Moviesఆ మాజీ మంత్రి జీవిత‌మే మ‌హేష్ బాబు దూకుడు సినిమా స్టోరీయా...!

ఆ మాజీ మంత్రి జీవిత‌మే మ‌హేష్ బాబు దూకుడు సినిమా స్టోరీయా…!

మ‌హేష్‌బాబు కెరీర్ బాగా డౌన్‌లోకి వెళ్లిపోవ‌డం.. ఆ త‌ర్వాత ఒక్క సూప‌ర్ హిట్ తిరిగి స్వింగ్‌లోకి రావ‌డం చాలా సార్లు జ‌రిగింది. రాజ‌కుమారుడుతో మ‌హేష్ హీరో అయినా ఒక్క‌డు సినిమాతోనే మ‌నోడికి సూప‌ర్‌స్టార్ డ‌మ్ వ‌చ్చింది. ఒక్క‌డు సినిమా మ‌హేష్‌బాబును ఆకాశంలోకి తీసుకువెళ్లింది. ఆ త‌ర్వాత అన్ని ప్లాపులే.. పోకిరితో ఫామ్‌లోకి వ‌చ్చాడు. అయితే అతిథి సినిమా డిజాస్ట‌ర్ అయ్యాక మూడున్న‌రేళ్లు అస్స‌లు సినిమాలు చేయ‌లేదు.

2007 చివ‌ర్లో వ‌చ్చిన అతిథి ప్లాప్ అయ్యింది. ఆ త‌ర్వాత 2008 – 2009 కేలండ‌ర్ ఇయ‌ర్స్ మ‌హేష్ కెరీర్‌లో ఖాళీగా ఉండిపోయాయి. 2010 అక్టోబ‌ర్లో కాని మ‌ళ్లీ మ‌హేష్ సినిమా రాలేదు. ఆ సినిమా కూడా తీవ్రంగా నిరాశ ప‌రిచింది. అంటే పోకిరి త‌ర్వాత నాలుగేళ్ల పాటు మూడేళ్లు ఖాళీ.. మ‌ధ్య‌లో చేసిన సినిమాలు కూడా డిజాస్ట‌ర్‌. మ‌హేష్ ఫ్యాన్స్ కూడా బాగా డిజ‌ప్పాయింట్ అయిపోయి ఉన్నారు.

ఆ టైంలో 2010 చివ‌ర్లో వ‌చ్చిన దూకుడు సినిమా బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ అయ్యింది. ఆ సినిమాతో మ‌ళ్లీ మ‌హేష్‌కు ఐదారేళ్ల త‌ర్వాత పున‌ర్వైభ‌వం వ‌చ్చింది. దూకుడు తిరుగులేని బ్లాక్బ‌బ‌స్ట‌ర్ అవ్వ‌డం ఒక ఎత్తు అయితే.. మ‌హేష్‌లో కామెడీ టైమింగ్ కూడా ఫ్రూవ్ చేసింది. ఈ క్రెడిట్ ఖ‌చ్చితంగా ద‌ర్శ‌కుడు శ్రీను వైట్ల‌కే చెందుతుంది. అస‌లు దూకుడు సినిమా ఎలా ? పుట్టింది ? ఈ సినిమా వెన‌క ఉన్న స్టోరీ ఏంటో శ్రీను వైట్ల‌యే ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పారు.

శ్రీను వైట్ల మ‌హేష్ సోద‌రి మంజుల ద‌గ్గ‌ర అడ్వాన్స్ తీసుకున్నార‌ట‌. ఈ క్ర‌మంలోనే ఆమెతో సినిమా చేయాల‌నుకున్న‌ప్పుడు హీరో ఎవ‌రు ? అన్న ప్ర‌శ్న రాగానే మంజుల‌యే ఎవ‌రో ఎందుకు మ‌హేష్‌బాబుతో చేద్దాం అన్నార‌ట‌. మ‌హేష్ కూడా శ్రీను వైట్ల సినిమాలు చూసి ఉండ‌డంతో వెంట‌నే మ‌హేష్ ఓకే చెప్పేశార‌ట‌. అయితే శ్రీను వైట్ల త‌న స్వార్థం చూసుకుని ఈ ప్రాజెక్టును 14 రీల్స్ వాళ్ల కోసం ఆ బ్యాన‌ర్లోకి మార్పించారు.

ముందుగా గోపీ మోహ‌న్ రాసుకున్న స్టోరీని సినిమాగా తీయాల‌ని అనుకున్నార‌ట‌. అయితే ఆ క‌థ శ్రీను వైట్ల‌కు న‌చ్చ‌లేద‌ట‌. స‌డెన్‌గా ఓ రోజు మ‌హేష్ ద‌గ్గ‌ర‌కు వెళ్లి ఈ విష‌యాన్ని నేరుగా ఆయ‌న‌తోనే సార్ మ‌నం క‌థ‌తో సినిమా చేయ‌ట్లేద‌ని చెప్ప‌డంతో వెంట‌నే మ‌హేష్ థ్యాంక్స్ శ్రీను గారు.. నేనే ఆ విష‌యం మీతో చెప్పాల‌ని అనుకున్నాను.. నాకు కూడా ఈ క‌థ ఏతో తేడా కొడుతోంద‌ని అనిపిస్తుంద‌ని అన్నార‌ట‌.

ఆ త‌ర్వాత హైద‌రాబాద్‌లో ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే, సీనియ‌ర్ కాంగ్రెస్ నేత‌, మాజీ మంత్రి పి. జనార్థ‌న్ రెడ్డి జీవితంలో కొన్నివిష‌యాలు తీసుకుని.. ఆయ‌న‌ను ప్ర‌జ‌లు ఎలా దేవుడిగా కొలుస్తారు.. అన్న కోణం నుంచి ఓ లైన్ రెడీ చేసుకున్నార‌ట శ్రీను వైట్ల‌. త‌ర్వాత అదే లైన్‌ను గోపీమోహ‌న్‌తో క‌లిసి డ‌వ‌ల‌ప్ చేశార‌ట‌. ఈ క‌థ విన్న మ‌హేష్ పెంటాస్టిక్ మైండ్ బ్లోయింగ్‌.. అన్ బిలీవ‌బుల్ అన్న డైలాగ్ వేశార‌ట‌. త‌ర్వాత ఇదే డైలాగ్‌ను తాను సినిమాలో కూడా వాడుకున్నాన‌ని శ్రీను వైట్ల చెప్పారు. అలా దూకుడు క‌థ పుట్ట‌డం.. బ్లాక్‌బ‌స్ట‌ర్ కొట్ట‌డం జ‌రిగిపోయాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news