Moviesచ‌ర‌ణ్ హీరోయిన్‌తో చిరు రొమాన్స్‌... మెగా 154లో ఆ ముద్దుగుమ్మ ఫిక్స్‌..!

చ‌ర‌ణ్ హీరోయిన్‌తో చిరు రొమాన్స్‌… మెగా 154లో ఆ ముద్దుగుమ్మ ఫిక్స్‌..!

టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ శృతీహాస‌న్ త‌న కెరీర్ ఇక్క‌డ స్వింగ్‌లో ఉంది అనుకున్న టైంలో చేజేతులా నాశ‌నం చేసుకుంది. అదే టైంలో ప్రేమ‌లో ప‌డ‌డం, డేటింగుల‌తో శృతి ఫేడ‌వుట్ అయిపోయింది. ఇలియానా ఏ రాంగ్ స్టెప్ వేసి కెరీర్ నాశ‌నం చేసుకుందో శృతీ కెరీర్ కూడా అలాగే నాశ‌న‌మైంది. ఆ త‌ర్వాత త‌ప్పు తెలుసుకుని ఆమె ఛాన్సుల కోసం ప్ర‌య‌త్నిస్తున్నా.. ఇప్పుడు సీనియ‌ర్ హీరోలు మాత్ర‌మే శృతికి గ‌త‌య్యారు.

క్రాక్ సినిమాతో తెలుగులో రీ ఎంట్రీ ఇచ్చి స‌క్సెస్ అయిన శృతి ఇప్పుడు ఆ సినిమా డైరెక్ట‌ర్ మ‌లినేని గోపీచంద్ పుణ్యామా ? అని బాల‌య్య ప‌క్క‌న న‌టిస్తోంది. బాల‌య్య – మ‌లినేని గోపీచంద్ కాంబోలో వ‌స్తోన్న సినిమాలో ఆమె హీరోయిన్‌గా ఎంపికైంది. ఇక ఇప్పుడు మ‌రో సీనియ‌ర్ హీరో మెగాస్టార్ చిరంజీవి ప‌క్క‌న కూడా ఆమె హీరోయిన్‌గా ఎంపికైన‌ట్టు తెలుస్తోంది.

చిరంజీవి – బాబి కాంబోలో వాల్తేరు వీర‌య్య టైటిల్‌తో ఓ సినిమా తెర‌కెక్క‌నుంది. త్వ‌ర‌లో షూటింగ్ స్టార్ట్ కానున్న ఈ సినిమాలో శృతీహాస‌న్‌ను హీరోయిన్‌గా తీసుకోవాల‌ని ఫిక్స్ అయిన‌ట్టుగా తెలుస్తోంది. మైత్రీ మూవీస్ వాళ్లు నిర్మిస్తోన్న ఈ సినిమాలో భారీ రెమ్యున‌రేష‌న్ ఆఫ‌ర్ చేసి మ‌రీ శృతిని హీరోయిన్‌గా ఫిక్స్ చేసిన‌ట్టు తెలుస్తోంది. ఇప్ప‌టికే ఈ సినిమాకు సంబంధించి రిలీజ్ అయిన రెండు పోస్ట‌ర్ల‌కు మాంచి రెస్పాన్స్ కూడా వ‌చ్చింది.

ఇక గ‌తంలో శృతి చిరు త‌న‌యుడు చ‌ర‌ణ్ ప‌క్క‌న ఎవ‌డు సినిమాలో న‌టించింది. వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఆ సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర హిట్ అయ్యింది. నాడు కొడుకుతో న‌టించిన శృతి ఇప్పుడు తండ్రితో ఆన్‌స్క్రీన్ రొమాన్స్‌కు రెడీ అవుతోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news