Moviesహైద‌రాబాద్‌లో RRR అరాచ‌కం.. చివ‌ర‌కు మ‌హేష్‌బాబుకు కూడా ఇంత టెన్ష‌నా..!

హైద‌రాబాద్‌లో RRR అరాచ‌కం.. చివ‌ర‌కు మ‌హేష్‌బాబుకు కూడా ఇంత టెన్ష‌నా..!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో రాజ‌మౌళి తెర‌కెక్కించిన
సినిమా త్రిబుల్ ఆర్‌. ఇప్పుడు తెలుగు గ‌డ్డ మీద ఎక్క‌డ చూసినా ఈ సినిమా హంగామాయే క‌నిపిస్తోంది. మ‌రోవైపు త్రిబుల్ ఆర్ ప్ర‌మోష‌న్లు ఫుల్ స్వింగ్‌లో న‌డుస్తున్నాయి. రాజ‌మౌళి – ఎన్టీఆర్ – రామ్‌చ‌ర‌ణ్ ముగ్గురు క‌లిసి భారీ ఎత్తున ప్ర‌మోష‌న్లు చేస్తున్నారు. ఇప్ప‌టికే దుబాయ్‌, నార్త్ ఇండియా. క‌ర్నాక‌ట‌, చెన్నై ప్ర‌మోష‌న్లు కంప్లీట్ చేసిన ఈ ముగ్గురు త్ర‌యం ఇప్పుడు తెలుగు ప్ర‌మోష‌న్ల‌ను హోరెత్తించేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఈ సినిమాకు సంబంధించి ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డిస్తున్నారు.

ఎవ‌రికి వాళ్లు.. ఇంకా చెప్పాలంటే సామాన్యుల నుంచి సెల‌బ్రిటీల వ‌ర‌కు ఎవ‌రు చూసినా కూడా త్రిబుల్ ఆర్ సినిమాను ఫ‌స్ట్ డే అది కూడా ఫ‌స్ట్ షో.. ఇంకా చెప్పాలంటే ప్రీమియ‌ర్ షో మాత్ర‌మే చూసేయాల‌ని ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు. టిక్కెట్ కోసం ఎంత రేటు అయినా పెడుతున్నారు. మ‌రోవైపు ఎప్పుడు ఫ‌స్ట్ షో ప‌డుతుందా ? అని అంద‌రిలోనూ ఒక్క‌టే ఉత్కంఠ‌. ఇదిలా ఉంటే ఈ సినిమాను ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో చూసేందుకు సెల‌బ్రిటీలు సైతం ఎంతో ఉత్సుక‌త‌తో ఉన్నారు.

ప్ర‌పంచ వ్యాప్తంగా త్రిబుల్ ఆర్ సినిమాను ప‌ది వేల‌కు పైగా స్క్రీన్ల‌లో రిలీజ్ చేస్తున్నారు. ఇక హైద‌రాబాద్‌లో త్రిబుల్ ఆర్ హంగామా చూస్తుంటే అరాచ‌కం క‌నిపిస్తోంది. ఎక్క‌డ చూసినా ఈ సినిమా హంగామానే క‌నిపిస్తోంది. ఓవ‌రాల్‌గా సిటీలో అన్ని థియేట‌ర్ల‌లోనూ ఈ సినిమాను ప్ర‌ద‌ర్శిస్తున్నారు. ది క‌శ్మీర్ ఫైల్స్ మాత్రం 5 థియేట‌ర్ల‌లో న‌డుస్తోంది. ఒక్క చోట మాత్ర‌మే రాధేశ్యామ్ వేస్తున్నారు. ఇక సిటీలో ఉన్న అన్ని సింగిల్ థియేట‌ర్లు, మ‌ల్టీఫ్లెక్స్‌ల్లో త్రిబుల్ ఆర్ సినిమానే వేస్తున్నారు.

దీనిని బ‌ట్టే త్రిబుల్ ఆర్ హంగామా ఏ రేంజ్లో ఉందో అర్థ‌మ‌వుతోంది. ఇక సెల‌బ్రిటీలు స‌న్నిహితులు, బంధువులు, కుటుంబ సభ్యుల కోసం ఇప్ప‌టికే టిక్కెట్లు బుక్ చేసేశారు. ఎన్టీఆర్ త‌న కుటుంబ స‌భ్యులు, బంధువుల కోసం ఓ ప్ర‌ముఖ మ‌ల్టీఫ్లెక్స్‌లో 11 గంట‌ల షో కోసం ఓ స్క్రీన్ అంతా బుక్ చేసేశారు. 52 మంది ప్ర‌ముఖుల‌కు ఈ షో కోసం ఆహ్వానం అందిందంటున్నారు.

ఇదిలా ఉంటే మ‌హేష్‌బాబు ఏఎంబీ సినిమా హాల్లో ఈ రోజు రాత్రి 9 గంట‌ల‌కే ప్రీమియ‌ర్ షో ప‌డ‌బోతోంద‌ట‌. ఏఎంబీ మాల్లో ప్ర‌ద‌ర్శించే ఈ షోకు మ‌హేష్‌బాబు కూడా వ‌స్తున్న‌ట్టు టాక్ ? ఏఎంబీలో ఓ చిన్న స్క్రీన్ ఉంది. ఈ స్క్రీన్లో కొద్ది మంది ప్ర‌ముఖుల‌తో క‌ల‌సి మ‌హేష్‌బాబు సినిమా చూడ‌బోతున్నాడ‌ట‌.
ఏదేమైనా త్రిబుల్ ఆర్ మ‌హేష్‌బాబును కూడా ఊపేస్తోంద‌నే చెప్పాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news