Moviesతార‌క్‌పై నేను చెప్పిందే నిజమైంది... ఆ హీరోయిన్ సంచ‌ల‌న కామెంట్స్‌

తార‌క్‌పై నేను చెప్పిందే నిజమైంది… ఆ హీరోయిన్ సంచ‌ల‌న కామెంట్స్‌

టాలీవుడ్ యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ వ‌రుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ వెళ్లిపోతున్నాడు. ప్ర‌స్తుతం త్రిబుల్ ఆర్ సినిమాలో న‌టించిన ఎన్టీఆర్ నెక్ట్స్ కొర‌టాల శివ‌తో సినిమాకు రెడీ అవుతున్నాడు. ఈ క్ర‌మంలోనే ఎన్టీఆర్ పేరు ప్ర‌స్తుతం టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్ వ‌ర్గాల్లోనూ బాగా వైర‌ల్ అవుతోంది. బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ దీపికా ప‌దుకొనే తాను ఎన్టీఆర్‌తో న‌టించేందుకు ఆస‌క్తిగా ఉన్నాన‌ని.. తన మ‌న‌సులో మాట చెప్ప‌డం అత్యంత ఆస‌క్తిగా మారిపోయింది.

దీపికా ప‌దొకొనే చేసిన ఈ కామెంట్లు తార‌క్ అభిమానులను ఫుల్ ఖుషీ చేసేశాయి. బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ అయిన దీపిక‌తో న‌టించేందుకు దేశ‌వ్యాప్తంగా వివిధ భాష‌ల్లో ఉన్న ఎంతోమంది హీరోలు వెయిట్ చేస్తూ ఉంటారు. అలాంటిది దీపికే స్వ‌యంగా తాను తార‌క్‌తో న‌టించాల‌ని కోరుకుంటున్నాన‌ని చెప్ప‌డం అంటే తార‌క్ రేంజ్ బాలీవుడ్‌, నార్త్‌లో ఎలా ఉందో అర్థ‌మ‌వుతోంది.

దీపిక చెప్పిన ఈ మాటే ఇప్పుడు సెల‌బ్రిటీలో బాగా ట్రెండ్ అవుతోంది. ఇదిలా ఉండ‌గానే ఎన్టీఆర్‌తో గ‌తంలో న‌టించిన ఓ హీరోయిన్ చేసిన కామెంట్ కూడా ఇప్పుడు బాగా వైర‌ల్ అవుతోంది. ఎన్టీఆర్ అవుట్ స్టాండిగ్ సినిమాల్లో ఊస‌ర‌వెల్లి ఒక‌టి. సురేంద‌ర్‌రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో ఎన్టీఆర్ యాక్టింగ్‌, త‌మ‌న్నా పెర్పామెన్స్ అదుర్స్‌. ఈ సినిమాలో ఎన్టీఆర్‌తో కంటిన్యూగా ట్రావెల్ చేసే పాత్ర‌లో పాయ‌ల్ ఘోష్ న‌టించింది.

తాజాగా ఎన్టీఆర్‌పై దీపిక చేసిన కామెంట్లు విన్న పాయ‌ల్ స్ట‌న్ అయ్యింద‌ట‌. ఊస‌ర‌వెల్లి సినిమా త‌ర్వాత ఎన్టీఆర్ న‌ట‌న గురించి తాను గ‌తంలోనే చెప్పాన‌ని.. అయితే అప్పుడు తన‌ను చాలా మంది విమ‌ర్శించార‌ని పాయ‌ల్ చెప్పింది. అయితే అప్పుడు తాను ఏదైతే చెప్పానో ఇప్పుడు అదే నిజం అయ్యింది. తార‌క్‌తో న‌టించేందుకు ఏకంగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్లే ఇష్ట‌ప‌డుతున్నార‌ని తెలిపింది.

ఇక టాలీవుడ్ భ‌విష్య‌త్తులో ఖ‌చ్చితంగా బాలీవుడ్‌ను మించిపోతుంద‌ని.. నా అంచ‌నా ఎప్ప‌ట‌కీ త‌ప్ప‌ద‌ని కాన్ఫిడెంట్ కామెంట్ చేసింది. దీంతో ఇప్పుడు ఇవి బాగా వైర‌ల్ అవుతున్నాయి. రెండు రోజుల గ్యాప్‌లో ఎన్టీఆర్‌ను ఇద్ద‌రు హీరోయిన్లు ఆకాశానికి ఎత్తేయ‌డంతో ఎన్టీఆర్ అభిమానులు ఈ కామెంట్స్‌ను బాగా వైర‌ల్ చేస్తున్నారు.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news