Movies' ఎన్టీఆర్ - ప్ర‌శాంత్ నీల్ ' సినిమాపై ఫ్యీజులు ఎగిరిపోయే...

‘ ఎన్టీఆర్ – ప్ర‌శాంత్ నీల్ ‘ సినిమాపై ఫ్యీజులు ఎగిరిపోయే అప్‌డేట్‌… కేక పెట్టించేశార్రా..!

కేజీయ‌ఫ్ సినిమా త‌ర్వాత క‌న్న‌డ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ ఒక్క‌సారిగా పాన్ ఇండియా లెవ‌ల్లో పాపుల‌ర్ అయిపోయాడు. ఇప్పుడు ప్ర‌శాంత్ డైరెక్ట్ చేసిన కేజీయ‌ఫ్ 2 ఈ నెల 14న ప్ర‌పంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ అవుతోంది. ఈ సినిమాకు తెలుగులో ఆచార్య‌ను మించిన రేంజ్‌లో బిజినెస్ జ‌రిగింది అంటేనే కేజీయఫ్ 2పై ఎలాంటి అంచ‌నాలు ఉన్నాయో అర్థ‌మ‌వుతోంది. ప్ర‌స్తుతం త్రిబుల్ ఆర్ స‌క్సెస్ ఎంజాయ్ చేస్తోన్న ఎన్టీఆర్ త‌న 31వ సినిమాను కొర‌టాల శివ‌కు క‌మిట్ అయ్యాడు.

ఈ సినిమా షూటింగ్ ఇప్ప‌టికే సెట్స్ మీదకు వెళ్లాల్సి ఉంది. అయితే కొర‌టాల ఆచార్య ఈ నెల 29న రిలీజ్ అవుతుండ‌డంతో ఆ హ‌డావిడిలో ఉన్నాడు. ఈ సినిమా రిలీజ్ అయ్యాకే కొర‌టాల – ఎన్టీఆర్ సినిమా సెట్స్ మీద‌కు వెళుతుంది. ఇక కేజీయ‌ఫ్ 2 ప్ర‌మోష‌న్ల‌లో బిజీగా ఉన్న ప్ర‌శాంత్ నీల్ ఆ త‌ర్వాత ప్ర‌భాస్‌తో స‌లార్ సినిమాను పూర్తి చేస్తాడు. రెండు పార్టులుగా వ‌స్తోన్న స‌లార్ వ‌చ్చే యేడాది మార్చిలోగా పూర్తి చేసే ఛాన్సులు ఉన్నాయి.

ఈ లోగా ఎన్టీఆర్ – కొర‌టాల సినిమా కూడా కంప్లీట్ అవుతుంది. ఆ త‌ర్వాత ఎన్టీఆర్ 32వ ప్రాజెక్టు.. ప్ర‌శాంత్ నీల్‌తోనే ఉంటుంది. మైత్రీ మూవీస్ వాళ్లు ఈ సినిమాను భారీ బ‌డ్జెట్‌తో ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించి ఫ్యీజులు ఎగిరిపోయే అప్‌డేట్ బ‌య‌ట‌కు వ‌చ్చేసింది. ఈ భారీ యాక్ష‌న్ డ్రామాలో బాలీవుడ్ స్టార్ బ్యూటీ దీపికా ప‌దుకొణేను హీరోయిన్‌గా తీసుకున్నట్టు తెలుస్తోంది.

దీపిక ఇప్ప‌టికే సౌత్‌లో యంగ్‌రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ – నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ కే సినిమా చేస్తోంది. దీపిక ఈ సినిమాలో చేరితే అస‌లు పాన్ ఇండియా లెవ‌ల్లో ఈ సినిమాకు మామూలు క్రేజ్ రాదు. దీపిక ఉంటే నార్త్‌లో, ఇటు ప్ర‌శాంత్ నీల్ దెబ్బ‌కు క‌న్న‌డంలో.. ఇటు తెలుగులో ఎన్టీఆర్ ఇలా ఓవ‌రాల్‌గా ఈ ప్రాజెక్టు సెట్స్ మీద‌కు వెళ్లే ముందే ఎన్నో సంచ‌ల‌నాల‌కు కేరాఫ్ అవుతుంది.

ఇక హీరోయిన్ పేరు బ‌య‌ట‌కు రావ‌డంతోనే ఎన్టీఆర్ – నీల్ కాంబినేష‌న్ కేక పెట్టించేసింది. కేజీయ‌ఫ్ 2 ప్ర‌మోష‌న్ల‌లో బిజీగా ఉన్న ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ త‌న తాజా ఇంట‌ర్వ్యూలో ఎన్టీఆర్‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు కూడా చేశాడు. తాను గ‌త 20 ఏళ్లుగా ఎన్టీఆర్‌కు అభిమానిని అని.. తాము ఇప్పుడు బాగా క్లోజ్‌ఫ్రెండ్స్ అయిపోయామ‌ని చెప్పాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news