Moviesబ‌న్నీ భార్య ' స్నేహారెడ్డి ' వేసుకున్న ఈ కోటు రేటు...

బ‌న్నీ భార్య ‘ స్నేహారెడ్డి ‘ వేసుకున్న ఈ కోటు రేటు అంతా… వామ్మో…!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ టాలీవుడ్‌లో దాదాపు ఇప్పుడున్న కుర్ర హీరోల్లో నెంబ‌ర్ వ‌న్ హీరో అయిపోయాడు. పుష్ప సినిమాకు ముందు వ‌ర‌కు చాలా డౌట్లు ఉండేవి. అయితే పుష్ప బాలీవుడ్‌లో ఎలాంటి అంచ‌నాలు లేకుండానే ఏకంగా రు. 100 కోట్లు కొల్ల‌గొట్టింది. బ‌న్నీకి ఇటు టాలీవుడ్‌తో పాటు శాండ‌ల్‌వుడ్‌, అటు మ‌ల్లూవుడ్‌లోనూ మొన్న‌టి వ‌ర‌కు క్రేజ్ ఉండేది. ఇప్పుడు పుష్ప బాలీవుడ్‌లో సాధించిన అప్ర‌తిహ‌త విజ‌యంతో ఎవ్వ‌రూ మాట్లాడే ప‌రిస్థితి. మ‌హామ‌హా హీరోలే ఏళ్ల‌కు త‌ర‌బ‌డి షూటింగ్‌లు చేసి.. పెద్ద బ‌డ్జెట్‌ల‌తో సినిమాలు చేస్తేనే బాలీవుడ్‌లో స‌క్సెస్ కాని ప‌రిస్థితి.

బ‌న్నీ స్టైల్‌, డ్యాన్సులు, డైలాగ్ డెలివ‌రీకి ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా ఉన్న యువ‌త అంతా పిచ్చిగా ఫాలో అవుతున్నారు. ఇటు సోష‌ల్ మీడియాలో లెక్క‌ల్లో చూసుకున్నా బ‌న్నీ మిగిలిన హీరోల‌తో పోలిస్తే చాలా ముందే ఉన్నాడు. అల వైకుంఠ‌పురంలో సినిమాతోనే బ‌న్నీకి ఇక్క‌డ తిరుగులేద‌ని తేలిపోయింది. పుష్ప బ‌న్నీ ఇమేజ్‌ను మ‌రింత శిఖ‌రాగ్రంలో నిల‌బెట్టేసింది.

ఇక బ‌న్నీ సినిమాల‌కు ఎంత ప్ర‌యార్టీ ఇస్తాడో ? అటు త‌న ఫ్యామిలీకి కూడా అంతే టైం ఇస్తాడు. త‌న పిల్ల‌ల‌తో ఎప్ప‌టిక‌ప్పుడు ఎంజాయ్ చేసే ఫొటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేస్తూనే ఉంటాడు. ఇక బ‌న్నీ భార్య స్నేహారెడ్డికి సైతం సోష‌ల్ మీడియాలో విప‌రీత‌మైన ఫాలోయింగ్ ఉంది. ఆమె సోష‌ల్ మీడియాలో షేర్ చేసే ఫొటోల‌కు విప‌రీత‌మైన లైకులు, కామెంట్లు వస్తూ ఉంటాయి.

ఇప్పుడున్న టాప్ హీరోల భార్య‌ల్లో సోష‌ల్ మీడియాలో ఈ రేంజ్‌లో ఫాలోయింగ్ ఉన్న భార్య స్నేహారెడ్డి మాత్ర‌మే. బ‌న్నీ సినిమాల మేకోవ‌ర్‌లోనూ, బ‌న్నీ స్టైల్‌ను సినిమాకు అనుగుణంగా మార్చ‌డంలోనూ తెర‌వెన‌క స్నేహారెడ్డి క‌ష్టం, స‌ల‌హాలు చాలానే ఉంటాయ‌ట‌. తాజాగా స్నేహారెడ్డి ఓ కోటు ధ‌రించిన ఫొటో సోష‌ల్ మీడియాలో పిచ్చ‌గా వైర‌ల్ అవుతోంది.

ఈ కోటు ఖ‌రీదు రు. 5 ల‌క్ష‌ల కంటే ఎక్కువే అని తెలుస్తోంది. ఈ కోటులో స్నేహారెడ్డి మ‌రింత అందంగా క‌నిపిస్తున్నార‌ని నెటిజ‌న్లు సోష‌ల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. స్నేహారెడ్డి త‌న భ‌ర్త‌, పిల్ల‌ల‌తో క‌లిసి త‌ర‌చూ విదేశీ వెకేష‌న్ల‌కు కూడా ప్లాన్ చేస్తూ ఉంటారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news