Moviesతారక్ నా బ్రదర్..ఎప్పటికి నా మనసులోనే ఉంటాడు..చరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

తారక్ నా బ్రదర్..ఎప్పటికి నా మనసులోనే ఉంటాడు..చరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

కేవలం టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ తో పాటు స్టార్ సెలబ్రిటీలు కూడా ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్న సినిమా ఆర్ ఆర్ ఆర్. ఈ సినిమాలోని ప్రతి ఒక్క క్యారెక్టర్ ను డైరెక్టర్ రాజమౌళి ఎంతో ఢిఫ్రెంట్ గా డిజైన్ చేసారు. దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ‘రౌద్రం..రణం..రుధిరం’(ఆర్‌ఆర్‌ఆర్‌)’మూవీ కోసం ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది సినీప్రియులు ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాపై కేవలం తెలుగులోనే కాకుండా దేశంలోని అన్ని భాషల ఇండస్ట్రీల్లో భారీ అంచనాలున్నాయి.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఈ సినిమాపై అంచనాలు అయితే మాములుగా లేవు. అన్ని వర్గాల ప్రేక్షకులు కూడా ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

ఇక రీసెంట్ గా చెన్నైలో జరిగిన ఆర్ఆర్ఆర్ ప్రీ-రిలీజ్ ఈవెంట్లో రామ్ చరణ్, తారక్, రాజమౌళి ముగ్గురు కూడా బాగా ఎమోషనల్ అయ్యారు. వాళ్ల మధ్య ఉన్న సంబంధం గురించి చెప్పుతూ..స్టజీ పైనా రాజమౌళి ఎమోషనల్ కావడంతో టీవీ లో చూస్తున్న అభిమానులు కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో శివకార్తికేయన్, ఉదయనిధి స్టాలిన్, ఆర్బీ చౌదరి, కలైపులి ఎస్.థాను ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ తారక్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసారు. తారక్‌లాంటి నిజమైన బ్రదర్‌ని ఇచ్చినందుకు దేవుడికి థ్యాంక్స్‌ అంటూ ఎమోషనల్‌ అయ్యాడు.

ఆయన మాట్లాడుతూ.. ‘ ఎప్పటినుండో లైకా ప్రొడక్షన్స్‌తో పని చేయాలి అనుకుంటున్న నాకు అది ఆర్ఆర్ఆర్‌తో సాధ్యం అయింది అంటూ.. రాజమౌళి గారిని హెడ్మాస్టర్ అనాలా.. ప్రిన్సిపల్ అనాలా.. గైడ్ అనాలా..తెలియట్లేదు అంటూనే నాకు ఎన్టీఆర్ లాంటి సోదరుడిని ఇచ్చినందుకు రాజమౌళికి ఎంతో థ్యాంక్స్ .అని చెప్పుకొచ్చారు. నేను ఈ సినిమాకి వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి ద్యాంక్స్ చెప్తాను కానీ తారక్‌కు మాత్రం చెప్పను . ఎందుకంటే నేను దేవుడికి థ్యాంక్స్ చెప్తాను. ఇటువంటి సోదరుడిని ఇచ్చినందుకు ఆయనకే థ్యాంక్స్ చెప్పాలి. ఎన్టీఆర్‌కు థ్యాంక్స్ చెప్తే ఈ రిలేషన్ ఇక్కడే ముగిసిపోతుందేమో అని భయంగా ఉంది. తారక్ చనిపోయే వరకు నా మనసులో ఉంటాడు.’ అని రామ్ చరణ్ అన్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news