Moviesబాల‌య్య‌కు ఆ అక్ష‌రం ఇంత సెంటిమెంటా... అన్నీ సూప‌ర్ హిట్లే..!

బాల‌య్య‌కు ఆ అక్ష‌రం ఇంత సెంటిమెంటా… అన్నీ సూప‌ర్ హిట్లే..!

నందమూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ హీరోగా న‌టిస్తోన్న 107వ సినిమా షూటింగ్ ద‌శ‌లో ఉంది. మ‌లినేని గోపీచంద్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ఈ సినిమాలో శృతీహాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. కోలీవుడ్ హీరోయిన్ వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కూడా కీల‌క పాత్ర‌లో క‌నిపిస్తోంది. అఖండ త‌ర్వాత బాల‌య్య న‌టిస్తోన్న సినిమా ఇదే. ఈ సినిమా త‌ర్వాత బాల‌య్య – అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌బోతున్నాడు. దీనిపై ద‌ర్శ‌కుడు అనిల్ సైతం క్లారిటీ ఇచ్చాడు.

ఇక బాల‌య్య ఎప్పుడూ కూడా సెంటిమెంట్ల‌ను ఫాలో అవుతూ ఉంటాడు. ఆయ‌న సినిమా షూటింగ్ ప్రారంభం కావాల‌న్నా.. సినిమా రిలీజ్ కావాల‌న్నా కూడా ముహూర్తం పెడ‌తారు. రిలీజ్ రోజు కూడా షో ఎన్ని గంట‌ల‌కు రిలీజ్ కావాలో కూడా ముహూర్తం పెట్టించి మ‌రీ అదే టైంకు షో ప‌డేలా ఆదేశాలు జారీ చేస్తాడు. ఇక బాల‌య్య కెరీర్‌లో మ అక్ష‌రం బాగా క‌లిసి వ‌చ్చింది.

మ అక్ష‌రంతో మొద‌లై టైటిల్‌గా పెట్టిన సినిమాలు ఆయ‌న‌కు బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్లు ఇచ్చాయి. బాల‌య్య సినిమాలో సింహం అన్న టైటిల్ ఉంటే ఆ సినిమాలు అన్నీ సూప‌ర్ హిట్ అయ్యాయి. స‌మ‌ర‌సింహా రెడ్డి – సీమ‌సింహం – జై సింహా – న‌ర‌సింహా నాయుడు – సింహా ఇలా చాలా సినిమాలు సింహం టైటిల్ క‌లిస్తే సూప‌ర్ హిట్టే..! అలాగే మ అక్ష‌రంతో స్టార్ట్ అయిన సినిమాలు కూడా సూప‌ర్ హిట్టే అయ్యాయి.

మంగ‌మ్మ‌గారి మ‌న‌వ‌డు – ముద్దుల మావ‌య్య – ముద్దుల మేన‌ల్లుడు – ముద్దుల క్రిష్ణ‌య్య – మువ్వ‌గోపాలుడు సినిమాలు బాల‌య్య కెరీర్‌లో బెస్ట్ మూవీస్‌గా నిలిచిపోయాయి. అలాగే బాల‌య్య – మ‌లినేని గోపీచంద్ సినిమాకు కూడా ప‌లు ర‌కాల టైటిల్స్ ప‌రిశీల‌న‌లో ఉన్నాయి. ఈ సినిమాలో బాల‌య్య క్యారెక్ట‌ర్ పేరు రెడ్డితో వ‌స్తోంది. అందుకే రెడ్డి అన్న ప‌దం క‌లిసి వ‌చ్చేలా టైటిల్ ఉంటుందా ? లేదా మ పేరుతో మోనార్క్ టైటిల్ కూడా ప‌రిశీలిస్తున్నార‌ట‌.. ఆ టైటిల్ పెడ‌తారా ? అన్న‌ది చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news