Moviesనటి సుధ భర్త, కొడుకు ఇలాంటి వాళ్ల..ఇన్ని బాధలు పడిందా..ఆ శాపమేనా..?

నటి సుధ భర్త, కొడుకు ఇలాంటి వాళ్ల..ఇన్ని బాధలు పడిందా..ఆ శాపమేనా..?

సీనియ‌ర్ న‌టి సుధారెడ్డి..ఈ పేరుకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. గత రెండున్న‌ర ద‌శాబ్దాల‌కు పైగా ఎన్నో సినిమాలో నటించి అలరించి తన నటనతో మెప్పించి కోట్లాది మంది అభిమానులను సంపాదించుకుంది. సుమారు 975 సినిమాల్లో కనిపించి మెప్పించి తెలుగు సినిమా ప్రేక్ష‌కుల‌ను అలరించిన సుధ ఆల్ మోస్ట్ అందరి హీరోల పక్కన నటించింది. ఎన్టీఆర్ మేజ‌ర్ చంద్ర‌కాంత్ సినిమాలో న‌టించిన ఆమె ఆ త‌ర్వాత చిరంజీవి గ్యాంగ్ లీడ‌ర్ సినిమాలో హీరో వ‌దిన పాత్ర‌తో మెప్పించారు. అప్ప‌టి నుంచి ఆమె అమ్మ‌, అక్క‌, అత్త‌, వ‌దిన పాత్ర‌లు వేస్తూనే ఉన్నారు. సినిమాల్లోకి వ‌చ్చిన వెంట‌నే ఆమె క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా కెరీర్ స్టార్ట్ చేయ‌డంతో ఆమె హీరోయిన్‌గా చేయ‌లేక‌పోయారు.

సుధ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడమే కాదు.. ఆమె పోషించిన పాత్రల ద్వారా తనదైన శైలి ముద్ర వేసింది. ఎన్నో వందలాది చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది నటి సుధ. తాజాగా ఆమె తన జీవితంలోని ఒడిదుడుకులను కళ్లకు కట్టినట్లు వివరించి..కన్నీటి పర్యంతమైంది. నిజానికి ఈమె బాగా రిచ్ ఫ్యామిలీలో పుట్టింది. తండ్రి సివిల్ ఇంజినీర్ గా బాగానే ఆస్తి సంపాదించారు. కానీ, కేన్సర్ వలన తండ్రి చనిపోవడంతో అప్పటినుండి కుటుంబ భారం, బాధ్యతలు అన్నీ కూడా సుధనే తీసుకోవాల్సి వచ్చింది. ఇక అలా ఆమె కష్టాలు స్టార్ట్ అయ్యాయి.

కూతురు అయినా కూడా తండ్రి లేకపోయినా తన అన్నయ్యలు, తమ్ముడి బాధ్యతలు ఇంటికి పెద్దకొడుకుల చూసుకుంది. ఇక సుధ తల్లి హార్ట్ అటాక్‌తో చనిపోవడంతో అటు తండ్రి ఇటు తల్లి లేక ఆమె చిన్న వయస్సులోనే నరకం చూసింది. ఇక మ్యారేజ్ తర్వాత సుధను తన భర్త, కొడుకు కూడా దూరం పెట్టారు. 100 ఏళ్ళు ఉంటాను అని అగ్ని సాక్షిగా ప్రమాణం చేసిన కట్టుకున్న భర్తతో ఆమెను వదిలేసి వెళ్లిపోవడంతో ఒంటరైంది. భర్త యుఎస్‌లో బిజినెస్ చేస్తుంటే.. కొడుకు కూడా అతని దగ్గరే ఉంటున్నాడు.

సుధ మాట్లాడుతూ.. “నా భర్తకు బాగా ఆస్తి ఉంది. ప్రస్తుతం అమెరికాలో రిచ్ లైఫ్ లో బ్రతుకున్నాడు. నా కోడుకు కూడా వాళ్ల నాన్న దగ్గరే ఉంటున్నాడు. వాళ్ళ లైఫ్ వాళ్లు సంతోషంగా హ్యాపీగా బతుకుతున్నారు. ఉండనీయండి. నాకేం పర్లేదు. లైఫ్ అంటే ఏంటో ఇంకా వాళ్లకు తెలిసి రాలేదు. నేనూ నా జీవితాని నా కూతురు మనవరాలితో సంతోషంగానే బతుకుతున్నా. కానీ నేను రోజు ఏడుస్తున్న. నా భర్త,కొడుకు వదిలేశారని కాదు.. ఈరోజు నేను మా నాన్న లేక ఒంటరయ్యానే అని నా బాధ.. అందుకు ఏడుస్తున్నాను. ఈరోజు నాకు వచ్చిన కష్టం రేపటి రోజున వాళ్లకు వస్తుంది. అప్పుడు తెలుస్తుంది వాళ్ళు ఎంత పెద్ద తప్పు చేసారో. అది చూడటానికి నేను ఉండచ్చు..ఉండకపోవచ్చు. కానీ నాలాగే వాళ్ళు ఏదుస్తారు” అంటూ ఎమోషనల్ అయ్యింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news