Moviesచిరంజీవికి ముఖ్య‌మంత్రి అవ్వాల‌న్న కోరిక పుట్టించిన సినిమా ఇదే..!

చిరంజీవికి ముఖ్య‌మంత్రి అవ్వాల‌న్న కోరిక పుట్టించిన సినిమా ఇదే..!

మెగాస్టార్ చిరంజీవి తెలుగు తెరపై ఎప్పటికీ మెగాస్టార్. నాలుగు దశాబ్దాల క్రితం హీరోగా ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి తన సినిమాలతో అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో మెగాస్టార్ గా నిలిచిపోయారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు దశాబ్దాలపాటు స్టార్ హీరోగా కొనసాగటం అంటే మామూలు విషయం కాదు. ఈ వయసులోను చిరంజీవి తన సినిమాలతో వంద కోట్లకు పైగా వసూళ్లను సాధిస్తున్నారు. పదేళ్ళ పాటు సినిమాలకు దూరంగా ఉన్న చిరు ఖైదీ నెంబర్ 150 సినిమా తో రీ ఎంట్రీ ఇచ్చి కూడా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి… తన స్టామినా ఏమాత్రం తగ్గలేదని నిరూపించుకున్నారు.

2008లో ప్రజారాజ్యం పార్టీ పెట్టిన చిరంజీవి ఎన్నికల్లో పోటీ చేసి సక్సెస్ కాలేదు. చిరంజీవి రాజకీయాల్లో విజయం సాధించకపోయినా సినిమాల్లో మాత్రం ఆయన ఎప్పటికీ తిరుగులేని హీరోగా నిలిచిపోయారు. అసలు చిరంజీవికి రాజకీయాల్లోకి రావాలనే కోరిక ఎలా కలిగింది ? ఆయన అభిమానులు కూడా ఆయనను రాజకీయాల్లోకి ఎందుకు ? ఆహ్వానించారు ఇందుకు కారణమైన సినిమా ఏంటన్నది పరిశీలిస్తే ఆసక్తికర విషయాలు తెలుస్తాయి.

చిరంజీవి – కోదండరామిరెడ్డి కాంబినేషన్ లో ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన చివ‌రి సినిమా ముఠామేస్త్రి. కొండవీటి దొంగ సినిమా తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో సినిమాలు రాకపోవడంతో వీరిద్దరూ విడిపోయారని ప్రచారం జరిగింది. అయితే అవన్నీ నిజం కాదని 1993లో వచ్చిన ముఠామేస్త్రి సినిమా నిరూపించింది. మార్కెట్ యార్డ్ లో పని చేసే ఒక సాధారణ కూలి అనుకోకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి కావడమే ఈ సినిమా కథాంశం. చిరంజీవి పక్క‌న మీనా – రోజా హీరోయిన్లుగా నటించారు.

సినిమాలో చిరంజీవి ముఖ్యమంత్రి అయ్యాక రాజకీయాల్లోకి వస్తారా రారా ? అన్న చర్చ జరుగుతుండ‌గా సినిమా చివర్లో మళ్ళీ ఎప్పుడైనా ప్రజాస్వామ్యానికే ప్రమాదం వాటిల్లితే పిలవండి స్పీడైపోతా ? అంటూ ఒక డైలాగ్ చెబుతారు. ఈ డైలాగ్ దర్శకుడు కోదండరామిరెడ్డి ప‌రుచూరి సోదరులతో ప్రత్యేకంగా రాయించారు. ఈ డైలాగ్ అప్పట్లో బాగా పాపులర్ అయింది. అప్పటి నుంచి చిరంజీవి అభిమానులు ఆయన రాజకీయాల్లోకి రావాలని కాబోయే ముఖ్యమంత్రి అని నినాదాలు చేస్తూ వచ్చారు.

ఆ సినిమా వచ్చిన 15 సంవత్సరాలకు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టి ఎన్నికల్లో పోటీ చేశారు. అయితే ఇంద్ర – ఠాగూర్ సినిమాలతో సూపర్ హిట్లు కొట్టినప్పుడు కూడా చిరంజీవి రాజకీయాల్లోకి రావాలని డిమాండ్లు ఎక్కువగా వినిపించాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news