Movies35 ఏళ్లుగా మా రెండు ఫ్యామిలీల మధ్య పోరు ఉంది..ఎన్టీఆర్‌ సంచలన...

35 ఏళ్లుగా మా రెండు ఫ్యామిలీల మధ్య పోరు ఉంది..ఎన్టీఆర్‌ సంచలన వ్యాఖ్యలు

దేశంలోనే అతిపెద్ద యాక్షన్ ఎంటర్టైనర్ గా మన ముందుకు రాబోతున్న చిత్రం ఆర్ ఆర్ ఆర్. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ ఆర్ ఆర్ చిత్రం జనవరి 7 న రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. హీరో రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రమోషన్స్ కూడా విపరీతంగా చేస్తున్నారు. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు, ఎన్టీఆర్ కొమరం భీమ్ గా కనిపించబోతున్నాడు. ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి ఇలా అందరూ కూడా ప్రమోషన్స్ చేస్తూ ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్నారు.

రాజమౌళి , ఎన్టీఆర్ , రామ్ చరణ్ ముంబైలోనే ఎక్కువగా ఉంటున్నారు. బాలీవుడ్ మీడియా ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు. బాహుబలి దర్శకుడి నుండి వస్తున్న తదుపరి చిత్రంగా ఆర్ఆర్ఆర్ ఇప్పటికే నార్త్ లో క్రేజ్ రాబట్టింది. అయినప్పటికీ ప్రమోషన్స్ లో ఏమాత్రం అలసత్వం ప్రదర్శించకూడదని రాజమౌళి గట్టి నిర్ణయం తీసుకున్నట్లున్నారు. ఆర్ఆర్ఆర్ హీరోలతో కలిసి భారీ ఎత్తున ప్రమోషనల్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.అక్కడి లోకల్, నేషనల్ మీడియాతో ప్రముఖంగా ముచ్చటిస్తున్నారు ఈ ముగ్గురు.

తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో మల్టీస్టారర్ మూవీస్ గురించి ఎన్టీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో.. ఆర్‌ఆర్‌ఆర్‌ తర్వాత మరిన్ని మల్టీస్టారర్‌ చిత్రాలు వచ్చే అవకాశాలున్నాయి అని ప్రశ్నించగా ఎన్టీఆర్‌ ఆసక్తికరం‍గా స్పందించారు. ఆయన మాట్లాడుతూ..” అసలు ఈ విషయం ఇప్పుడు చెప్పొచ్చో లేదో నాకు తెలీదు కానీ నేను నా మనసులో ఉన్నది ఉన్నట్లు చెప్పేస్తున్నా.

నిజానికి మా(మెగా వ్స్ నందమూరి) రెండు కుటుంబాల మధ్య గత 35 ఏళ్లుగా విపరీతమీనపోరు నడుస్తోంది. కానీ నేను, రామ్ చరణ్ మంచి ఫ్రెండ్స్. మా మధ్య కూడా పోరు ఉంటుంది. కానీన్ అది ఎప్పుడూ సానుకూల ధోరణిలోనే ఉంటుంది. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత దేశంలోని అగ్ర హీరోలందరూ కూడా కలిసి భారీ మల్టీ స్టారర్ చిత్రాల్లో నటిస్తారని నేను భావిస్తున్నా” అంటూ చెప్పుకొచ్చారు తారక్


ఇక ఈ సినిమాలో అలియా భట్, ఓలియా మోరిస్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. డివివి దానయ్య దాదాపు రూ. 500 కోట్ల బడ్జెట్ తో ఆర్ ఆర్ ఆర్ నిర్మించారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. అజయ్ దేవ్ గణ్, సముద్ర ఖని, శ్రీయా శరణ్ కీలక రోల్స్ చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news