Moviesరాజ‌మౌళి కొడుకు కార్తీకేయ - కోడ‌లు పూజా ఇంట్ర‌స్టింగ్ ల‌వ్‌స్టోరీ.....

రాజ‌మౌళి కొడుకు కార్తీకేయ – కోడ‌లు పూజా ఇంట్ర‌స్టింగ్ ల‌వ్‌స్టోరీ.. !

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి సినిమా తీస్తున్నాడు అంటే చాలు ఆయ‌న ఫ్యామిలీ మొత్తం ఆ సినిమాలో ఇన్వాల్ అయిపోయి ఉంటుంది. ఆ సినిమా యేడాది తీసినా.. రెండేళ్లు తీసినా రాజ‌మౌళి ఫ్యామిలీ అంతా ఏదో ఒక పాత్ర పోషించాల్సిందే. రాజ‌మౌళి ఎలాగూ ద‌ర్శ‌కుడు. తండ్రి విజ‌యేంద్ర ప్ర‌సాద్ స్టోరీ రైట‌ర్‌గా ఉంటారు. ఇక భార్య ర‌మా కాస్ట్యూమ్ డిజైన‌ర్‌. అన్న కీర‌వాణి మ్యూజిక్‌.. కీర‌వాణి భార్య వ‌ల్లి లైన్ ప్రొడ్యుస‌ర్‌. రాజ‌మౌళి కొడుకు కార్తీకేయ క్రియేటివ్ డిపార్ట్‌మెంట్‌తో పాటు డిజిట‌ల్ ప‌బ్లిసిటీ ఇదంతా చూస్తుంటాడు. ఇక రాజ‌మౌళి కుమార్తె మ‌యూఖ కూడా సినిమాల‌కు ఏదో ఒక ప‌ని చేస్తూనే ఉంటారు.

ఇక రాజ‌మౌళి ఫ్యామిలీ విష‌యానికి వ‌స్తే ఆయ‌న స్టూడెంట్ నెంబ‌ర్ వ‌న్ సినిమా టైంలోనే ర‌మాను ప్రేమించి పెళ్లాడారు. ఆమె కీర‌వాణి భార్య వ‌ల్లికి స్వ‌యానా అక్క‌. అయితే అప్ప‌టికే ఆమెకు మ‌రో వ్యక్తితో పెళ్ల‌య్యి కార్తీకేయ పుట్టాడు. అయితే మ‌న‌స్ప‌ర్థ‌ల‌తో అత‌డికి విడాకులు ఇచ్చేసింది. ఆ టైంలో కీర‌వాణి ఇంట్లో త‌న చెల్లి వ‌ల్లితో క‌లిసి ఉండ‌డం.. ఆ టైంలో రాజ‌మౌళితో ప్రేమ చిగురించ‌డం జ‌రిగాయి.

చాలా సింపుల్‌గా కుటుంబ స‌భ్యుల స‌మ‌క్షంలోనే వీరి పెళ్లి జ‌రిగింది. పెళ్ల‌య్యాక రాజ‌మౌళి దంప‌తులు మ‌యూఖ‌ను ద‌త్త‌త తీసుకున్నారు. ఓ ఇంట‌ర్వ్యూలో ర‌మా మాట్లాడుతూ మ‌యూఖ చాలా సెన్సిటివ్ అని.. భ‌విష్య‌త్తులో ఎంత స్ట్రాంగ్ అవుతుందో చూడాల‌ని చెప్పింది. ఇక కార్తీకేయ హీరో జ‌గ‌ప‌తిబాబు సోద‌రుడి కుమార్తె పూజ‌ను ప్రేమ వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. అంటే వ‌రుస‌కు రాజ‌మౌళి – జ‌గ‌ప‌తిబాబు వియ్యంకులు అవుతారు.

కార్తీకేయ – పూజ‌ది ఇంట్ర‌స్టింగ్ ల‌వ్‌స్టోరీ.. అస‌లు వృతిప‌రంగా కూడా వీరికి సంబంధం లేదు. కార్తీకేయ మార్కెటింగ్ క్రియేటివ్ హెడ్‌. డిజిట‌ల్ మార్కెటింగ్ ప‌రంగాను.. క్రియేటివ్ హెడ్‌గాను బిజీగా ఉండేవాడు. ఇక పూజ సింగ‌ర్‌.. మంచి గాత్రం ఆమెది. వీరిద్ద‌రు 2012లో ఓ కామ‌న్ ఫ్రెండ్ ఇంట్లో జ‌రిగిన ఫంక్ష‌న్లో ప‌రిచ‌యం అయ్యారు. ఆ త‌ర్వాత ఫోన్ నెంబ‌ర్లు ఇచ్చి పుచ్చుకున్నారు. అలా 2021 వ‌ర‌కు ప్రేమించ‌కున్నారు. చివ‌ర‌కు పెద్ద‌లు కూడా ఒప్పుకోవ‌డంతో రాజ‌స్థాన్‌లోని ఉద‌య్‌పూర్ ఫ్యాలెస్‌లో అంగ‌రంగ వైభ‌వంగా వీరి పెళ్లి జ‌రిగింది.

ఇక వీరి ప్రేమ పెళ్లిలో ముందు కార్తీకేయే ప్ర‌పోజ్ చేశాడు. ఆ త‌ర్వాత రెండు, మూడు నెల‌లు ఆలోచించుకున్నాక పూజ ఓకే చెప్పింది. అస‌లు వీరిద్ద‌రివి ఉత్త‌ర‌, ద‌క్షిణ ధృవాల్లాంటి మ‌న‌స్త‌త్వాలు అట‌. కార్తీకేయ ఏదైనా డెసిష‌న్ తీసుకునేందుకు వ‌న్ సెక‌న్ ఆలోచిస్తే.. పూజ వ‌న్ ఇయ‌ర్ టైం తీసుకుంటుంద‌ట‌. పూజ సినిమా నేప‌థ్యం ఉన్న కుటుంబం నుంచే వ‌చ్చినా.. సినిమా వాళ్ల‌ను మాత్రం పెళ్లి చేసుకోకూడ‌దు అనుకుంద‌ట‌. అయితే చివ‌ర‌కు ఆ నేప‌థ్యం ఉన్న టాలీవుడ్ ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి కొడుకునే ప‌డేసింది. ఆ మాట అన‌డం కంటే ఆమెకే కార్తీకేయ ప‌డిపోయాడు.

ఇక కార్తీకేయ గురించి ఓ ఇంట‌ర్వ్యూలో పూజ మాట్లాడుతూ ఇంట్లో చాలా కూల్ బాయ్ అని కాంప్లిమెంట్ ఇచ్చింది. అప్పుడు కార్తీకేయ కెమేరా ముందు మాత్ర‌మే ఈ కాంప్లిమెంట్లు అని.. ఇంట్లో అవేవి ఉండ‌వ‌ని స‌ర‌దాగా ఆమెను ఆట‌ప‌ట్టించాడు. ఇక తాము ఇద్ద‌రం సాంప్ర‌దాయంగా ఉంటామ‌ని కార్తీకేయ చెప్పాడు. ఇటు త‌న అమ్మ‌తో పాటు అటు అత్త వాళ్లు చెప్పిన విష‌యాలు కూడా ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటామ‌ని చెప్పాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news