Moviesమ‌హేష్ విట్టా ల‌వ్‌స్టోరీ వెరీ ఇంట్ర‌స్టింగ్‌... రెండు సార్లు చూసి వెంట‌నే...

మ‌హేష్ విట్టా ల‌వ్‌స్టోరీ వెరీ ఇంట్ర‌స్టింగ్‌… రెండు సార్లు చూసి వెంట‌నే ప్ర‌పోజ్‌..!

మ‌హేష్ విట్టా త‌న విల‌క్ష‌ణ‌మైన న‌ట‌న‌తో, కొత్త యాస‌తో చాలా త్వ‌ర‌గానే తెలుగు ప్రేక్ష‌కుల‌కు క‌నెక్ట్ అయ్యాడు. మ‌చ్చా మ‌చ్చా అంటూ నాని కృష్ణ‌గాడి వీరప్రేమ‌గాథ సినిమాతో పాటు ప‌లు సినిమాల్లో న‌టించి ప్రేక్ష‌కుల మ‌దిలో అలా రిజ‌స్ట‌ర్ అయ్యాడు. అయితే బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట‌ర్ అయ్యాక మ‌హేష్ విట్టా తెలుగు జ‌నాల మ‌దిలో అలా బ‌లంగా ఫిక్స్ అయిపోయాడు.

బిగ్‌బాస్ హౌస్‌లో మ‌హేష్ విట్టా చాలా ఓపెన్‌గా ఉండేవాడు. త‌న‌ను హౌస్‌లో ఉన్న వారిలో ఎవ‌రి ఏమ‌నుకున్నా.. ఎవ‌రు ఎలా గ్రూపులు క‌ట్టినా కూడా ఓపెన్‌గానే గేమ్ ఆడేవాడు. తాజాగా మ‌హేష్ ఓటీటీ బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. టైటిల్ ఫేవ‌రెట్ల‌లో ఒక‌డిగా ఉన్న మ‌హేష్ త‌న ల‌వ్ స్టోరీని రివీల్ చేసి అంద‌రికి షాక్ ఇచ్చాడు. రెండేళ్లు ఎంతో క‌ష్ట‌ప‌డితే గాని… తాను త‌న ప్రియురాలిని ఇంప్రెస్ చేయ‌లేక‌పోయాన‌ని చెప్పాడు.

ఈ యేడాదే త‌మ పెళ్లి జ‌రుగుతుంద‌ని.. రెండేళ్లు ప్రేమించుకున్నాక తాము త‌మ ఇంట్లో చెప్పి పెద్ద‌ల అంగీకారంతో పెళ్లి చేసుకోబోతున్నామ‌ని మ‌హేష్ తెలిపాడు. ఇక తాను ప్రేమించిన అమ్మాయి.. త‌న చెల్లెలుకు స్నేహితురాలు అవుతుంద‌ని.. ఆమెను రెండు సార్లు చూసిన వెంట‌నే క‌నెక్ట్ అయిపోయాన‌ని చెప్పాడు. ఆ వెంట‌నే తాను ఆమెకు ప్ర‌పోజ్ చేస్తే.. ప‌రిచ‌యం అయిన వెంట‌నే ప్ర‌పోజ్ చేస్తావా ? అని ఆమె నో చెప్పేసింద‌ని మ‌హేష్ చెప్పాడు.

ఆ త‌ర్వాత రెండేళ్ల పాటు స్నేహం చేశాక ఆమె త‌న ల‌వ్ ప్ర‌పోజ‌ల్‌కు ఎస్ చెప్పింద‌ని మ‌హేష్ అన్నాడు. ఇక త‌న కొత్త సినిమా రిలీజ్ అయ్యాక ఈ యేడాది ఆగ‌స్టు లేదా సెప్టెంబ‌ర్‌లో త‌మ పెళ్లి ఉంటుంద‌ని అన్నాడు. ఇక మ‌హేష్‌కు కాబోయే భార్య ఐటీ ఉద్యోగి. త‌మ ఇద్ద‌రి మ‌ధ్య చాలా సార్లు గొడ‌వ‌లు జ‌రుగుతూ ఉంటాయ‌ని.. అయితే తాము ఇట్టే క‌లిసి పోతామ‌ని కూడా చెప్పాడు. ఈ సారి మాత్రం ఖ‌చ్చితంగా బిగ్‌బాస్ ప్లాట్ ఫాంపై క‌ప్పు కొడ‌తాన‌ని ధీమాతో చెపుతున్నాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news