MoviesNTR 30... సూప‌ర్ అప్‌డేట్ వ‌చ్చేసింది...!

NTR 30… సూప‌ర్ అప్‌డేట్ వ‌చ్చేసింది…!

టాలీవుడ్ యంగ్‌టైగ‌ర్ సినిమా వ‌చ్చి మూడున్న‌ర సంవ‌త్స‌రాలు అవుతోంది. అప్పుడెప్పుడో 2018 చివ‌ర్లో వ‌చ్చిన అర‌వింద స‌మేత వీర‌రాఘ‌వ సినిమా త‌ర్వాత మ‌ళ్లీ ఎన్టీఆర్ సినిమా రిలీజ్ కాలేదు. క‌రోనా రావ‌డం, మ‌రోవైపు రాజ‌మౌళి త్రిపుల్ ఆర్ సినిమాకు ఎన్టీఆర్ అంకితం అయిపోవ‌డంతో మూడున్న‌ర సంవ‌త్స‌రాలుగా ఎన్టీఆర్‌ను అభిమానులు థియేట‌ర్ల‌లో చూడ‌లేదు. దీంతో ఎన్టీఆర్ సినిమా ఎప్పుడు వ‌స్తుందా ? అని క‌ళ్లుకాయ‌లు కాచిపోయి ఉన్నారు. త్రిపుల్ ఆర్ సంక్రాంతికి వ‌స్తుంద‌ని అనుకున్నారు. ఒమిక్రాన్ దెబ్బ‌తో త్రిపుల్ ఆర్ కూడా స‌మ్మ‌ర్‌కు వెళ్లిపోయింది.

ఇక మ‌ధ్య‌లో ఎన్టీఆర్ – త్రివిక్ర‌మ్ సినిమా ప‌ట్టాలు ఎక్కాల్సి ఉన్నా కూడా కొన్ని కార‌ణాల వ‌ల్ల ఈ ప్రాజెక్టు క్యాన్సిల్ అయ్యింది. ఇక ఎన్టీఆర్ 30వ సినిమా కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నుంది. యువ‌సుధా ఆర్ట్స్ – ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్లు సంయుక్తంగా ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నాయి. ఇక క‌రోనా టైంలో ఎన్టీఆర్ చాలా క‌థ‌లు విన్ లాక్ చేశాడు. ఇప్పుడు వ‌రుస పెట్టి సినిమాలు చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్నాడు. ఈ క్ర‌మంలోనే ముందుగా కొర‌టాల శివ సినిమా ప‌ట్టాలు ఎక్క‌నుంది.

ఇక ఈ క్రేజీ ప్రాజెక్టుపై ఫ్యాన్స్ పండ‌గ చేస్కొనే అప్‌డేట్ వ‌చ్చేసింది. ఈ సినిమాను ఫిబ్ర‌వ‌రి ఫ‌స్ట్ వీక్‌లోనే సెట్స్ మీద‌కు తీసుకు వెళ్ల‌నున్నార‌ట‌. ఇక హీరోయిన్‌గా ఖ‌చ్చితంగా బాలీవుడ్ నుంచే ఉంటుంద‌ని అంటున్నారు. త్రిపుల్ ఆర్ త‌ర్వాత ఎన్టీఆర్ న‌టిస్తోన్న సినిమా కావ‌డంతో కొర‌టాల శివ దీనిని పాన్ ఇండియా ప్రాజెక్టుగా మ‌ల‌చ‌నున్నాడు. అయితే జూలై లేదా ద‌స‌రాకు ఈ సినిమాను రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఏదేమైనా వ‌చ్చే యేడాది ఎన్టీఆర్ న‌టించిన రెండు సినిమాలు థియేట‌ర్ల‌లోకి దిగ‌నున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news