Moviesఅమీజాక్స‌న్‌తో ప్రేమ‌.. ఆ హీరో కెరీర్ స‌ర్వ‌నాశ‌న‌మైందా...!

అమీజాక్స‌న్‌తో ప్రేమ‌.. ఆ హీరో కెరీర్ స‌ర్వ‌నాశ‌న‌మైందా…!

అమీజాక్స‌న్ మ‌న తెలుగు ప్రేక్ష‌కుల‌కు కూడా ప‌రిచ‌య‌మే. శంక‌ర్ హీరోగా వ‌చ్చిన ఐ ( తెలుగులో మ‌నోహ‌రుడు) సినిమాలో హీరోయిన్‌గా న‌టించిన ఆమె రోబో 2.0 లో కూడా ర‌జ‌నీకాంత్‌కు జోడీ క‌ట్టింది. ఇక తెలుగులో రామ్‌చ‌ర‌ణ్ ఎవ‌డు సినిమాలో జోడీ క‌ట్టింది. అంత‌కు ముందే ఆమె ఆర్య హీరోగా వ‌చ్చిన మ‌ద‌రాసీ ప‌ట్ట‌ణం సినిమా ద్వారా సౌత్ సినిమా అభిమానుల‌కు బాగా ద‌గ్గ‌రైంది. అయితే ఆమె ఓ యంగ్ హీరోతో పీక‌ల్లోతు ప్రేమ‌లో ప‌డింది. ఆమె ప్రేమ త‌న కెరీర్‌ను స్పాయిల్ చేసింద‌ని.. త‌న జీవితం స‌ర్వ‌నాశ‌నం అయిపోయింద‌ని స‌ద‌రు హీరో ఇప్పుడు బాధ‌ప‌డుతున్నాడు.

బ్రిటీష్ న‌టి అయిన అమీజాక్స‌న్ బాలీవుడ్‌లో ఓ వెలుగు వెల‌గాల‌ని సినిమా ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చింది. అయితే ఆమెకు బాలీవుడ్ ఛాన్సుల కన్నా.. కోలీవుడ్‌, సౌత్ సినిమాల్లో మంచి ఛాన్సులు వ‌చ్చాయి. ఈ క్ర‌మంలోనే బాలీవుడ్ యంగ్ హీరో ప్ర‌తీక్ బ‌బ్బ‌ర్‌తో ప్రేమ‌లో ప‌డింది. ప్ర‌తీక్ ఎవ‌రో కాదు ఏక్ దివానా సినిమాతో హీరోగా ప‌రిచ‌యం అయ్యి ఇప్పుడు నార్త్‌లో బిజీ హీరోగా మారుతున్నాడు.

ఇక అమీ జాక్స‌న్ – ప్ర‌తీక్ బ‌బ్బ‌ర్ 2010లో ప్రేమ‌లో ప‌డ్డాడు. ఆ టైంలో ఎక్క‌డ చూసినా వీరే ఉండేవారు.. విదేశీ టూర్లు, బీచ్‌లు, షికార్లు, రొమాంటిక్ డేట్లు ఇలా లైఫ్ ఎంజాయ్ చేసేవారు. అయితే ఆ ప్రేమ మూడునాళ్ల ముచ్చ‌టే అయ్యింది. 2011లో ల‌వ్ చేసుకున్న ఈ జంట 2012లో విడిపోయింది. అయితే అమీ ప్ర‌తీక్‌కు దూర‌మ‌య్యాక ఓ విదేశీ వ్య‌క్తిని ప్రేమించి పెళ్లి చేసుకుని త‌ల్లి కూడా అయ్యింది. అయితే చిన్న వ‌య‌స్సులోనే ఆమె ప్రేమ‌లో ప‌డ్డ ప్ర‌తీక్ మాత్రం ఆమె ప్రేమ త‌న కెరీర్‌ను పూర్తిగా స్పాయిల్ చేసింద‌ని ఇప్పుడు బాధ‌ప‌డుతున్నాడు.

తాము విడిపోయాక ఎందుకో గాని అస్స‌లు మాట్లాడుకోలేద‌ని.. అస్స‌లు ట‌చ్‌లో కూడా లేము.. క‌నీసం ఫ్రెండ్లీగా లేము అని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. మ‌న‌సిచ్చిన అమ్మాయి విష‌యంలో ప్ర‌తీక్ ఇంత ఘాటుగా స్పందించ‌డాన్ని బ‌ట్టి చూస్తే ఆ ప్రేమ ప్ర‌తీక్‌ను చాలా బాగా డిస్ట‌ర్బ్ చేసింద‌ని అర్థ‌మ‌వుతోంది. బాలీవుడ్‌లో చాలా మంది యంగ్ హీరోలు, హీరోయిన్లు 20 ఏళ్ల‌కే ప్రేమ‌లో ప‌డుతున్నారు… పెళ్లి చేసుకుంటున్నారు.. సింపుల్‌గానే విడాకులు తీసుకుంటున్నారు. అయితే ఆ త‌ర్వాత కూడా వారి స్నేహం కొన‌సాగుతూనే ఉంటుంది.

అయితే ఇందుకు భిన్నంగా ప్ర‌తీక్ – అమీ మాత్రం ప్రేమ బ్రేక‌ప్‌తోనే ఎవ‌రికి వారు త‌మ బంధాన్ని శాశ్వ‌తంగా తుంచేసుకున్న‌ట్టు క‌నిపిస్తోంది. ఇక ఇప్పుడిప్పుడే కెరీర్‌లో బిజీ అవుతోన్న ప్ర‌తీక్ గ‌త‌ యేడాది ఏకంగా మూడు సినిమాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. ప్ర‌స్తుతం రెండు సినిమాల్లో న‌టిస్తున్నాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news