Moviesగృహ‌ప్ర‌వేశం ప‌నుల్లో ర‌ష్మిక బిజీ... కొత్త ఇళ్లు ఇన్ని కోట్లా..!

గృహ‌ప్ర‌వేశం ప‌నుల్లో ర‌ష్మిక బిజీ… కొత్త ఇళ్లు ఇన్ని కోట్లా..!

ప్ర‌స్తుతం కుర్ర‌కారుకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోన్న హీరోయిన్ ఎవర్రా బాబు అని ప్ర‌శ్నించుకుంటే వినిపించే ఒకే ఒక్క పేరు ర‌ష్మిక మంద‌న్న‌. క‌న్న‌డ క‌స్తూరి అయిన ర‌ష్మిక ముందుగా త‌న సొంత భాష సినిమాల‌తో వెండితెరంగ్రేటం చేసింది. కిర్రాక్ పార్టీ హిట్ అవ్వ‌డంతో అంద‌రి క‌ళ్లు ఆమె మీదే ప‌డ్డాయి. క‌న్న‌డంలో రెండు మూడు హిట్లు రావ‌డంతో అక్క‌డ క్రేజ్ వ‌చ్చింది. ఆ త‌ర్వాత నితిన్‌తో ఛ‌లో సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా హిట్ అవ్వ‌డం.. ఆమె అందానికి తెలుగు జ‌నాలు ఫిదా అయిపోవ‌డంతో ర‌ష్మిక వెన‌క్కు తిరిగి చూసుకోలేదు.

అస‌లే మ‌న తెలుగు స్టార్ హీరోల‌కు, యంగ్ హీరోల‌కు హీరోయిన్ల కొర‌త తీవ్రంగా ఉంది. మ‌న‌కు హీరోలు ఎక్కువ‌.. హీరోయిన్లు త‌క్కువ‌. దీంతో ర‌ష్మిక‌కు వ‌రుస ఆఫ‌ర్లు ఇచ్చి ప‌డేశారు. త‌క్కువ టైంలోనే ఏకంగా సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు స‌రిలేరు నీకెవ్వ‌రు సినిమా ఛాన్స్ వ‌చ్చింది. ఆ సినిమా హిట్ అయ్యాక గ్యాప్ లేకుండా వెంట‌నే బ‌న్నీ పుష్ప సినిమా ఛాన్స్‌.. ఇది కూడా బ్లాక్‌బ‌స్ట‌ర్ అవ్వ‌డంతో పాటు అటు నార్త్‌లో కూడా ఏకంగా రు. 100 కోట్లు కొల్ల‌గొట్టింది. దీంతో ర‌ష్మిక ఇంటేనే ఇప్పుడు ఓ గోల్డెన్ లెగ్ అయిపోయింది.

ర‌ష్మిక మ‌రోవైపు సోష‌ల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటూ వ‌స్తోంది. సినిమా సినిమాకు ఆమె క్రేజ్‌తో పాటు అభిమానులు, రేటు కూడా పెరిగిపోతోంది. ప్ర‌స్తుతం ర‌ష్మిక ఒక్కో సినిమాకు రు. 3 కోట్ల వ‌ర‌కు డిమాండ్ చేస్తోన్న ప‌రిస్థితి. బాలీవుడ్ లో పుష్ప సినిమాతో ద‌గ్గ‌రైన ఆమె ఓ సినిమాలో అమితాబ్‌తో క‌లిసి న‌టిస్తోంది. బాలీవుడ్‌లో స్టార్ హీరోల సినిమాల్లో కూడా ర‌ష్మికకు ఛాన్సులు వ‌స్తున్నాయి.

ఈ క్ర‌మంలోనే త‌ర‌చూ షూటింగ్‌ల‌కు వెళుతోన్న ర‌ష్మిక అక్క‌డ హోట‌ల్స్‌లో ఉండ‌డం ఇబ్బందిగా ఉండ‌డంతో ఇప్పుడు ముంబైలో త‌ర‌చూ ఉండేందుకు సొంతిళ్లు కొనుగోలు చేసేసింద‌ట‌. ఆమెకు ఇప్ప‌టికే బెంగ‌ళూరు, మంగ‌ళూరులో ఇళ్లు, ప్లాట్లు ఉన్నాయి. ఇక ఇప్పుడు ముంబైలో కూడా కొత్తిళ్లు కొనేసి అక్క‌డ కూడా ఓ ఇంటిది కాబోతోంద‌న్న‌మాట‌. ఈ ఇళ్లు ఖ‌రీరు రు. 6 కోట్ల పైనే అని తెలుస్తోంది. ఇక హైద‌రాబాద్‌లో కూడా ఆమెకు ఓ ప్లాట్ ఉంద‌ని అంటున్నారు. ఏదేమైనా రెమ్యున‌రేష‌న్ పెర‌గ‌డంతో పాటు వ‌రుస ఆఫ‌ర్ల‌తో ర‌ష్మిక బాగానే ఆస్తులు కూడ‌బెట్టుకుంటోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news