Moviesక‌త్రీనా ప్రెగ్నెంట్.. వైర‌ల్ అవుతోన్న వీడియో ( వీడియో)

క‌త్రీనా ప్రెగ్నెంట్.. వైర‌ల్ అవుతోన్న వీడియో ( వీడియో)

ఇప్పుడు అంతా సోష‌ల్ మీడియా యుగం ఎవ‌రి గురించి ఏ చిన్న వీడియో బ‌య‌ట‌కు వ‌చ్చినా క్ష‌ణాల్లో వైర‌ల్ అయిపోతూ ఉంటుంది. ఇక సెల‌బ్రిటీల వీడియోల గురించి నెట్టింట్లో ఎలాంటి చ‌ర్చ‌.. ఎలాంటి ర‌చ్చ జ‌రుగుతుందో ? చూస్తూనే ఉన్నాం. వాళ్లు వేసుకునే డ్రెస్సుల నుంచి హెయిర్ స్టైల్స్‌, కాలుకు వేసుకునే ఫుట్‌వేర్ ఇలా అన్నింటిమీద నెటిజ‌న్ల ఫోక‌స్ మామూలుగా ఉండ‌దు. కొన్నిసార్లు అయితే వాటిపై ట్రోలింగ్ మామూలుగా ఉండ‌దు. సోష‌ల్ మీడియాలో ఎన్ని ప్ర‌శంస‌లు వ‌స్తాయో.. ఒక్కోసారి అంతే ట్రోలింగ్ కూడా జ‌రుగుతుంది.

తాజాగా క‌త్రినా కైఫ్ పై ఇప్పుడు బాలీవుడ్ నెటిజ‌న్ల ఫోక‌స్ ప‌డింది. ఆమె గ‌తేడాదే త‌న‌కంటే వ‌య‌స్సులో చిన్నోడు అయిన విక్కీ కౌశ‌ల్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. దాదాపు రెండు ద‌శాబ్దాలుగా క్రేజీ హీరోయిన్‌గా కెరీర్ కొన‌సాగిస్తూ వ‌స్తోన్న క‌త్రినా స‌డెన్‌గా విక్కీ కౌశ‌ల్‌తో ప్రేమ‌లో ప‌డి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. అంత‌కు ముందు ఆమె స‌ల్మాన్‌ఖాన్‌, ర‌ణ‌వీర్‌సింగ్ లాంటి స్టార్ హీరోల‌తో కూడా ప్రేమాయ‌ణం న‌డిపింద‌న్న వార్త‌లు వ‌చ్చాయి.

ఇప్పుడు క‌త్రినా ఫ్రెగ్నెంట్ అన్న ప్ర‌చారం సోష‌ల్ మీడియాలో మామూలుగా జ‌ర‌గ‌డం లేదు. క‌త్రినా – విక్కీ కౌశ‌ల్ జంట త‌మ జీవితంలో జ‌రిగే ప్ర‌తి విష‌యాన్ని కూడా సోష‌ల్ మీడియాలో షేర్ చేసుకుంటూ ఉంటుంది. ఇక విక్కీని పెళ్లాడాక క‌త్రినా ప‌లు వెకేష‌న్ల‌కు వెళ్లింది. ఎక్క‌డ చూసినా ఈ జంట హ‌డావిడి క‌నిపిస్తోంది. తాజాగా క‌త్రినా ఎయిర్ పోర్టులో ద‌ర్శ‌న‌మిచ్చింది. ఈ వీడియోను ప్ర‌ముఖ ఫొటోగ్రాఫ‌ర్ వైరల్ భయానీ తన ఇన్‌స్టాగ్రామ్‌ హ్యాండిల్‌లో షేర్‌ చేశాడు.

ఇది నెట్టింట్లో మామూలుగా వైర‌ల్ కావ‌డం లేదు. ఈ వీడియోను చూసిన నెటిజ‌న్లు క‌త్రీనా ప్రెగ్నెంట్ అయ్యింద‌ని కామెంట్లు చేయ‌డం స్టార్ట్ చేశారు. నెటిజ‌న్ల‌లో ఓ వ్య‌క్తి అయితే ఓరి దేవుడా ఆమె ప్రెగ్నెంట్‌లా ఉంద‌ని అంటే.. మ‌రొక‌రు ఆమె త్వ‌ర‌లోనే త‌ల్లి అవుతోంద‌ని కామెంట్ చేశారు. మ‌రో నెటిజ‌న్ క‌త్రినా పాప‌ను చూడ‌డ‌మే చాలా అతృత‌గా ఉంద‌ని.. ఆమె వేసుకున్న డ్రెస్ వ‌ల్లే ఆమె ప్రెగ్నెంట్‌లా క‌న‌ప‌డుతోంద‌ని కామెంట్ పెట్టారు.

మ‌రి కత్రీనా నిజంగా ప్రెగ్నెంటా కాదా ? అన్న‌ది ఆమె క్లారిటీ ఇస్తే కాని తెలియ‌దు. కానీ ఎయిర్ పోర్టులో ఆమె డ్రెస్ వేసుకుని చాలా యాక్టివ్‌గా న‌డుచుకుంటూ వ‌స్తోంది.

https://www.instagram.com/viralbhayani/?utm_source=ig_embed&ig_rid=3e8377eb-580f-48de-af09-34ab0016d380

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news