Moviesఆ స్టార్ హీరోయిన్ మూడు పెళ్లిళ్ల వెన‌క స్టోరీ ఇదే..!

ఆ స్టార్ హీరోయిన్ మూడు పెళ్లిళ్ల వెన‌క స్టోరీ ఇదే..!

సినిమా ఇండ‌స్ట్రీలో ఉన్న వారికి ప్రేమ‌లు, పెళ్లిళ్లు, పెటాకులు చాలా కామ‌న్ అన్న‌ది తెలిసిందే. కొంద‌రు హీరోయిన్లు అయితే ఒక‌టి కాదు రెండు కాదు ఏకంగా మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు. సౌత్ నుంచి నార్త్ వ‌ర‌కు మూడు, నాలుగు పెళ్లిళ్లు చేసుకున్న హీరోల‌ను మ‌నం చాలా మందినే చూశాం. తెలుగులో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, త‌మిళంలో శివాజీ గ‌ణేష‌న్ ఇలా చాలా మంది హీరోలు మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు. అయితే మ‌న సౌత్‌లోనే.. మ‌న తెలుగులో న‌టించిన స్టార్ హీరోయిన్లు కూడా మూడు పెళ్లిళ్లు చేసుకున్న వారు ఉన్నారు.

సీనియ‌ర్ న‌టి జ‌యంతి మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు. అయితే ఆ మూడు పెళ్లిళ్లు కూడా పెటాకులు అయ్యాయి. ఇక మ‌రో సీనియ‌ర్ న‌టి రాధిక సైతం మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు. రాధిక స్టార్ హీరోయిన్ అయినా కూడా ఆమె వైవాహిక జీవితం విష‌యంలో ఎన్నో ఇబ్బందులు ప‌డింది. ముందుగా ఆమె మ‌ళ‌యాళ ద‌ర్శ‌కుడు ప్ర‌తాప్ పోత‌న్‌ను పెళ్లి చేసుకుంది. త‌ర్వాత మ‌న‌స్ప‌ర్థ‌ల కార‌ణంగా అత‌డి నుంచి విడిపోయింది.

ఆ త‌ర్వాత లండ‌న్‌లో ఉండే ఓ వ్య‌క్తిని పెళ్లి చేసుకుంది. అత‌డితో క‌లిసి ఓ పాప‌కు జ‌న్మ‌నిచ్చాక అక్క‌డ కూడా రాధిక ఉండ‌లేక‌పోయింది. ఆ త‌ర్వాత ఇండియాకు వ‌చ్చేసి చెన్నైలో ఉంటోన్న క్ర‌మంలోనే సీనియ‌ర్ హీరో శ‌ర‌త్ కుమార్‌కు ద‌గ్గ‌రై అత‌డిని ముచ్చ‌ట‌గా మూడో పెళ్లి చేసుకుంది. ఇక ఇప్పుడు శ‌ర‌త్ కుమార్‌తో క‌లిసి వ‌రుస‌గా సీరియ‌ల్స్ నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టి స‌క్సెస్ అయ్యింది.

ఇప్పుడు ఆమె సౌత్ బుల్లితెర‌పై ఓ ఫీమేల్ లీడ్ క్యారెక్ట‌ర్ల విష‌యంలో మంచి పేరు తెచ్చుకున్నారు.
అటు శ‌ర‌త్ కుమార్‌కు కూడా త‌న మొద‌టి భార్య‌కు విడాకులు ఇచ్చేసి రాధిక‌ను పెళ్లి చేసుకున్నాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news