Moviesకేక పెట్టించే న్యూస్‌... ఎన్టీఆర్ 30 కోసం బ‌న్నీ...!

కేక పెట్టించే న్యూస్‌… ఎన్టీఆర్ 30 కోసం బ‌న్నీ…!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ – డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో ఓ సినిమా వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే. ఎన్టీఆర్ కెరీర్‌లో 25వ సినిమాగా ఈ క్రేజీ ప్రాజెక్టు వ‌స్తోంది. గ‌తంలో కొర‌టాల – ఎన్టీఆర్ కాంబోలో వ‌చ్చిన జ‌న‌తా గ్యారేజ్ సినిమా సూప‌ర్ హిట్ అయ్యింది. ఎన్టీఆర్ ఆర్ట్స్ – యువ‌సుధా ఆర్ట్స్ సంయుక్తంగా భారీ బ‌డ్జెట్‌తో పాన్ ఇండియా రేంజ్‌లో ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నాయి. జై ల‌వ‌కుశ సినిమా త‌ర్వాత త‌న అన్న క‌ళ్యాణ్‌రామ్ బ్యాన‌ర్లో ఎన్టీఆర్ చేస్తోన్న సినిమా ఇదే.

పాన్ ఇండియా రేంజ్‌లో ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా ఆలియాభ‌ట్ పేరు దాదాపు ఫైన‌లైజ్ అయ్యింది. ఈ సినిమా షూటింగ్ ఫిబ్ర‌వ‌రిలో ప్రారంభ‌మ‌వుతుంద‌ని ఎన్టీఆర్ ఇప్ప‌టికే చెప్పారు. ఇక ఈ సినిమాను ఫిబ్ర‌వ‌రి 7న పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభించ‌నున్నారు. ఈ వేడుక‌కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చీఫ్‌గెస్ట్‌గా రానున్నార‌ట‌. ఇది ఇప్పుడు టాలీవుడ్‌లో కెవ్వు కేక న్యూస్‌గా మారింది.

గ‌తంలో బ‌న్నీ అల వైకుంఠ‌పురంలో సినిమా రిలీజ్ అయిన‌ప్పుడు బావ అంటూ ఎన్టీఆర్ చాలా ప్రేమ‌గా బ‌న్నీ సినిమా హిట్ అయినందును శుభాకాంక్ష‌లు చెప్పాడు. బావ అని ఎన్టీఆర్ బ‌న్నీని పిల‌వ‌డంతో వీరిద్ద‌రి మ‌ధ్య బంధం, అప్యాయ‌త అప్ప‌ట్లో చ‌ర్చ‌కు వ‌చ్చింది. వాస్త‌వానికి బ‌న్నీ నెక్ట్స్ సినిమా కొర‌టాల‌తోనే చేయాలి. అయితే త్రివిక్ర‌మ్ – ఎన్టీఆర్ సినిమా క్యాన్సిల్ కావ‌డంతో ఆచార్య త‌ర్వాత కొర‌టాల .. ఎన్టీఆర్‌కు క‌మిట్ అయ్యాడు.

 

ఇక ఇప్పుడు కొర‌టాల తెర‌కెక్కించే ఈ సినిమా ఓపెనింగ్ గెస్టుగా బ‌న్నీ వ‌స్తుండ‌డంతో ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లోనూ చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఇక పొలిటిక‌ల్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా తెర‌కెక్కుతున్న‌ట్టు తెలుస్తోంది. ఆర్ ఆర్ ఆర్ త‌ర్వాత ఆలియాభ‌ట్ తెలుగులో న‌టించే సినిమా ఇదే అవుతుంది. కోలీవుడ్ క్రేజీ మ్యూజిక్ డైరెక్ట‌ర్ అనిరుధ్ ర‌విచంద్ర‌న్ మ్యూజిక్ ఇస్తోన్న ఈ సినిమాకు స్టార్ సినిమాటోగ్రాఫ‌ర్ ర‌త్న‌వేలు వ‌ర్క్ చేస్తున్నారు. ద‌స‌రాకు రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news