Moviesప్రభాస్ పక్కన ఆ కుర్ర బ్యూటీ..అన్న చెల్లెలు లా.. వద్దు బాబోయ్...

ప్రభాస్ పక్కన ఆ కుర్ర బ్యూటీ..అన్న చెల్లెలు లా.. వద్దు బాబోయ్ వద్దు..?

పాపం..తాను ఒకటి తలిస్తే దైవం మరోకటి తలచిన్నట్లు. ఎన్నో అంచనాల మధ్య రిలీజైన “రాధేశ్యామ్” సినిమా బాక్స్ ఆఫిస్ వద్ద దారుణంగా పడిపోయింది. సినిమాకి నెగిటివ్ టాక్ రావడమే కాకుండా..ప్రభాస్ పై కూడా నెట్టింట విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు. దీంతో కోట్లు ఖర్చు చేసి పరువు పోగొట్టుకున్నట్లైంది. “రాధేశ్యామ్” సినిమా ఎఫెక్ట్ తో మిగతా ప్రభాస్ డైరెక్టర్స్ జగ్రత్తలు పడుతున్నారు.

ప్రభాస్ నుండి అభిమానులు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఆ ఎలిమేంట్స్ ఖచ్చితంగా ఉండేలా చూసుకుంటున్నారు. కాగా డైరెక్టర్ మారుతి డైరెక్షన్ లో ప్రభాస్ ఓ సినిమా చేయబోతున్నాడని..ఆ సినిమాకు రాజా డిలెక్స్ అనే టైటిల్ ఫిక్స్ చేశాడని గత కొద్ది రోజుల నుండి వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. కాగా, తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా కి సంబంధించిన కీలక అప్డేట్స్ ని ఏప్రిల్ 11న జరగబోయే..పూజా కార్యక్రమంలో రివీల్ చేయనున్నారట చిత్ర బృందం.

ఈ క్రమంలోనే ఈ సినిమాలో ప్రభాస్ సరసన ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారనే వార్త లీకైంది. అంతేకాదు వాళ్ల పేరు కూడా నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. మారుతి సినిమాలో ప్రభాస్ పక్కన నటించే ముద్దుగుమ్మలు మెహ్రీన్. రాశి ఖన్నా, కృతి శెట్టి. మారుతితో రాశికి,మెహ్రీన్ కి మంచి ఫ్రెండ్ షిప్ ఉంది. అందుకే ఈ సినిమాలో పెట్టుకుంటున్నట్లు టాక్ వినిపిస్తుంది. అయితే, కృతి శెట్టికి ఉన్న క్రేజ్ దృష్ట్యా ప్రభాస్ సినిమాలో ఆఫర్ ఇచ్చాడట మారుతి. అయితే అభిమానులు మాత్రం ప్రభాస్ పక్కన కృతి చూడటానికి బాగోదూ..వద్దు మారుతి పెట్టకండి అంటూ సజీషన్స్ ఇస్తున్నారు. మరి మారుతి ఏం చేస్తాడో చూడాలి..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news