Moviesబెస్ట్ ఫ్రెండ్స్ ఎన్టీఆర్ - చ‌ర‌ణ్ మ‌ధ్య ఇంట్ర‌స్టింగ్ వార్ త‌ప్ప‌దా...!

బెస్ట్ ఫ్రెండ్స్ ఎన్టీఆర్ – చ‌ర‌ణ్ మ‌ధ్య ఇంట్ర‌స్టింగ్ వార్ త‌ప్ప‌దా…!

ఆర్ఆర్ఆర్ మూవీలో ఇద్ద‌రు టాలీవుడ్ క్రేజీ హీరోలు క‌లిసి న‌టించి బాక్సాఫీస్‌ను షేక్ చేసి ప‌డేశారు. టాలీవుడ్ యంగ్ క్రేజీ స్ట‌ర్స్ అయిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటించి ర‌చ్చ చేశారు. నిజ జీవితంలో వీరిద్ద‌రు బెస్ట్ ఫ్రెండ్స్ అవ్వ‌డంతోనే అల్లూరి, కొమ‌రం భీం పాత్ర‌ల్లో వీరు అంత‌లా లీన‌మై న‌టించారు. నిజ జీవితంలో ఇద్ద‌రి మ‌ధ్య ఉన్న స్నేహం నేప‌థ్యంలోనే సినిమాలో కూడా అంతే గొప్ప స్నేహితులుగా ఎన్టీఆర్ – చ‌ర‌ణ్ చ‌క్క‌గా న‌టించారు.

ఈ సినిమా తాజాగా 15 రోజుల‌కు ప్ర‌పంచ వ్యాప్తంగా రు. 1000 కోట్ల గ్రాస్ వ‌సూళ్లు సాధించిన సినిమాగా రికార్డుల‌కు ఎక్కింది. బాహుబ‌లి 2, దంగ‌ల్ త‌ర్వాత అంతే స్పీడ్‌గా వ‌సూళ్లు సాధించిన మూడో ఇండియ‌న్ సినిమాగా త్రిబుల్ ఆర్ రికార్డుల‌కు ఎక్కింది. ఏదేమైనా ఈ సినిమా త‌ర్వాత ఎన్టీఆర్ – చ‌ర‌ణ్ బంధం మ‌రింత స్ట్రాంగ్ అయ్యింది. వీరిద్ద‌రి భార్య‌లు కూడా మ‌రింత ద‌గ్గ‌ర‌య్యారు.

అయితే ఈ ఇద్ద‌రు బెస్ట్ ఫ్రెండ్స్ మ‌ధ్య ఇప్పుడు పెద్ద బాక్సాఫీస్ స‌మ‌రం స్టార్ట్ కానుంది. ప్ర‌స్తుతం చెర్రీ, కొర‌టాల ఇద్ద‌రూ కూడా రెండు క్రేజీ పాన్ ఇండియా సినిమాల్లో న‌టిస్తున్నారు. రామ్ చ‌ర‌ణ్ త‌న 15వ ప్రాజెక్టును శంక‌ర్ డైరెక్ష‌న్‌లో చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. దిల్ రాజు ఏకంగా రు. 200 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కియారా అద్వానీ హీరోయిన్‌.

ఇక ఆచార్య త‌ర్వాత కొర‌టాల ఎన్టీఆర్ 30వ ప్రాజెక్టును టేకాఫ్ చేశారు. మిక్కిలినేని సుధాక‌ర్‌, అటు నందమూరి క‌ళ్యాణ్‌రామ్ ఇద్ద‌రూ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్‌కు జోడీగా అలియాభ‌ట్‌ను ఎంపిక చేశారు. కొర‌టాల ఈ సినిమాను పాన్ ఇండియా లెవ‌ల్లో ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ రెండు సినిమాలు కూడా వ‌చ్చే మార్చిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

శంక‌ర్ – రామ్‌చ‌ర‌ణ్ సినిమా ఇప్ప‌టికే రెండు షెడ్యూల్స్ షూటింగ్ పూర్తి చేసుకుంది. ఓ భారీ ఫైట్‌తో పాటు సాంగ్ కూడా పూర్తి చేశారు. ఎన్టీఆర్ – కొర‌టాల సినిమా మే నుంచి సెట్స్ మీద‌కు వెళుతుంది. ఈ రెండు సినిమాలు వ‌చ్చే మార్చిలోనే రిలీజ్ అయితే బాక్సాఫీస్ ద‌గ్గ‌ర 2023 స‌మ్మ‌ర్ హీట్ మామూలుగా ఉండ‌దు. మ‌రి వీరిలో ఎవ‌రు పై చేయి సాధిస్తారు ? అన్న‌ది కూడా ఇంట్ర‌స్టింగే అవుతుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news