూడా ఇక్క‌డ న‌టించిన వారే. ఇక ప్రీతి సింగం హ‌రి డైరెక్ష‌న్‌లో న‌టిస్తోన్న స‌మ‌యంలోనే అత‌డితో ప్రేమ‌లో ప‌డింది. అయితే వీరి ప్రేమ‌కు పెద్ద‌ల నుంచి అభ్యంత‌రాలు వ్య‌క్తం అయ్యాయి.

అయితే తానే ఇంట్లో ఒప్పించి ప్రీతి – హ‌రి పెళ్లి చేశాన‌ని ప్రీతి సోద‌రి వ‌నిత ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పింది. వ‌నిత ఇటీవ‌ల మూడో పెళ్లి చేసుకుని ఆ భ‌ర్త‌కు కూడా దూర‌మై ప‌లు వివాదాల‌తో వార్త‌ల్లో నిలుస్తోన్న సంగ‌తి తెలిసిందే. తాను పెళ్లి చేసినా… ప్రీతి ఈ విష‌యాన్ని ఇప్ప‌ట‌కీ బ‌య‌ట‌కు చెప్ప‌ద‌ని.. తాను ఇబ్బందుల్లో ఉంటే క‌నీసం త‌న‌ను ఎవ్వ‌రూ ప‌ల‌క‌రించిన పాపాన కూడా పోలేద‌ని వ‌నిత వాపోయింది. అలాగే త‌న మ‌రో సోద‌రి శ్రీదేవి కూడా త‌న ఫ‌స్ట్ భ‌ర్త ఫ్రెండ్‌నే పెళ్లి చేసుకుంద‌ని.. వాళ్ల ఇంట్లో సినిమా అమ్మాయిని కోడ‌లిగా ఒప్పుకోక‌పోతే తానే ఒప్పించి వాళ్ల పెళ్లి చేశాన‌ని ఓ ఇంట‌ర్వ్యూలో వాపోయింది.

ఇక హ‌రి – ప్రీతి దంప‌తులు పెళ్లి త‌ర్వాత హ‌రికి మ‌రింత క‌లిసి వ‌చ్చింది. ఆ త‌ర్వాత సింగం సీరిస్ సినిమాల‌తో మ‌రింత పాపుల‌ర్ అయ్యాడు. ఈ దంప‌తుల‌కు ముగ్గురు పిల్ల‌లు ఉన్నారు. హ‌రి ప్ర‌స్తుతం కోలీవుడ్ స్టార్ హీరో విక్ర‌మ్ హీరోగా ఓ సినిమా తెర‌కెక్కించే ప్లాన్‌లో ఉన్నాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news