Moviesమ‌గ‌ధీర రిలీజ్‌కు ముందు రోజు రాత్రి మెగాస్టార్ ఇంట్లో ఏం జ‌రిగింది...!

మ‌గ‌ధీర రిలీజ్‌కు ముందు రోజు రాత్రి మెగాస్టార్ ఇంట్లో ఏం జ‌రిగింది…!

ప్ర‌స్తుతం భార‌త‌దేశ సినిమా అంతా ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన త్రిబుల్ ఆర్ చుట్టూనే తిరుగుతోంది. రాజ‌మౌళి పేరు ఎక్క‌డ చూసినా మార్మోగిపోతోంది. రాజ‌మౌళికి ఇంత గొప్ప పేరు ఒక‌టి రెండేళ్ల‌లోనో లేదా ఒక‌టి రెండు సినిమాల‌కో రాలేదు. 20 ఏళ్ల గొప్ప క‌ష్టం దీని వెన‌క దాగి ఉంది. సింహాద్రి సినిమాతో తానేంటో రాజ‌మౌళి ఫ్రూవ్ చేసుకున్నాడు. మ‌గ‌ధీర విజ‌యం రాజ‌మౌళిని శిఖ‌రాగ్రానికి తీసుకువెళ్లింది. ఇక బాహుబ‌లి విజ‌యాలు దేశ శిఖ‌రాగ్రాన కూర్చోపెట్టేశాయి.

 

త్రిబుల్ ఆర్ రిలీజ్ వేళ రాజ‌మౌళి గ‌త సినిమాల‌కు సంబంధించిన ఇంట్ర‌స్టింగ్ విష‌యాలు ఇప్పుడు బాగా వైర‌ల్ అవుతున్నాయి. మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ హీరోగా రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన సినిమా మ‌గ‌ధీర‌. 2010లో వ‌చ్చిన ఈ సినిమా రామ్‌చ‌ర‌ణ్‌కు ఒక్క‌సారిగా తిరుగులేని ఇమేజ్ తీసుకు రావ‌డంతో పాటు మ‌నోడిని ఓవ‌ర్ నైట్ స్టార్ హీరోను చేసేసింది. అస‌లు ఈ సినిమా దెబ్బ‌తో చ‌ర‌ణ్ వెన‌క్కు తిరిగి చూసుకోవాల్సిన అవ‌స‌రం కూడా రాలేదు.

ఇప్పుడు ఇంత స్టార్ హీరోగా కొన‌సాగుతున్నాడు అంటే అందుకు కార‌ణం మ‌గ‌ధీరతో రాజ‌మౌళి వేసిన బ‌ల‌మైన పునాదే. ఇక మ‌గ‌ధర చ‌ర‌ణ్‌కు రెండో సినిమా. అంత‌కు ముందు పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో చిరుత సినిమా చేశాడు. ఆ సినిమా 43 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. ఆ త‌ర్వాత మ‌గ‌ధీర కోసం ఓవ‌రాల్‌గా నాలుగేళ్ల పాటు వెయిట్ చేయాల్సి వ‌చ్చింది. ఈ సినిమాను రాజ‌మౌళి ఏకంగా రెండేళ్ల పాటు శిల్పం చెక్కిన‌ట్టు చెక్కేశాడు.

ఇక ఈ సినిమా రిలీజ్‌కు ముందు రోజు మెగాస్టార్ ఇంట్లో ఏం జ‌రిగిందో చిరుయే స్వ‌యంగా ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పారు. ముందు రోజు రాత్రి సినిమా వాళ్ల‌కు.. ఆ సినిమా యూనిట్‌కు రెండు చోట్ల ప్రివ్యూలు వేశార‌ట‌. ముందుగా చిరు – ఆయ‌న స‌తీమ‌ణి సురేఖ ఓ థియేట‌ర్లో ప్రివ్యూ షోకు వెళ్లార‌ట‌. అయితే ఈ సినిమా క‌థేంటి అన్న‌ది చిరుకు ముందుగానే తెలుసు. అయితే విజువ‌ల్‌గా ఎలా ఉంటుందో ? అన్న చిన్న సందేహం అయితే ఉంద‌ట‌. సినిమా చూస్తున్నంత సేపు కూడా ఆ విజువ‌ల్స్ త‌న ఊహ‌కే అంద‌ని విధంగా ఉన్నాయ‌ని.. సినిమా ఆద్యంతం ఉత్కంఠ‌గా సాగింద‌ని చెప్పారు.

సినిమా మొత్తం పూర్త‌య్యాక చూస్తే చ‌ర‌ణ్ అక్క‌డ లేడ‌ట‌. మ‌రో థియేట‌ర్లో ప్రివ్యూ న‌డుస్తుండ‌డంతో అక్క‌డ‌కు వెళ్లాల్సి వ‌చ్చింద‌ట‌. సినిమా చూసి ఒకింత ఆనందం.. ఒకింత భావోద్వేగం.. ఒకింత సంతోషంతో త‌న త‌న‌యుడిని వాటేసుకోవాల‌న్న సురేఖ కోరిక తీర‌క‌పోవ‌డంతో ఆమె అసంతృప్తికి లోన‌య్యార‌ని చిరు చెప్పారు. ఇంత చిన్న వ‌య‌స్సులో ఇంత పెద్ద క్యారెక్ట‌ర్ వేయ‌డం ఏంటి ? ఇంత పెద్ద రిస్క్‌లు ఏంట‌ని త‌న‌కు, సురేఖ‌కు ఇద్ద‌రికి చాలా భ‌యం వేయ‌డంతో పాటు ఒకింత ఆనందం కూడా క‌లిగింద‌ని చిరు అన్నారు.

ఇంటికి వ‌చ్చిన వెంట‌నే మ‌ళ్లీ రెండో షోకు…
ఇక ఫ‌స్ట్ షో ముగించుకుని ఇంటికి వ‌చ్చాక రాత్రి 9.40 – 10.15 గంట‌లు అయ్యింది. అయితే అర‌గంట పాటు ఆ సినిమా గురించే చ‌ర్చించిన సురేఖ ఏమండి మ‌ళ్లీ సినిమాకు వెళ‌దాం అని రిక్వెస్ట్ చేయ‌డంతో చిరు షాక్ అయ్యార‌ట‌. ఇన్నేళ్ల నా జీవితంలో క‌నీసం నా సినిమాను కూడా ఎప్పుడూ రెండోసారి చూడాల‌ని అడ‌గ‌లేదు.. అంతేలే నీకు ఎంతైనా నా కంటే నీ కొడుకే ముద్దు అని చెప్పిన చిరు మ‌ళ్లీ మ‌రో థియేట‌ర్లో ప్రివ్యూ జ‌రుగుతుండ‌గా సురేఖ‌ను ఆ షోకు తీసుకు వెళ్లార‌ట‌. ఇక ఇంట‌ర్వెల్ టైం నుంచి ఆ షో కూడా చూసి.. అక్క‌డే ఉన్న చిర‌ణ్‌ను సురేఖ ముద్దాడి ఎంతో ఆనంద ప‌డ్డార‌ట‌. ఇక షో చూసి ఇంటికి వ‌చ్చేస‌రికి 1 గంట అయ్యింద‌ని.. ఆ రోజంతా సురేఖ కూడా చాలా సేపు ఆ సినిమా గురించే చ‌ర్చిస్తూ ఉంద‌ని.. ఆ రోజంతా త‌మ‌కు నిద్ర ప‌ట్ట‌లేద‌ని చిరు చెప్పారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news