Movies14 ఏళ్ల‌కే మ‌ల్టీస్టార‌ర్ చేసి బ్లాక్‌బ‌స్ట‌ర్ కొట్టిన బాల‌య్య‌.. ఇంట్ర‌స్టింగ్ స్టోరీ..!

14 ఏళ్ల‌కే మ‌ల్టీస్టార‌ర్ చేసి బ్లాక్‌బ‌స్ట‌ర్ కొట్టిన బాల‌య్య‌.. ఇంట్ర‌స్టింగ్ స్టోరీ..!

దివంగత విశ్వవిఖ్యాత నటుడు నందమూరి తారక రామారావు నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చాడు బాలకృష్ణ. తండ్రి నుంచి నట వారసత్వాన్ని అందిపుచ్చుకున్న‌ బాలకృష్ణ చిన్న వయసులోనే వెండితెరపై ఎంట్రీ ఇచ్చి సక్సెస్ సాధించారు. ఈ క్రమంలోనే తన తండ్రితో కలిసి కేవలం 14 సంవత్సరాల వయసులోనే మల్టీస్టారర్ సినిమాలో నటించి సూపర్ హిట్ కొట్టిన ఘనత కూడా బాలకృష్ణకే దక్కుతుంది. అసలు కథలోకి వెళితే చంద్రముఖి లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమాలు తీసిన డైరెక్టర్ పి. వాసు తండ్రి పీతాంబరం.

ఎన్టీఆర్‌కు పాతాళభైరవి సినిమా రోజుల నుంచి కూడా పీతాంబరం పర్సనల్ మేక‌ప్‌మేన్‌గా ఉండేవారు. ఇక ఎంజీఆర్‌కు అయితే తొలి రోజుల నుంచి చివరి వరకు కూడా పీతాంబరం మేకప్ మెన్. ఎన్టీఆర్ పౌరాణిక పాత్రల్లో తిరుగులేని విజయాలు సాధించడంలో పితాంబ‌రం పాత్ర కూడా ఉందని ఆయ‌నే స్వయంగా చెప్పేవారు. పీతాంబరం ఒక తెలుగు సినిమా చేసి ఆర్థికంగా చాలా నష్టపోయారు. దీంతో ఆయన ఇల్లు అమ్ముకునే పరిస్థితి వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న ఎన్టీఆర్, ఎంజీఆర్‌ వెంటనే మీకు డేట్స్‌ ఇస్తాం… ఏదైనా సినిమా చేసుకోండి అని బంపర్ ఆఫర్ ఇచ్చారు.

వెంట‌నే పీతాంబ‌రం యాదోం కీ బారాత్ (1973) అనే హిందీ సినిమా తెలుగు, తమిళ రీమేక్ హక్కులు కొని ఎన్టీఆర్‌, ఎంజీఆర్‌తో సినిమాలు స్టార్ట్ చేశాడు. వెంట‌నే డిస్ట్రిబ్యూట‌ర్లు వ‌చ్చి అడ్వాన్సులు ఇవ్వ‌డంతో ఆయ‌న ఇళ్లు నిల‌బ‌డింది. ఈ సినిమా క‌థ ఇంట్ర‌స్టింగ్‌గా ఉంటుంది. ముగ్గురు అన్న‌ద‌మ్ములు చిన్న‌ప్పుడే విడిపోతారు. పెద్దోడు దొంగ‌, మ‌ధ్య‌లో వాడు ల‌వ‌ర్ బాయ్‌, మూడో వాడు సింగ‌ర్‌. చివ‌ర్లో అంద‌రు క‌లుసుకుని విల‌న్‌పై ప్ర‌తీకారం తీర్చుకుంటారు.

దీనికి తెలుగు వెర్ష‌న్ అన్న‌ద‌మ్ముల అనుబంధం (1975) తీయాల‌నుకున్న‌ప్పుడు పెద్దోళ్ల ఇద్ద‌రి పాత్ర‌ల్లో ఎన్టీఆర్‌, ముర‌ళీ మోహ‌న్‌ను అనుకున్నారు. మూడో వాడిపాత్ర‌కు ముందుగా చంద్ర‌మోహ‌న్‌ను అనుకున్నారు. అయితే చివ‌ర్లో ఎన్టీఆర్ ప‌ట్టుబ‌ట్ట‌డంతో చివ‌ర‌కు బాల‌య్య‌ను తీసుకున్నారు. అప్ప‌ట‌కీ బాల‌య్య వ‌య‌స్సు 14 ఏళ్లు మాత్ర‌మే. అప్ప‌టికే బాల‌య్య తాత‌మ్మ క‌ల‌, రామ్ ర‌హీమ్ సినిమాలు చేశారు.

ముందు సినిమాకు ఎన్టీఆరే ద‌ర్శ‌కుడు. రెండో సినిమాలో హ‌రికృష్ణ‌, బాల‌కృష్ణ కలిసి న‌టించారు. ఈ రెండు సినిమాలు 1974లో వ‌చ్చిన‌వే. అప్ప‌ట‌కి బాల‌య్య‌కు కేవ‌లం రెండు సినిమాల అనుభ‌వం మాత్ర‌మే ఉంది. అయితే ముందుగా చంద్ర‌మోహ‌న్‌ను తీసుకుని.. ఆయ‌న సెట్స్‌కు వ‌చ్చాక ఆయ‌న స్థానంలో బాల‌య్య‌ను తీసుకున్నారు. చంద్ర‌మోహ‌న్ కాస్త అలిగినా.. ఎన్టీఆర్ మాత్రం త‌న సొంత సినిమాల్లో అవ‌కాశాలు ఇస్తాన‌ని ఆయ‌న్ను బుజ్జ‌గించార‌ట‌.

అన్న‌ద‌మ్ముల అనుబంధం సినిమాలో ఎన్టీఆర్, ముర‌ళీమోహ‌న్‌తో పోలిస్తే బాల‌య్య చాలా ప‌సివాడుగానే క‌నిపించాడు. అయితే ఆ సినిమాలో బాల‌య్య యాక్టింగ్‌తో పాటు ఎన్టీఆర్ ఛ‌రిష్మా, క‌థాబ‌లంతో అవ‌న్నీ మ‌రుగున ప‌డి సినిమా సూప‌ర్ హిట్ అయిపోయింది. అలా బాల‌య్య 14 ఏళ్ల‌కే మల్టీస్టార‌ర్‌తో బ్లాక్‌బ‌స్ట‌ర్ కొట్టేశాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news