Moviesఅమ్మ బాబోయ్..రాధిక పెద్ద చేపకే గాలం వేసిందే..?

అమ్మ బాబోయ్..రాధిక పెద్ద చేపకే గాలం వేసిందే..?

రాధిక..ఈ పేరు అంతక ముందు ఎంత పాపులర్ అయ్యిందో తెలియదు కానీ.. DJ టిల్లు సినిమా రిలీజ్ అయ్యాక మాత్రం అందరి నోట బాగా వినిపిస్తుంది. సిద్ధు జొన్నల‌గ‌డ్డ – నేహాశెట్టి జంట‌గా వ‌చ్చిన సినిమా డీజే టిల్లు. ఈ సినిమా తొలి ఆట‌కే సూప‌ర్ హిట్‌టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమా తొలి రోజుకే బ్రేక్ ఈవెన్‌కు వ‌చ్చేసి రెండో రోజు నుంచే లాభాల్లోకి వ‌చ్చేసింది. ఎటువంటి అంచనాలు లేకుండా సాదాసీదాగా రిలీజ్ అయ్యి..బాక్స్ ఆఫిస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

ఈ సినిమా తోనే సిద్ధకి మంచి పేరు వచ్చింది. ఇక ఈ సినిమా ద్వారా హీరో సిద్ధు ఇండస్ట్రీలో మరో విజయ్ దేవరకొండ గా పేరు తెచ్చుకున్నాడు. రాధిక రాధిక అంటూ ఆ స్లాంగ్ లో మాట్లాడుతూ..తెర పై మరో విజయ్ ని చూపించాడు అంటున్నారు అభిమానులు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన..నేహా శెట్టి గురించి అయితే చెప్పనవసరం లేదు. ఓ పక్క యాడ్ లు..మరో పక్క సినిమాలతో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. అయితే, రెమ్యూనరేషన్ కూడా భారీ స్దాయిలోనే డిమాండ్ చేస్తుందన్న టాక్ వినిపిస్తుంది. డీజే టిల్లు హీరోయిన్ నేహాశెట్టి ఒక్క హిట్ వ‌చ్చిందో లేదో వెంట‌నే రేటు పెంచేసింది అంటూ ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకొస్తున్నాయి.

అయితే రీసెంట్ గా ఈ భామ కు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్ గా మారింది. ఇప్పటి వరకు కుర్ర హీరోలతోనే సినిమాల ఆఫర్ అందుకుంటున్న ఈ బ్యూటీకి పాన్ ఇండియా హీరో ప్రభాస్ తో..సూపర్ స్టార్ మహేష్ బాబు తో సినిమా చేయాలని ఉందట. ఇదే విషయాని తన సన్నిహితుల వద్ద చెప్పుకొచ్చిందట. దీంతో ఈ విషయం మీడియాకు లీక్ అవ్వగా..అది కాస్త వైరల్ గా మారింది. నిన్న కాక మొన్న వచ్చి..ఒక్కటి అంటే ఒక్కటే హిట్ కొట్టి అప్పుడే స్టార్ హీరో ల సినిమాలో నటించడానికి ట్రై చేస్తుంది ..రాధిక మామూలుది కాదు అంటున్నారు నెటిజన్స్. మరి కొందరు అయితే పెద్ద చేపలకే గాలం వేస్తుంది ఈ భామ అంటు కామెంట్స్ చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news