Moviesకోరిక‌లు మ‌గాళ్ల‌కే కాదు మాకూ ఉంటాయ్‌.. హీరోయిన్ ఎస్తేర్ బోల్డ్ కామెంట్స్‌

కోరిక‌లు మ‌గాళ్ల‌కే కాదు మాకూ ఉంటాయ్‌.. హీరోయిన్ ఎస్తేర్ బోల్డ్ కామెంట్స్‌

గత కొంత కాలంగా సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్లు చాలా బోల్డ్‌గా సమాధానాలు ఇస్తున్నారు.
ప్రస్తుతం అంతా యూట్యూబ్ యుగం నడుస్తోంది. యూట్యూబ్ ఛానల్స్‌ పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. సీనియర్ నటీనటులతో పాటు… అవకాశాలు లేకుండా ఖాళీగా ఉన్న వారితో ఇంటర్వ్యూలు చేస్తున్నారు. ఈ ఇంటర్వ్యూల ద్వారా ఏదో ఒక కాంట్రవర్సీ కామెంట్లతో చాలామంది వైరల్ అవుతున్నారు. కొందరు అయితే పదే పదే బోల్డ్‌ కామెంట్లు చేస్తూ వార్తల్లో ఉంటున్నారు. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనేది ఇటీవల కాలంలో బాగా పాపులర్ అవుతోంది.

కాస్టింగ్ కౌచ్ అన్న పదం వైరల్ కావడంతో పలువురు హీరోయిన్లతో పాటు నటీమణులు తాము ఏదో ఒక సందర్భంలో ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి ఓపెన్ అయిపోతున్నారు. పాపులర్ సింగర్ నోయల్ ను ప్రేమించి పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్న హీరోయిన్ ఎస్తేర్ ఇటీవల సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించడంతో పాటు పలు ఇంటర్వ్యూలలో చాలా బోల్డ్ గా మాట్లాడుతోంది. ఎస్తేర్‌ ఇటీవల చేసిన సినిమాలో ఒక కుర్రాడి తో రొమాన్స్ చేసే సన్నివేశాలు ఉన్నాయి. ఈ సన్నివేశాలను సోషల్ మీడియాలో చాలా మంది నెటిజన్లు బాగా ట్రోల్‌ చేశారు.

ఇలాంటి సీన్లలో నటించడం వల్ల సమాజానికి ఏదైనా ఉపయోగం ఉందా ? అని కూడా ప్రశ్నించారు. ఈ ట్రోలింగ్‌పై ఎస్తేర్ ఈ సినిమా ప్రమోషన్లలో ఘాటుగానే స్పందించింది. ఈ సినిమాలో నటించిన అబ్బాయి ని ఎవరు ? ప్రశ్నించలేదని.. అయితే తన‌ను మాత్రం బాగా ట్రోల్ చేస్తున్నారంటూ ఎస్తేర్ ఘాటుగా స్పందించింది. ఇక కోరికలు అనేవి అబ్బాయిలకు మాత్రమే కాదని.. అమ్మాయిలకు కూడా ఉంటాయన్న విషయం తెలుసుకోవాలని కూడా బోల్డ్ గా మాట్లాడేసింది.

ఎస్తేరు కామెంట్లకు నెటిజన్లు కూడా అంతే బోల్డ్‌గా స్పందిస్తున్నారు. అమ్మాయిలకు కోరికలు లేవని ఎవరు ? అన్నారు అని… మీరు కూడా కానివ్వండి మిమ్మల్ని ఎవరు ఆపుతున్నారు.. అని కామెంట్లు పెడుతున్నారు. ఇక నోయల్ ఫ్యామిలీకి దూరంగా ఉండాలని తాను కండిషన్ పెట్టడం వల్లే నోయల్ ఒప్పుకోలేదని… అందువల్లే తాము విడాకులు తీసుకున్నట్టు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని క్లారిటీ ఇచ్చింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news