Moviesఫ్యీజులు ఎగిరిపోయే ట్విస్ట్‌... R R R లో ప్ర‌భాస్ గెస్ట్...

ఫ్యీజులు ఎగిరిపోయే ట్విస్ట్‌… R R R లో ప్ర‌భాస్ గెస్ట్ రోల్‌… !

అస‌లు ఈ టైటిల్ చూస్తూనే చాలా వ‌ర‌కు మైండ్ బ్లాక్ అయిపోయిన‌ట్టు ఉంటుంది. ఏంటి ఎన్టీఆర్ – రామ్‌చ‌ర‌ణ్ కాంబోలో వ‌స్తోన్న మ‌ల్టీస్టార‌ర్ సినిమా త్రిబుల్ ఆర్‌లో ప్ర‌భాస్ గెస్ట్ రోల్ చేశారా ? ఇది నిజ‌మేనా ? ఈ విష‌యాన్ని ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి సీక్రెట్‌గా ఉంచారా ? ఇలా ఒక్క‌సారిగా ఎన్నో ప్ర‌శ్న‌లు మ‌న మైండ్‌లోకి వెళ్లిపోతాయి. అయితే అస‌లు క‌థ ఏంటంటే రాజ‌మౌళికి – ప్ర‌భాస్‌కు బాహుబ‌లి సినిమా నుంచి మ‌రింత బాండింగ్ పెరిగిపోయింది.. నువ్వు నువ్వు అనుకునేంత చ‌నువు వీరిద్ద‌రి మ‌ధ్యా పెరిగిపోయింది.

బాహుబ‌లి త‌ర్వాత ప్ర‌భాస్ సాహో చేసి ఇప్పుడు రాధేశ్యామ్‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. రాజ‌మౌళి ఎన్టీఆర్ – రామ్‌చ‌ర‌ణ్‌తో త్రిబుల్ ఆర్ సినిమా చేశాడు. ఈ రెండు సినిమాలు ఇదే నెల‌లో రిలీజ్ అవుతున్నాయి. రెండు సినిమాలు భారీ బ‌డ్జెట్ సినిమాలే..! రాధేశ్యామ్ ప్ర‌మోష‌న్ల‌లో భాగంగా రాజ‌మౌళి ప్ర‌భాస్‌ను ఇంట‌ర్వ్యూ చేశాడు. ఈ ఇంట‌ర్వ్యూలో ప్ర‌భాస్ చాలా ఆస‌క్తిక‌ర విష‌యాలు చెప్పాడు.

బాహుబ‌లి సినిమాకు ముందు వ‌ర‌కు త‌న‌కు డెస్టినీ మీద న‌మ్మ‌కం లేద‌ని.. ఆ త‌ర్వాత నుంచే తాను డెస్టినీనీ న‌మ్మ‌డం మొద‌లు పెట్టాన‌ని ప్ర‌భాస్ చెప్పాడు. త‌న ఫ్రెండ్స్‌తో పాటు కంగ‌నా వంటి హీరోయిన్ల విష‌యంలో జ‌రిగిన సంఘ‌ట‌న‌లు త‌న‌కు డెస్టినీపై న‌మ్మ‌కం క‌లిగేలా చేశాయంటూ ప్ర‌భాస్ సంచ‌ల‌న విష‌యాలు చెప్పాడు. బాహుబ‌లి త‌ర్వాత త‌న‌తో కేవ‌లం ల‌వ్‌స్టోరీ చేయ‌డం అంత సులువు కాద‌ని.. యాక్ష‌న్ అవ్ స్టోరీ అంటే వేరుగా ఉంటుంద‌ని.. అయితే డైరెక్ట‌ర్ కొత్త జాన‌ర్‌తో ఈ రాధేశ్యామ్ సినిమా తెర‌కెక్కించాడ‌ని తెలిపాడు.

ఇక రాజ‌మౌళి మాట్లాడుతూ సినిమాలో సంచారీ సాంగ్ చాలా బాగుంద‌ని.. ఆ పాట‌లో త‌న‌కు ప్ర‌భాస్ న‌వ్వు బాగా న‌చ్చింద‌ని చెప్పాడు. రాజ‌మౌళి నుంచి.. ఆయ‌న చేసిన సినిమాల నుంచి తాను 15 ఏళ్లుగా చాలా నేర్చుకున్నాన‌ని.. అయితే అవ‌న్నీ కూడా త‌న‌తో ప‌నిచేసే ప్ర‌తి డైరెక్ట‌ర్‌కు చెప్పాన‌ని ప్ర‌భాస్ అన్నాడు. ఇక ఒక టైంలో అన్న‌పూర్ణ స్టూడియోలో రాధేశ్యామ్ సెట్లోనే అనుకోకుండా త్రిబుల్ ఆర్‌లో ఆలియా భ‌ట్‌కు చెందిన షూటింగ్‌లో ఓ చిన్న బిట్ షూట్ చేశార‌ట‌. మ‌ధ్య‌లో ఓ తెర‌క‌ట్టేసి ప‌క్క ప‌క్క‌నే రెండు సినిమాల షూటింగ్ చేయ‌డం మంచి అనుభూతి అని ప్ర‌భాస్.. రాజ‌మౌళి ఇద్ద‌రూ గుర్తు చేసుకున్నారు.

ఇదిలా ఉంటే త‌న‌తో ఇన్ని సినిమాలు చేసిన నేప‌థ్యంలో ఆర్ ఆర్ ఆర్ లో చిన్న గెస్ట్ రోల్ కూడా చేయించాల‌న్న ఆలోచ‌న నీకు రాలేదా అంటూ ప్ర‌భాస్ రాజ‌మౌళిని ఓపెన్‌గానే అడిగేశాడు. ఒక‌వేళ నిజంగానే ప్ర‌భాస్ గెస్ట్ రోల్ చేసి ఉంటే ఖ‌చ్చితంగా అది ఆర్ ఆర్ ఆర్‌లో మ‌రింత స‌ర్‌ఫ్రైజ్ ఎలిమెంట్‌గా ఉండేది. ఇక త్వ‌ర‌లోనే తాను రాజ‌మౌళితో మ‌రో సినిమా చేస్తాన‌ని కూడా ప్ర‌భాస్ చెప్పారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news