Moviesమ‌హాన‌టి డైరెక్ట‌ర్ ' నాగ్ అశ్విన్ - ప్రియాంక ద‌త్ '...

మ‌హాన‌టి డైరెక్ట‌ర్ ‘ నాగ్ అశ్విన్ – ప్రియాంక ద‌త్ ‘ ల‌వ్‌స్టోరీ ఇదే…!

చేసింది రెండే సినిమాలు. రెండు హిట్‌.. అందులో ఒక‌టి బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ కావ‌డ‌మే కాదు.. టోట‌ల్ ఇండ‌స్ట్రీనే ఆశ్చ‌ర్య‌పోయేలా చేసింది. ఇప్పుడు చేస్తోన్న మూడో ప్రాజెక్టు హాలీవుడ్ రేంజ్‌లో ఉంటుంద‌ని అంటున్నారు. దీంతో ఒక్కొక్క‌రు షాక్ అయిపోతున్నారు. ఎవ‌డే సుబ్ర‌హ్మ‌ణ్యం సినిమాతో మెగా ఫోన్ ప‌ట్టిన నాగ్ అశ్విన్ మ‌హాన‌టి సినిమాతో సూప‌ర్ పాపుల‌ర్ అయిపోయాడు. ఈ సినిమా తెలుగులో మాత్ర‌మే కాదు.. అటు త‌మిళ్‌.. సౌత్‌లో ఓ ఊపు ఊపేసింది. దివంగ‌త మ‌హాన‌టి సావిత్రి జీవితాన్ని అనుక్ష‌ణం ఉత్కంఠ భ‌రితంగా.. ఇంకా చెప్పాలంటే చ‌రిత్ర‌లో ఎప్ప‌ట‌కి నిలిచిపోయే క్లాసిక్‌లా తెర‌కెక్కించిన తీరుకు ప్ర‌తి ఒక్క‌రు ఫిదా అయిపోతున్నారు.

మ‌హాన‌టి మ‌హామ‌హా డైరెక్ట‌ర్లు, న‌టుల‌నే మెప్పించింది. మ‌హాన‌టి ఇచ్చిన ఊపుతోనే నాలుగు ద‌శాబ్దాల వైజ‌యంతీ మూవీస్ బ్యాన‌ర్ పేరు మ‌ళ్లీ స‌గ‌ర్వంగా త‌లెత్తుకుని నిల‌బ‌డేలా చేసింది. ప్ర‌స్తుతం నాగ్ అశ్విన్ రూ. 500 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో ప్ర‌భాస్‌తో ప్రాజెక్ట్ కె సినిమా తెర‌కెక్కిస్తున్నాడు. హాలీవుడ్ రేంజ్‌లో ఈ సినిమా క‌థ‌, క‌థ‌నాలు ఉంటాయ‌ని అంటున్నారు. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ న‌టిస్తోన్న సినిమాల‌న్నింటిలోనూ ఈ సినిమాపైనే భారీ అంచ‌నాలు ఉన్నాయి.

ఇక నాగ్ అశ్విన్‌.. వైజ‌యంతీ అధినేత అశ్వినీద‌త్ కుమార్తె ప్రియాంక ద‌త్‌ను ప్రేమ వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. అస‌లు వీరిద్ద‌రు ఎలా ? ప్రేమ‌లో ప‌డ్డారు ? ఆ స్టోరీ ఏంటి… డాక్ట‌ర్ కావాల్సినోడు డైరెక్ట‌ర్ ఎలా అయ్యాడో తెలిస్తే కాస్త విచిత్రంగానే ఉంటుంది. నాగ్ అశ్విన్ అమెరికాలో ఉండేవాడు.. డైరెక్ట‌ర్ అవ్వాల‌న్న కోరిక‌తో అక్క‌డ ఫిలిం మేకింగ్ కోర్సు చేశాడు.

ఇండియాకు వ‌చ్చి ఎవ‌డే సుబ్ర‌హ్మ‌ణ్యం సినిమాను తెర‌కెక్కించాడు. నానీ హీరోగా రూపొందిన ఈ సినిమాలో విజ‌య్ దేవ‌ర‌కొండ కూడా మ‌రో పాత్ర‌లో న‌టించాడు. చాలా క్లాసిక‌ల్ మూవీగా తెర‌కెక్కిన ఎవ‌డే సుబ్ర‌హ్మ‌ణ్యం సినిమాకు మంచి ప్ర‌శంస‌లు కూడా వ‌చ్చాయి. ఆ సినిమా నిర్మాణ వ్య‌వ‌హారాలు అన్ని ప్రియాంక చూసుకునేవారు. ఈ క్ర‌మంలోనే వీరిద్ద‌రి మ‌ధ్య ప‌రిచ‌యం ఏర్ప‌డ‌డం.. చివ‌ర‌కు ప్ర‌తి చిన్న విష‌యంలోనూ వీరు ఒక‌రిపై మ‌రొక‌రు ఆధార‌ప‌డేంత ప‌రిచ‌యానికి వెళ్లిపోయారు.

ఇద్ద‌రిలో ఎవ‌రికి ఏ చిన్న స‌మ‌స్య వ‌చ్చినా వెంట‌నే ఫోన్లు చేసుకునేవార‌ట‌. ఆ క్లోజ్‌నెస్ చివ‌ర‌కు బ‌ల‌మైన ప్రేమ‌గా మారింది. అయితే ప్రేమ విష‌యాన్ని ముందుగా ప్రియాంకే నాగ్‌తో ప్ర‌స్తావించ‌డం… ఆ త‌ర్వాత అశ్వీనీద‌త్‌కు కాస్త మ‌న‌సుకు క‌ష్ట‌మైనా త‌ర్వాత ఒప్పుకోవ‌డం జ‌రిగిపోయాయ్‌. ఏదేమైనా వైజ‌యంతీ బ్యాన‌ర్‌కు ఉన్న గొప్ప పేరు ప్ర‌ఖ్యాతుల‌ను ఈ త‌రంలో కూడా మ‌హాన‌టి సినిమాతో కంటిన్యూ చేసిన ఘ‌న‌త అయితే నాగ్ అశ్విన్‌కే ద‌క్కుతుంది.

మెగా ప్రొడ్యుస‌ర్‌కు స‌రైన అల్లుడే దొరికాడ‌నే ఇండ‌స్ట్రీ అంతా మెచ్చుకుంది. మ‌హాన‌టి సినిమా చూశాక అశ్వనీద‌త్ పొంగిపోయార‌ట‌. అటు నాగ్ త‌ల్లిదండ్రులు సైతం ముందు డాక్ట‌ర్ చ‌దువు వ‌దులుకుని.. అమెరికా నుంచి ఇక్క‌డ‌కు ఎందుకు వ‌చ్చాడా ? అని బాధ‌ప‌డేవార‌ట‌. మ‌హాన‌టి చూశాక చాలా గ‌ర్వంగా ఫీల్ అయ్యార‌ని కూడా నాగ్ ఓ సంద్భంలో చెప్పారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news