Moviesమెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో ఆ రికార్డ్ ఎప్ప‌ట‌కి ' ఠాగూర్ '...

మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో ఆ రికార్డ్ ఎప్ప‌ట‌కి ‘ ఠాగూర్ ‘ సినిమాదే.. చెక్కు చెద‌ర్లేదుగా..!

మెగాస్టార్ చిరంజీవి సినిమా అంటేనే రికార్డులు సృష్టించడం కామన్. మీడియా మాధ్యమాలు సరిగా లేని టైం లోనే సౌత్ సినిమా ముఖ్యంగా తెలుగు సినిమా గురించి దేశం మొత్తం చెప్పుకునేలా చేసిన ఘనత మెగాస్టార్ చిరంజీవిది. ఆయన స్టైల్, డ్యాన్స్ గ్రేస్ ఎవరికి సాధ్యం కాదు. చిరంజీవి తీసిన 151 సినిమాల్లో ఎన్నో రికార్డులు.. మరెన్నో అవార్డులు.. అయితే సినిమాకు ఆయన కొత్త కొత్త రికార్డులను క్రియేట్ చేస్తూ వచ్చారు.

ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి కెరియర్ లో అప్పటివరకు ఉన్న సినిమాలు క్రియేట్ చేయలేని.. ఆయన కెరియర్ లోనే కాదు తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఏ సినిమా సృష్టించలేని రికార్డ్ ను తన పేరున రాసుకున్నారు. ఆ సినిమానే ఠాగూర్. తమిళ సినిమా విజ‌య్‌కాంత్‌ రమణకి అఫీషియల్ రీమేక్ గా వచ్చిన ఠాగూర్ సినిమా అప్పటివరకు ఉన్న టాలీవుడ్ రికార్డులన్నిటిని బద్ధలు కొట్టింది.

తమిళంలో మురుగదాస్ డైరెక్ట్ చేసిన రమణ సినిమాలో విజయ్ కాంత్ హీరోగా నటించారు. సినిమా అక్కడ రికార్డులను సృష్టించింది. వ్య‌వ‌స్థ‌లో లొసుగుల‌పై ఓ యువ‌కుడు సీక్రెట్‌గా చేసిన ఆప‌రేష‌న్ ప్ర‌భుత్వాన్ని ఎలా క‌దిలించింది అన్న క‌థాంశంతో ఈ సినిమా వ‌చ్చింది. అప్ప‌ట్లో ఈ సినిమా కోలీవుడ్‌ను ఊపేసింది.

రమణ సినిమాను యాంగ్రీ యంగ్ మెన్ రాజశేఖర్ తెలుగులో రీమేక్ చేయాలని అనుకున్నారు. కానీ మెగాస్టార్ ఇంట్రెస్ట్ చూపించడంతో ఆయన ఆ ప్రాజెక్ట్ ని వదిలేశారు. ఠాగూర్ సినిమాను వి.వి.వినాయక్ డైరెక్ట్ చేశారు. లియో ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ ప‌తాకంపై బి. మ‌ధు ఈ సినిమాను నిర్మించ‌గా.. గుమ్మ‌ళ్ల గ‌ణేష్ స‌హ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించారు.

2003 సెప్టెంబర్ 24న ఠాగూర్ సినిమా రిలీజైంది. బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ సినిమా 223 సెంటర్స్ లో 50 రోజులు.. 192 కేంద్రాల్లో 100 డేస్ ఆడింది. అప్ప‌టివ‌ర‌కు ఉన్న తెలుగు సినిమా రికార్డుల‌ను ఠాగూర్ తిర‌గ‌రాసింది. 192 సెంటర్స్ లో 100 రోజులు చిరంజీవి కెరియర్ లోనే కాదు టాలీవుడ్ హిస్టరీలో కూడా తిరుగులేని రికార్డ్ అది. 223 రోజులు, 100 రోజుల ప‌రంగా ఇదే ఇప్ప‌ట‌కీ చెక్కు చెద‌ర‌ని రికార్డుగా నిలిచింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news