Moviesభీమ్లానాయ‌క్ సినిమాపై శ్రీ రెడ్డి రివ్యూ.. వామ్మో ఇవేం డైలాగ్స్ రా...

భీమ్లానాయ‌క్ సినిమాపై శ్రీ రెడ్డి రివ్యూ.. వామ్మో ఇవేం డైలాగ్స్ రా బాబు…

శ్రీరెడ్డి పరిచయం అక్కర్లేని పేరు. గ‌త రెండు సంవ‌త్స‌రాలుగా ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతూనే ఉంటోంది. ఏపీ రాజ‌కీయాలు ఆమెకే కావాలి.. ఇటు కాస్టింగ్ కౌచ్ వివాదంతో పాటు తెలంగాణ రాజకీయాలు.. ఇండస్ట్రీలో గొడ‌వ‌లు అన్నిట్లోనూ శ్రీరెడ్డి దూరేస్తూ ఉంటుంది. టాపిక్ ఏదైనా కూడా శ్రీరెడ్డి కుండ‌బ‌ద్ద‌లు కొట్టేస్తూ ఉంటుంది. ఇక ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అంటే శ్రీరెడ్డికి ఎంత ఇష్ట‌మో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.

తాజాగా శ్రీరెడ్డి ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన భీమ్లానాయ‌క్ సినిమాను టార్గెట్ చేసింది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ – రానా కాంబినేష‌న్లో సాగ‌ర్ కె. చంద్ర ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఈ సినిమాకు మంచి టాక్ వ‌చ్చింది. ఇక గ‌తం నుంచి కూడా శ్రీరెడ్డి ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను టార్గెట్ చేస్తూ వ‌స్తోంది. తాజాగా ఈ సినిమాకు ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు ఇండ‌స్ట్రీకి చెందిన ప‌లువురు సెల‌బ్రిటీలు కూడా పాజిటివ్ రివ్యూలు వ‌స్తున్నాయి. అటు సోష‌ల్ మీడియాలోనూ మంచి టాకే ఉంది.

తొలి రోజు భీమ్లానాయ‌క్ మంచి వ‌సూళ్లు రాబ‌ట్ట‌డంతో సినిమా బ్లాక్‌బ‌స్ట‌ర్ అంటున్నారు. ఈ సినిమాపై శ్రీరెడ్డి ఘాటుగా స్పందించింది. నువ్వు అటు సినిమాల‌కు, ఇటు రాజ‌కీయాల‌కు కూడా ప‌నికిరావు.. నీ సినిమా సెకండాఫ్ చాలా చెత్త‌గా ఉంది.. అస‌లు సెకండాఫ్ చూసేవాళ్లే క‌రువ‌య్యార‌ని ఘాటుగా విమ‌ర్శించింది. కేవ‌లం రాజ‌కీయ ల‌బ్ధి కోస‌మే ఈ సినిమా చేశావంటూ ఆమె మండిప‌డింది.

నువ్వు ఈ సినిమా కోసం తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ సంక ఎందుకు నాకావు ? నువ్వు నీ వ్యక్తిగ‌త లాభం కోసం మంత్రి కేటీఆర్‌ను క‌ల‌వ‌వ‌చ్చు ? కానీ నీ అన్న చిరంజీవి జ‌గ‌న్‌ను క‌ల‌వ‌కూడ‌దా ? నువ్వు ఎన్ని డ్రామాలు ఆడినా సీఎం కాలేవు అని ఓ ఆటాడుకుంది. అయితే ప‌వ‌న్ అభిమానులు కూడా అంతే ఘాటుగా శ్రీరెడ్డిపై విరుచుకుప‌డుతున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news