Moviesమెగాస్టార్ చిరంజీవి - వెంక‌టేష్ మ‌ల్టీస్టార‌ర్.... డైరెక్ట‌ర్ కూడా ఫిక్స్‌...!

మెగాస్టార్ చిరంజీవి – వెంక‌టేష్ మ‌ల్టీస్టార‌ర్…. డైరెక్ట‌ర్ కూడా ఫిక్స్‌…!

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ అయిపోయారు. చిరు తాజా చిత్రం ఆచార్య ఈ నెల 29న థియేట‌ర్ల‌లోకి రానుంది. ఆచార్య త‌ర్వాత జూలైలోనే మ‌రోసారి చిరు గాడ్ ఫాద‌ర్ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాడు. ఆ త‌ర్వాత మెహ‌ర్ ర‌మేష్ వేదాళం రీమేక్ భోళాశంక‌ర్ ద‌స‌రాకు లేదా స‌మ్మ‌ర్‌కు వ‌చ్చే ఛాన్సులు ఉన్నాయి. ఆ త‌ర్వాత చిరు – బాబి వాల్తేరు వీర‌య్య సైతం వ‌చ్చే స‌మ్మ‌ర్‌లో రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు.

ఓవ‌రాల్‌గా చూస్తుంటే యేడాది వ్య‌వ‌ధిలోనే చిరు ఏకంగా 4 సినిమాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు రావ‌డం అంటే అటు మెగాభిమానుల‌తో పాటు ఇటు సినిమా ల‌వ‌ర్స్‌కు కూడా మాంచి ఫీస్ట్ అనే చెప్పాలి. ఈ వ‌రుస సినిమాల ప‌రంప‌ర‌లో వెంకీ మ‌రో సినిమాకు సైతం గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చేశారు. అదే వెంకీ కుడుముల సినిమా. వెంకీ కుడుముల ఇప్ప‌టికే డైరెక్ట‌ర్‌గా తానేంటో ఫ్రూవ్ చేసుకున్నాడు.

ఇక ఇప్పుడు చిరును ఇంప్రెస్ చేయ‌డానికి మెయిన్ రీజ‌న్ స‌బ్జెక్టే అని తెలుస్తోంది. సొసైటీలో ఉన్న ఓ మెసేజ్ ఓరియంటెడ్ ఇష్యూను చాలా క‌మ‌ర్షియ‌ల్‌గా చూపించ‌బోతున్నాడ‌ని తెలుస్తోంది. ఇది మల్టీస్టార‌ర్ సినిమా అని.. ఇందులో మ‌రో హీరో కూడా ఉంటాడ‌ని ఎప్ప‌టి నుంచో వార్త‌లు వ‌స్తున్నాయి. చిరు ఆచార్య‌లో చెర్రీతో క‌లిసి న‌టిస్తున్నాడు. అలాగే గాడ్ ఫాద‌ర్ మూవీలో ఏకంగా బాలీవుడ్ కండ‌ల వీరుడు స‌ల్మాన్ ఖాన్ సైతం చిన్న గెస్ట్ రోల్ చేశారు.

ఇక ఇప్పుడు వెంకీ కుడుముల సినిమాలో మ‌రో సీనియ‌ర్ హీరో విక్ట‌రీ వెంక‌టేష్‌ను నటింపేజేసేందుకు ప్ర‌య‌త్నాలు అయితే జ‌రుగుతున్నాయ‌ని తెలిసింది. గ‌తంలో వెంకీ – ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో క‌లిసి గోపాల గోపాల సినిమాలో న‌టించారు. ఆ త‌ర్వాత మరో మెగా హీరో వ‌రుణ్ తేజ్‌తో ఎఫ్ 2 – ఎఫ్ 3 సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడున్న సీనియ‌ర్ హీరోల్లో ఎక్కువుగా మ‌ల్టీస్టార‌ర్ సినిమాలు చేసేందుకు ఆస‌క్తి చూపుతోంది కూడా వెంక‌టేషే.

ఇక వెంక‌టేష్ – చిరు కూడా ఎప్ప‌టి నుంచో మంచి స్నేహితులు. అలాంటిది ఇప్పుడు వీరిద్ద‌రు క‌లిసి మ‌ల్టీస్టార‌ర్ సినిమా అంటే మామూలు ఎంజాయ్ ఉండ‌దు. ఈ క్రేజీ కాంబినేష‌న్ కోసం టాలీవుడ్ జ‌నాలు కూడా ఎంతో ఆస‌క్తితోనే ఉంటారు. త్వ‌ర‌లోనే ఈ సినిమాకు సంబంధిం ఫుల్ అప్‌డేట్స్ బ‌య‌ట‌కు రానున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news