Moviesఇప్పుడే అలాంటి పని చేయలేను..ఆలోచించి అన్నీ అనుకూలిస్తే ఖచ్చితంగా చేస్తా..నాగ్ సంచలన...

ఇప్పుడే అలాంటి పని చేయలేను..ఆలోచించి అన్నీ అనుకూలిస్తే ఖచ్చితంగా చేస్తా..నాగ్ సంచలన వ్యాఖ్యలు..!!

టాలీవుడ్ మన్మధుడు నాగార్జున ఏం చేసిన దానికి ముందు బ్యాక్ గ్రౌండ్ వర్క్ చాలానే చేస్తారు. ఆయన క్యాలికులేషన్స్ ఆయనకి ఉంటాయి. నాగార్జున – రమ్యకృష్ణ కీలక పాత్రలో 2016 సంక్రాంతి కానుక రిలీజైన సోగ్గాడే చిన్నినాయన సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ సినిమాతోనే కళ్యాణ్ కృష్ణ దర్శకుడిగా పరిచయం అవ్వడమే కాకుండా బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. అప్పట్లోనే నాలుగు పెద్ద పెద్ద సినిమాల మధ్య పోటీగా రిలీజ్ అయిన సోగ్గాడే చాలా రోజుల తర్వాత నాగార్జునకు మంచి విజయాన్ని అందించింది. నాగార్జున కెరీర్లో తొలి రు. 50 కోట్ల సినిమాగా నిలిచిపోయింది. ఇక ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ గా వచ్చిన బంగార్రాజు సినిమా కూడా ఎవ్వరు ఊహించని విధంగా సంక్రాంతి రేస్ లోకి వచ్చి..రిలీజ్ అయ్యి తిరుగులేని విజయాని అందుకుంది.

దీంతో ఈ సంక్రాంతి హవా మొత్తం అక్కినేని వారసులదే అనిపిస్తోంది. అక్కినేని నాగార్జున, నాగ చైతన్య కలిసి నటించిన ‘బంగార్రాజు’ సినిమాకు అన్ని ఏరియాల్లో పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. తొలి షోతోనే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా కలెక్షన్స్ పరంగా కూడా అదరగొడితుంది. ఇక మూడో రోజు కూడా అదే కంటిన్యూ చేస్తూ రెండు తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త రికార్డు నెలకొల్పింది. దీంతో మీడియాతో మాట్లాడిన నాగార్జున..సినిమా సక్సెస్ అవ్వడం పట్ల ఆనందం వ్యక్తం చేసాడు.

ఇక ఈ క్రమంలోనే ఆయన మాట్లాడుతూ..బంగార్రాజు సినిమాకి కూడా సీక్వెల్ వస్తుందా అని అడగ్గా.. ఆయన రాదు అని చెప్పలేం కానీ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అంటూ హింట్ ఇచ్చాడు. ఈ సినిమాలో ముగింపులో చూపిన‌ట్లుగా మ‌రో సినిమాకూడా తీయ‌వ‌చ్చు. ద‌ర్శ‌కుడు ఓ క్లూ కూడా ఇచ్చాడు. ప్ర‌తి 24 ఏళ్ళ‌కు శివాల‌యంలో హోమం చేయాల‌ని.. కానీ ఇప్పుడ‌ప్పుడే సినిమా చేయలేం. ఆలోచించి అన్నీ అనుకూలిస్తే అప్పుడు చూద్దాం అని తెలిపారు నాగార్జున. ప్రస్తుతం అక్కినేని ఫ్యామిలీ బంగార్రాజు సక్సెస్ ను ఎంజాయ్ చేస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news