Moviesపీకల్లోతు ఆర్థిక కష్టాల్లో రామ్ చరణ్.. మూతపడ్డ వ్యాపారం...?

పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో రామ్ చరణ్.. మూతపడ్డ వ్యాపారం…?

సాధారణంగా తెరమీద కనిపించే ఎంతో మంది కేవలం హీరోలుగా మాత్రమే మనకు తెలుసు.. కానీ ఆ హీరోలు తెరవెనుక మంచి వ్యాపార వేత్తలు అనే విషయం మాత్రం చాలా మంది ప్రేక్షకులకు తెలియదు. సినిమాల్లో బాగా సంపాదిస్తున్న హీరోలు వివిధ వ్యాపారాల్లో పెట్టుబడులు పెడుతూ తమ సంపదను మరింత పెంచుకుంటున్నారు. ప్రస్తుతం మెగాస్టార్ నట వారసుడిగా మెగా పవర్ స్టార్ గా కొనసాగుతున్న రామ్ చరణ్ ఒకవైపు వరస సినిమా లతో దూసుకు పోతున్నాడు. ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ హీరోగా కొనసాగుతున్నాడు. ఇంకోవైపు అటు కొణిదెల ప్రొడక్షన్స్ స్థాపించి నిర్మాణ రంగంలో కూడా అడుగుపెట్టి అదరగొడుతున్నాడు ఈ మెగా వారసుడు.

అంతేకాదు ఇంకా ఎన్నో వ్యాపారాలలో కూడా పెట్టుబడులు పెట్టి అటు వ్యాపారాల్లో కూడా సత్తా చాటుతున్నారు. గతంలో ట్రూజెట్ ఎయిర్ లైన్స్ లో పెట్టుబడులు పెట్టాడు రామ్ చరణ్. ఇక 2015 లో ఇక ఈ పెట్టుబడుల ద్వారా చరణ్ ఏవియేషన్ వ్యాపారంలోకి కూడా అడుగు పెట్టాడు అని చెప్పాలి. తక్కువ ఖర్చుతోనే ఎంతోమందికి దేశీయ విమాన సర్వీసులను అందించడానికి ఈ సంస్థ ప్రారంభించబడింది. ఇక పోతే ఇక రామ్ చరణ్ పెట్టుబడులు పెట్టిన ట్రూజెట్ ఎయిర్ లైన్స్ ఇటీవలే నిలిచి పోయినట్లు తెలుస్తోంది. దీంతో రామ్ చరణ్ కి ఊహించని షాక్ తగిలింది.

ఇక ఈ సంస్థ విమాన సర్వీసులుపోవడం తో రామ్ చరణ్ కు భారీగా నష్టం వచ్చిందట. అయితే ఇక ట్రూజెట్ ఎయిర్లైన్ సంస్థలు నష్టాల కారణంగా త్వరలో పూర్తిగా మూసివేయబడుతుంది అంటూ వార్తలు కూడా వస్తున్నాయి. ఇక ఇటీవల ఈ విషయంపై ఎయిర్లైన్స్ సంస్థ స్పందించింది అడ్మినిస్ట్రేటివ్ టెక్నికల్ ప్రాబ్లమ్స్ కారణంగానే తాత్కాలికంగా విమాన సేవలను నిలిపి వేసినట్లు తెలిపింది.

తన స్నేహితుడు ఉమేష్ తో కలిసి ఎయిర్ లైన్స్ లో పెట్టుబడులు పెట్టిన రామ్ చరణ్ భారీగానే ఆదాయాన్ని సంపాదించినట్లు తెలుస్తోంది. కానీ ఇప్పుడు ఒక్కసారిగా ఈ కొత్త బిజినెస్ మూతపడడంతో రామ్ చరణ్ షాక్ లో మునిగి పోయాడట. ఇకపోతే రామ్ చరణ్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం జక్కన్న దర్శకత్వంలో తెరకెక్కిన త్రిబుల్ ఆర్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక వైవిధ్యమైన దర్శకుడు శంకర్ తో కలిసి సినిమా చేస్తున్నాడు రామ్ చరణ్. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ అధికారికంగా ఇంకా విడుదల కాలేదు..

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news