Moviesఆమ‌నిని గెస్ట్ హౌస్‌కు ఒంట‌రిగా ర‌మ్మ‌న్న డైరెక్ట‌ర్‌... మీ అమ్మవ‌ద్ద‌ని చెప్పాడ‌ట‌...!

ఆమ‌నిని గెస్ట్ హౌస్‌కు ఒంట‌రిగా ర‌మ్మ‌న్న డైరెక్ట‌ర్‌… మీ అమ్మవ‌ద్ద‌ని చెప్పాడ‌ట‌…!

ఆమ‌ని 1990వ ద‌శ‌కంలో తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలోనే కాకుండా.. సౌత్ సినిమాలో ఓ టాప్ హీరోయిన్‌. చాలా మంది స్టార్ హీరోల‌తో న‌టించి సూప‌ర్ డూప‌ర్ హిట్లు కొట్టిన ఘ‌న‌త ఆమ‌ని సొంతం. ఈవీవీ స‌త్య‌నారాయ‌ణ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన జంబ‌ల‌డికి పంబ సినిమాతో ఆమె తెలుగులో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాలో సీనియ‌ర్ న‌రేష్‌కు జోడీగా ఆమె న‌టించింది. ఆ త‌ర్వాత ఆమె తెలుగులో కొన్నాళ్ల‌పాటు వెన‌క్కు తిరిగి చూసుకునే అవ‌కాశం కూడా లేదు.

క‌న్న‌డ క‌స్తూరి అయిన ఆమ‌ని సినిమాల మీద ఇంట్ర‌స్ట్‌తో మ‌ద్రాస్‌కు చెక్కేసింది. అక్క‌డ కొద్ది రోజులు సినిమాల్లో ఛాన్సుల కోసం ఇబ్బంది ప‌డింది. చివ‌ర‌కు హీరోయిన్‌గా సెటిల్ అయ్యింది. జంబ‌ల‌డికి పండ సినిమా త‌ర్వాత ఆమ‌ని తెలుగులో మిస్టర్ పెళ్లాం, శుభలగ్నం, శుభసంకల్పం, మావిచిగురు వంటి సినిమాల్లో అద్భుత న‌ట‌న‌తో మ‌హిళా ప్రేక్ష‌కుల మ‌న‌స్సుల్లోకి చొచ్చుకుపోయింది.

ముఖ్యంగా జ‌గ‌ప‌తిబాబు స‌ర‌స‌న ఆమె శుభ‌ల‌గ్నం సినిమాలో త‌న భ‌ర్త‌ను రోజాకు అమ్ముకునే పాత్ర‌లో న‌టించి సెంటిమెంట్ పండించేసింది. ఆ ఒక్క పాత్ర ఆమ‌నిని తెలుగు ప్రేక్ష‌కులు ఎప్ప‌ట‌కీ మ‌ర్చిపోలేని హీరోయిన్‌ను చేసింది. ఆమ‌ని చేసిన పాత్ర‌ల్లో మ‌రో హీరోయిన్‌ను ఊహించుకోలేనంత‌గా ఆమె న‌ట‌న ఉండేది. తెలుగులో అగ్ర ద‌ర్శ‌కులు అయిన ఎస్వీ. కృష్ణారెడ్డి, కె. రాఘ‌వేంద్ర‌రావు, ఈవీవీ స‌త్య‌నారాయ‌ణ సినిమాల్లో ఆమ‌ని న‌టించింది.

ఇక టాలీవుడ్‌లో కాస్టింగ్ కౌచ్ అనేది ఇటీవ‌ల కాలంలో ఎంత దుమారం రేపుతుందో చూస్తూనే ఉన్నాం. ఈ క్ర‌మంలోనే ఆమ‌న త‌న తాజా ఇంట‌ర్వ్యూలో సైతం కాస్టింగ్ కౌచ్ గురించి కొన్ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. తాము హీరోయిన్‌గా చేసిన‌ప్పుడు ఇప్పుడున్నంత కాస్టింగ్ కౌచ్ అనేది లేద‌ని.. అయితే ఆ రోజుల్లో కూడా ఎంతో కొంత ఇలాంటి జాడ్యం అయితే ఉంద‌ని చెప్పింది. త‌న కెరీర్‌లో కూడా ఇలాంటి అనుభ‌వాల‌ను తాను ఎదుర్కొన్నాన‌ని కూడా ఆమ‌ని చెప్పింది.

త‌న‌కు సినిమాల్లో న‌టించే ఆస‌క్తి ఉంద‌ని కొంద‌రు ద‌ర్శ‌కుల‌ను సంప్ర‌దించాన‌ని.. అయితే వారు ఓకే అన్నాక‌.. త‌న‌ను గెస్ట్ హౌస్‌కు ర‌మ్మ‌ని అనేవార‌ని.. మీ అమ్మ‌ను తీసుకు రాకుండా త‌న‌ను మాత్ర‌మే సింగిల్ రావాల‌ని కండీష‌న్ పెట్టేవార‌ని చెప్పింది. అయితే వాళ్ల ఉద్దేశం ఏంటో త‌న‌కు అర్థ‌మ‌య్యాక‌.. అలాంటి వాళ్ల‌ను తాను దూరం పెట్టేదానిని అని ఆమ‌ని చెప్పింది. అయితే ఆ డైరెక్ట‌ర్ పేరు బ‌య‌ట పెట్టేందుకు మాత్రం ఆమె నిరాక‌రించింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news