Moviesస్టార్ హీరోయిన్ అవ్వాల్సిన బేబీ షామిలీ కెరీర్ ఆ కార‌ణంగానే నాశ‌న‌మైందా...!

స్టార్ హీరోయిన్ అవ్వాల్సిన బేబీ షామిలీ కెరీర్ ఆ కార‌ణంగానే నాశ‌న‌మైందా…!

ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్టుగా చేసిన వారు అదే క్రేజ్‌తో ఆ తర్వాత పెద్దయ్యాక హీరో, హీరోయిన్లుగా ఎంట్రీ ఇవ్వడం చేస్తూ ఉంటారు. ఇలా ఇప్పటి వరకు తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతోమంది చైల్డ్ ఆర్టిస్ట్‌లు, హీరో, హీరోయిన్లుగా మారిపోయిన వారు ఉన్నారు. ఇక అలాంటి వారిలో అతిలోక సుందరి శ్రీదేవి కూడా ఒకరు అని చెప్పాళి. నేటితరంలో అప్పుడెప్పుడో ఇంద్ర సినిమాలో బుల్లి చిరంజీవిగా నటించిన తేజ సజ్జ ఇప్పుడు హీరోగా రాణిస్తున్నాడు. అచ్చం ఇలాగే ఒకప్పుడు ఓల్డ్ ఆర్టిస్ట్‌గా అలరించి ఆ తర్వాత హీరోయిన్ గా మారిపోయింది బేబీ షామిలి.

అంజలి సినిమా ద్వారా చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన బేబీ షామిలి… ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించింది. చిరంజీవి – శ్రీదేవి కాంబినేషన్ లో జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమాతో చిరంజీవిని రాజు అంటూ ఆమె బుల్లి బుల్లి మాట‌ల‌తో పిలిచి ప్రేక్ష‌కుల‌ను అలా క‌ట్టిప‌డేసింది. ఆ సినిమాతో షామిలీకి మరింత క్రేజ్ సంపాదించింది. ఇక అప్పట్లో కూడా భారీగానే పారితోషకం తీసుకునేది బేబీ షామిలి. ఇలా చైల్డ్ ఆర్టిస్ట్ గా దాదాపు 40కి పైగా సినిమాల్లో నటించింది.

చిన్నప్పుడు క్యూట్ క్యూట్‌గా కనిపించి అందరినీ మెప్పించిన బేబీ షామిలి పెద్దయ్యాక హీరోయిన్ గా అవతారమెత్తింది. సిద్ధార్థ్ తో కలిసి ఓయ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను హీరోయిన్ గా పలకరించింది. సినిమా అంతా బాగుంది కానీ ఎందుకో బేబీ షామిలి లుక్స్ మాత్రం హీరోయిన్‌కు దగ్గరగా లేవు అని అప్పట్లో ఎన్నో నెగిటివ్ కామెంట్స్ కూడా ఎదుర్కొంది. ఈ సినిమా తర్వాత ఈ అమ్మడికి ఒక్క అవకాశం కూడా రాలేదు.

అయితే తమిళంలో ధనుష్ సరసన కోడి సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. షూటింగ్ కి సరిగ్గా రాకపోవడం, భారీ రెమ్యున‌రేష‌న్ డిమాండ్ చేయ‌డంతో పాటు కొన్ని కండీషన్స్ పెట్టిన కారణంగా నిర్మాతలు ఈమెను తప్పించారన్న ప్ర‌చారం అప్ప‌ట్లో బాగా వినిపించింది. అంతకు ముందు ఒక మలయాళ సినిమా కూడా బేబీ షాలిని గొంతెమ్మ కోరికలు కారణంగా మిస్సయింద‌నే అంటారు.

ఇలా మొత్తానికి తన కెరీర్ చేతులారా పాడు చేసుకుంది షామిలి. ఇక బేబీ షామిలి కుటుంబంలో కొంత మంది నటులు కూడా ఉన్నారు. ఆమె సొంత అక్క షాలిని ఎవరో కాదు తమిళ హీరో అజిత్ భార్య కావడం గమనార్హం. గతంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా పని చేసి ఆ తర్వాత హీరోయిన్ గా మారింది. ఈ క్రమంలో హీరో అజిత్ తో ప్రేమలో పడి పెళ్లి చేసుకుంది. ఇక షామిలి అన్నయ్య కూడా ఒక చైల్డ్ ఆరిస్ట్… నటుడు కావడం గమనార్హం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news