Moviesరోజా బెడ్‌రూం చూస్తే జిగేలే... ఆమెకు అదంటే అంత ఇష్ట‌మా...!

రోజా బెడ్‌రూం చూస్తే జిగేలే… ఆమెకు అదంటే అంత ఇష్ట‌మా…!

ఫైర్‌బ్రాండ్‌, వెట‌ర‌న్ హీరోయిన్‌, వైసీపీ ఎమ్మెల్యే రోజా ఎక్క‌డ ఉంటే అక్క‌డ అంత సంద‌డి ఉంటుంది. ఆమె అసెంబ్లీలో ఉన్నా, ఎమ్మెల్యేగా ప్ర‌జ‌ల్లో ఉన్నా.. ఇటు బుల్లితెర‌పై జ‌బ‌ర్ద‌స్త్ జ‌డ్జ్‌గా ఉన్నా.. ఇలా ఎక్క‌డ ఉన్నా ఆమె కంచుకంటంతో అక్కడ సంద‌డి మామూలుగా ఉండ‌దు. రోజా ఎన‌ర్జీ అలాంటిది. రోజాకు బుల్లితెరపై ఆమె జ‌డ్జ్‌గా ఉన్న జ‌బ‌ర్ద‌స్త్ షో ఈ వ‌య‌స్సులో కూడా ఆమెకు తిరుగులేని క్రేజ్ తెచ్చిపెడుతోంది.

ఈ క్ర‌మంలోనే జ‌డ్జ్‌గా ఉన్న రోజా హోమ్ టూర్ చేస్తే ఎలా ఉంటుందో ? అన్న ప్లాన్‌తో హైప‌ర్ ఆది త‌న స్కిట్‌లో భాగంగా న‌గ‌రిలో ఉన్న రోజా ఇంటికి వెళ్లి మ‌రీ హోమ్ టూర్ చేశారు. త‌న టీంతో క‌లిసి రోజా ఇంటికి వెళ్లిన వెంట‌నే రోజా వాళ్ల‌కు సాద‌ర స్వాగ‌తం ప‌లికారు. రోజా ఇంటికి వెళ్లినా కూడా రోజాను వ‌ద‌ల‌కుండా ఆమెపై వ‌రుస పంచ్‌లు వేశాడు.

రోజా గుమ్మం ముందు నిల‌బ‌డి.. ఆది చూశావా గుమ్మ ఎంత విశాలంతో ఉందో అన‌డంతో వెంట‌నే ఆది మీరు లోప‌ల‌కు వెళ్లాలంటే గుమ్మం ఈ మాత్రం ఉండాల‌ని పంచ్ వేశాడు. అలా రోజా లావు గురించి కామెంట్ చేసిన ఆది.. ఆ ఇంట్లో ఉన్నంత సేపు పంచ్‌లు వేస్తూనే ఉన్నాడు. ఇలా గ్రౌండ్ ఫ్లోర్‌, ఫ‌స్ట్ ఫ్లోర్‌, సెకండ్ ఫ్లోర్ అంటూ ఇంటిని అద్భుతంగా చూపించారు.

ఇక రోజా ఫ‌స్ట్ ఫ్లోర్‌లో ఉన్న పూజ గ‌దిని చూపిస్తూ.. తాను ప్ర‌తి రోజు పూజ చేసుకున్నాకే బ‌య‌ట‌కు వ‌స్తాన‌ని.. త‌నకు ఇంట్లో ఉన్న ప్లేసుల్లో ఈ పూజ గ‌ది అంటే ఎంతో ఇష్ట‌మ‌ని తెలిపారు. ఇక బెడ్ రూంలోకి వెళ్లాక దానికి చాలా బాగా డిజైన్ చేసిన‌ట్టు చూపించారు. అక్క‌డ పీవోపీ చూసేందుకు ఎంతో బాగుంది. ఏదేమైనా ఈ స్కిట్‌తో హైప‌ర్ ఆది ఆలోచ‌న‌ను అంద‌రూ మెచ్చుకుంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news